
వరంగల్
బుధవారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
నిఘా నీడలో మూల్యాంకనం
టెన్త్ విద్యార్థుల పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం అధికారులు సీసీ కెమెరాల నిఘాలో పర్యవేక్షిస్తున్నారు.
– 8లోu
కొమ్మాల ఆలయ ఆదాయం రూ.64.80 లక్షలు
గీసుకొండ: మండలంలోని ప్రసిద్ధ కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి రూ. 64,80,254 ఆదాయం సమకూరిందని ఈఓ అద్దంకి నాగేశ్వర్‌రావు తెలిపారు. జాతర అనంతరం మార్చి 25 నుంచి ఏప్రిల్ 8 వరకు వచ్చిన ఆదాయాన్ని ఆలయ ప్రాంగణంలో మంగళవారం లెక్కించారు. హుండీ ఆదాయం రూ.9,16,892, ఇతర సేవల ద్వారా రూ. 6,52,266 ఆదాయం సమకూరిందని ఆయన పేర్కొన్నారు. ఇవన్నీ కలిపి రూ. 15,69,158 రాగా.. జాతర, బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చిన ఆదాయం రూ. 49,11,096 కలుపుకుంటే రూ.64,84,254 ఆదాయం వచ్చిందని వివరించారు. ఇంత మొత్తం ఆదాయం జాతర చరిత్రలో ఎన్నడూ సమకూరలేదని చెబుతున్నారు. రెండోసారి హుండీ లెక్కింపులో మిశ్రమ వెండి నాలుగు కిలోలు, మిశ్రమ బంగారం 12 గ్రాములు వచ్చిందని పేర్కొన్నారు. హుండీ లెక్కింపులో ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, దేవా దాయ శాఖ పరిశీలకుడు డి.అనిల్‌కుమార్, శ్రీ లక్ష్మీ సేవాసమితి సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
వైద్యులు సమయపాలన
పాటించాలి
దుగ్గొండి: వైద్యులు, స్బింది సమయపాలన పాటించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి సాంబశివరావు ఆదేశించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వివిధ రకాల రికార్డులు పరిశీలించారు. పరిసరాలను పరిశీలించి అపరిశుభ్రతపై అసహనం వ్యక్తం చేశారు. వెంటనే శుభ్రం చేయించాలని వైద్యులను ఆదేశించారు. అనంతరం ఆయన సిబ్బందితో మాట్లాడారు. వైద్యులు అందుబాటులో ఉండాలని, వంతుల వారీగా విధులు నిర్వర్తిస్తామంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏఎన్‌ఎంలు ప్రతిరోజు సబ్ సెంటర్ పరిధిలోని గ్రామాలను సందర్శించాలని, ఆశ కార్యకర్తలు ప్రతి ఇంటిలో వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవాలని సూచించారు. డీఎంహెచ్‌ఓ వెంట వైద్యులు రాకేశ్, భరత్‌కుమార్, సీహెచ్‌ఓ సాంబయ్య, సలోమి, స్టాఫ్‌నర్సు సబిత, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు ఉన్నారు.
నాగేంద్రస్వామికి పూజలు
గీసుకొండ: మండలంలోని ఊకల్‌హవేలి నాగేంద్రస్వామి ఆలయంలో పలువురు ప్రముఖులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య దంపతులు, కాసం వస్త్ర ప్రపంచం యజమాని కాసం నమశ్శివాయ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ పెసరు విజయ్‌చందర్‌రెడ్డి తన జన్మదిన సందర్భంగా సతీసమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ప్రధా న అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు, శ్రీ హర్ష ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి పూజలు చేశారు. సర్వేశాం ఏకాదశి సందర్భంగా భక్తులు అధికంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
ఎల్‌ఆర్‌ఎస్–2015 దరఖాస్తుల పరిష్కారంలో ‘కుడా’ జాప్యం
● ప్రభుత్వం ఆదేశించినా
పట్టించుకోని అధికారులు
● పదేళ్లుగా మూడువేల మంది
అర్జీదారుల ఇబ్బందులు
● ఉన్నతాధికారులు దృష్టి సారిస్తేనే
సమస్య కొలిక్కి
