
ఈదురుగాలుల బీభత్సం
నర్సంపేట:జేసీబీ సాయంతో విరిగిపడిన చెట్లను తొలగిస్తున్న పోలీసులు, విద్యుత్ సిబ్బంది
నర్సంపేట/దుగ్గొండి/ఖానాపురం: నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా సోమవారం రాత్రి ఈదురుగాలుల బీభత్సం సృష్టించింది. అకస్మాత్తుగా వీచి న గాలులతో చెట్ల కొమ్మలు విరిగిపడి విద్యుత్ సరఫరా నిలిపోయింది. నర్సంపేట పీఎస్ పరిధి లోని మహేశ్వరం, లక్నేపల్లి ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న విద్యుత్ సిబ్బంది, సీఐ రమణమూర్తి, ఎస్‌ఐ అరుణ్, సిబ్బంది కలిసి కూలిన చెట్లను తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. తొగర్రాయి గ్రామానికి చెందిన ఓ రైతు తన పంట వ్యర్ధాలను తగులబె ట్టి ఇంటికి వెళ్లాడు. అకస్మాత్తుగా మంటలు రగులుకుని చుట్టు పక్కలకు విస్తరించాయి. దీంతో నాచినపల్లి గ్రామానికి చెందిన ఇజ్జగిరి సదయ్య కు చెందిన ఎకరాల మొక్కజొన్న చేను మంటల్లో దగ్ధమైంది. ఆయనతో పాటు చుట్టూ పక్కల రైతుల చేనులకు మంటలు వ్యాపించాయి. తొగర్రాయిలో ప్రారంభమైన మంటలు కొమ్మాల దేవస్థానం వరకు వ్యాపించాయి. రైతులకు పెద్ద ఎత్తున నష్టం సంభవించడంతో ఆందోళన చెందుతున్నారు. అలాగే నర్సంపేట నుంచి కొత్తగూడకు వెళ్లే దారిలో చెట్లు నేలకూలడంతో ప్రయాణికుల రాకపోకలు నిలిచిపోయాయి.

ఈదురుగాలుల బీభత్సం