
ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు
వరంగల్: యాసంగి ధాన్యం కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి సహకార శాఖ, ఐకేపీ, రెవెన్యూ, వ్య వసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం ని ర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ జిల్లాలో 2024–25 సంవత్సరానికి సుమారు 182 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 1.90 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం, 30 వేల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సహకార శాఖ 107, ఐకేపీ ఆధ్వర్యంలో 60, మెప్మా ఆధ్వర్యంలో 2, ఎఫ్‌పీఓ ఆధ్వర్యంలో 13 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ కౌసల్య దేవి, డీసీఎస్‌ఓ కిష్టయ్య, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ సంధ్యారాణి, జిల్లా సహకార అధికారి నీరజ, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, జిల్లా అధికారులు నీరజ, రేణుక తదితరులు పాల్గొన్నారు.
మద్యం దుకాణాలపై ఫిర్యాదు
జిల్లాలోని గీసుకొండ మండలం పోతరాజుపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల, అంగనన్‌డాడీ కేంద్రానికి 50 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన అక్రమ మద్యం దుకాణాలపై ఫిర్యాదులు వచ్చాయని, తక్షణమే వాటిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. మన ఊరు మనబడి మనబస్తీ మనబడి అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్షించారు. ఆయా పాఠశాలల్లో పెండింగ్ పనులపై ఇంజనీరింగ్, విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పనుల పురోగతిపై పూర్తి వివరాలతో ఎంబీలు సమర్పించాలని ఎంఈఓలు, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద