
నీటిఎద్దడి లేకుండా చూడాలి
నర్సంపేట: వేసవిలో నీటిఎద్దడి లేకుండా చూడాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధి కారులను ఆదేశించారు. నర్సంపేట పట్టణంలో ఆర్‌డబ్ల్యూఎస్, మున్సిపల్, ఎంపీడీఓలతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని గ్రామాల్లో అధికారులు పర్యటించి సమస్యలు తెలుసుకుని త్వరితగతిన పరిష్కారం చేయాలని సూచించారు. నర్సంపేట పట్టణంలో జరుగుతున్న అమృత్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. సమీక్షలో నర్సంపేట, నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్లు పాలాయి శ్రీనివాస్, హరీశ్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈలు దేవేందర్‌రెడ్డి, అజహర్, పబ్లిక్ హెల్త్ డీఈ రవీంద్రనాథ్, అన్ని మండలాల ఎంపీడీఓలు, ఏఈలు పాల్గొన్నారు.
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి