
పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి
నర్సంపేట: విద్యార్థులు రాబోయే పోటీ పరీక్షలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మల్లం నవీన్ అన్నారు. ఈ మేరకు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కెరియర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో సోమవారం పరీక్షలు–విద్యార్థుల సన్నద్ధత అనే అంశంపై అవగాహన సద స్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికతో చదివితే విజ యం సాధించవచ్చన్నారు. ములుగు ప్రిన్సిపల్ కె.మల్లేషం మాట్లాడుతూ టీజీపీఎస్‌సీ జాబ్ క్యా లెండర్ ప్రకారం గ్రూప్స్, పోలీసు ఉద్యోగ ప్రకటనలు వస్తాయని, ఆయా పోటీ పరీక్షలలో విద్యార్థులు అనుసరించాల్సిన ప్రణాళికలను వివరించారు. విశిష్ట అతిథి గ్రూప్–2 మహిళా టా పర్ బిళ్ల శ్రావణి మాట్లాడుతూ సొంతంగా నోట్స్ తయారు చేసుకుంటే రివిజన్ సులభమవుతుందని, తద్వారా గ్రూప్ పరీక్షలలో విజయం సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఎం.సోమయ్య, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.సత్యనారాయణ, కందాల సత్యనారాయణ, ఎంఎంకె.రహీమోద్దీన్, ఎస్.కమలాకర్, బి.గాయత్రి, రాంబాబు, భద్రు, రుద్రాణి, రజిత, సంధ్య, పూర్ణచందర్, వీరన్న, గణేష్, రమేష్, ఏఓ అనిత, మాధవి, నిజాం, భార్గవి, ఆనందరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.