సాక్షి, వరంగల్: లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్)–2015 దరఖాస్తుదారులు రూ.10 వేల ఫీజు చెల్లించినా అవి క్లియర్ కాక నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది. 2020 అక్టోబర్ 12న ఇచ్చిన ఎల్‌ఆర్‌ఎస్ ఉత్తర్వుల్లో కూడా 2015 ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులపై ప్రభుత్వం స్పష్టమైనా ఆదేశాలిచ్చినా ఆచరణలో మాత్రం ఎక్కడా క్లియర్ అయినట్లుగా కనిపించడం లేదు. పరిష్కరిస్తే రూ.కోట్లలో ఆదాయం వచ్చే అవకాశమున్నా ఆవైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు న్నాయి. 2015లో మాన్యువల్‌గా ‘కుడా’కు కట్టిన చలాన్లు, దరఖాస్తుదారులు కూడా హనుమకొండలోని ‘కుడా’ కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఉంది.‘కుడా’లో 2015కు సంబంధించిన ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు మూడువేల వరకు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. క్లియర్ చేస్తే రూ.10 వేలు పోగా మిగిలిన నగదు చెల్లిస్తామని లిఖితపూర్వకంగా ‘కుడా’ అధికారులకు ఇస్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
రూ.లక్షల భారం..
ఇల్లు నిర్మించుకునేందుకు కొంతమంది అనుమతి కోసం వెళితే ప్రస్తుతమున్న మార్కెట్ విలువ ప్రకారం బల్దియా అధికారులు లెక్కలు వేస్తుండడంతో రూ.లక్షల్లో ఫీజు కట్టాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇందులో ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు 14 శాతంతో పాటు కాంపౌండ్ ఫీజు 33 శాతం వసూలు చేస్తుండడం గమనార్హం. అదే 2020లో ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రం ఇన్నాళ్లు ఇంటి నిర్మాణ సమయంలో సదరు రిసిప్ట్ (రూ.వెయ్యి చెల్లించింది) బల్దియా అధికారులకు ఇస్తున్నారు. దీంతో అప్పటి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ ప్రకారం ఫీజు విధిస్తుండడంతో వారికి కాస్త ఊరట లభిస్తోంది. అదేవిధానాన్ని 2015 ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులు, అది కూడా రూ.10 వేలు చెల్లించినవారికి అధికారులు ఇవ్వకపోవడంతో రూ.లక్షల్లో ఫీజుకు భయపడుతున్నారు. ‘2015 ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులు క్లియర్ చేయమంటూ దరఖాస్తులు ఇస్తే క్లియర్ చేస్తున్నాం. సంబంధిత పత్రాలు జతచేస్తే పరిశీలించి ఫైనల్ ప్రొసీడింగ్స్ ఇస్తున్నాం’ అని ‘కుడా’ అధికారి ఒకరు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆచరణకు నోచుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
రాజ్యాంగాన్ని
మార్చేందుకు బీజేపీ కుట్ర
● రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్
రాయల నాగేశ్వర్‌రావు
పర్వతగిరి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తోందని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర్‌రావు విమర్శించారు. మండలంలోని బూరుగుమల్ల, మోత్యతండా గ్రామాల్లో మంగళవారం జైబాపు, జైభీమ్, జై సంవిధాన్ అభియాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో మతవిద్వేషాలను రెచ్చగొట్టే విధంగా బీజేపీ పాలన కొనసాగుతోందన్నారు. రాజ్యాంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రధాని మోదీ ప్రభుత్వంపై ప్రజలు స్పందించాలని సూచించారు. ఇటీవల కేంద్ర మంత్రి అమిత్‌షా అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో ముందడుగు వేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాటోతు శ్రీనివాస్‌నాయక్, గ్రామ పార్టీ అధ్యక్షుడు రాకేశ్, రమేశ్, నాయకులు లింగారెడ్డి, నరుకుడు రవీందర్, కుమార్, శేషగిరిస్వామి, మోహన్‌రెడ్డి, పూర్ణచందర్, బాషానాయక్ పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ సత్యశారద
వరంగల్: పరిశ్రమల స్థాపనతోనే జిల్లా ఆర్థిక ప్రగతి సాధ్యమని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ (డీఐపీసీ) సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో టీజీఐపాస్ కింద వివిధ శాఖలకు సంబంధించి పరిశ్రమలు నెలకొల్పేందుకు 1,365 యూనిట్ల మంజూరుకు ప్రతిపాదనలు చేయగా.. 1,076 దరఖాస్తులకు అనుమతి మంజూరు చేసినట్లు తెలిపారు. 180 ప్రతిపాదనలు అసంపూర్తిగా ఉన్నందున తిరస్కరించామని, పూర్తి సమాచారంతో తిరిగి సమర్పించాలని కోరినట్లు పేర్కొన్నారు. సమావేశంలో పరిశ్రమలశాఖ జీఎం రమేశ్, లీడ్ బ్యాంకు మేనేజర్, జిల్లా రవాణా శాఖ అధికారి శోభన్‌బాబు, అధికారులు పాల్గొన్నారు.
15 వరకు ఇంటర్న్‌షిప్
రెండో దశ దరఖాస్తుకు గడువు
భారత ప్రభుత్వం, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందించే ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం రెండో దశ దరఖాస్తుల గడువును ఈనెల 15 వరకు పొడిగించినట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. ఇంటర్న్‌షిప్‌కు ఎంపికై న విద్యార్థులకు మొదటి నెల భత్యం రూ. 5,000..ఆ తర్వాత నుంచి రూ.6,000 మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. సంవత్సరంలో కనీసం 6 నెలలు ఉద్యోగ శిక్షణ ఉంటుందన్నారు. సాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 11 6090ను సంప్రదించాలని ఆమె కోరారు.
సహకార శాఖ అభివృద్ధిపై సమావేశం..
జిల్లా సహకార శాఖ అభివృద్ధి, జన ఔషధిపై కలెక్టర్ సత్యశారద అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. డీసీఓ నీరజ, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, మత్స్యశాఖ అధికారి నాగమణి తదితరులు పాల్గొన్నారు.
పోషణ పక్షం వాల్‌పోస్టర్ ఆవిష్కరణ..
కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌హాల్‌లో మంగళవారం పోషణ పక్షం వాల్‌పోస్టర్‌ను కలెక్టర్ సత్యశారద, అధికారులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోషణ్ అభియాన్‌లో భాగంగా ఈనెల 8 నుంచి 22 వరకు పోషణ పక్షం నిర్వహించనున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్డీఓ కౌసల్యాదేవి పాల్గొన్నారు.
న్యూస్‌రీల్
హంటర్‌రోడ్డులోని నందిహిల్స్ రోడ్డు నంబర్–5లో వి.సౌందర్య 2009 సంవత్సరంలో 308.33 గజాల స్థలం కొనుగోలు చేశారు. ఈ స్థలం క్రమబద్ధీకరణ కోసం 2015లో ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకుని రూ.10 వేల ఫీజు కుడా చెల్లించారు. ప్లాట్‌కు సంబంధించిన పత్రాలు జతచేసి ఎల్‌ఆర్‌ఎస్ ఫైనల్ ప్రొసీడింగ్స్ ఇవ్వాలని, రూ.10 వేలు పోగా మిగిలిన నగదు చెల్లిస్తానంటూ పలుమార్లు లిఖితపూర్వకంగా ‘కుడా’ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నా కదలిక లేదు. ఇంటి నిర్మాణ అనుమతి కోసం బల్దియాకు వెళితే ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు ఇప్పుడున్నా మార్కెట్ విలువ ప్రకారం రూ.నాలుగు లక్షలపైగా వస్తుందని సమాధానమిచ్చారు. 2015 ఎల్‌ఆర్‌ఎస్ ‘కుడా’ క్లియర్ చేస్తే అప్పటి మార్కెట్ విలువ సేల్ డీడ్ ప్రకారం రూ.60 నుంచి రూ.70 వేలు అవుతుంది. దీంతో ఆమె ఎల్‌ఆర్‌ఎస్ ప్రొసీడింగ్స్ కోసం ప్రదక్షిణ చేస్తున్నారు.
ఏం చేయాలంటే...
‘కుడా’ ఎల్‌ఆర్‌ఎస్ వరంగల్ పేరుతో హనుమకొండలోని యాక్సిస్ బ్యాంకులో ఓపెన్ చేసిన అకౌంట్‌కే 2015 ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులతో రూ.పది వేల ఫీజు కట్టించారు. ఆ బ్యాంకులో వివరాలు అధికారులు సేకరించి అప్పుడు ఇచ్చిన కాంటాక్ట్ నంబర్‌ను సంప్రదించాలి. మీరు రూ.పది వేల ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు 2015లో కట్టారు. ఇప్పటికి క్లియర్ చేసుకునే అవకాశముందంటూ దరఖాస్తుదారులను సంప్రదిస్తే చాలా క్లియర్ అవుతాయి.
ఇప్పటికే తమకు ఎల్‌ఆర్‌ఎస్ ఫైనల్ ప్రొసీడింగ్స్ ఇవ్వాలని, ఫీజు చెల్లిస్తామంటూ చాలామంది లిఖితపూర్వకంగా ‘కుడా’కు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇవి కూడా క్లియర్ చేయాలి.
2020 ఎల్‌ఆర్‌ఎస్ (రూ.వెయ్యి) ఫీజు కట్టినవారికి ఇంటి నిర్మాణ అనుమతి సమయంలో అప్పటి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ ప్రకారం అనుమతి ఇస్తున్నారు. ఇది 2015 ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులకు కూడా కల్పించాలి.
అధికారుల సమీక్షలో కలెక్టర్ సత్యశారద

వరంగల్

వరంగల్

వరంగల్

వరంగల్

వరంగల్