
ఉద్యోగ అవకాశాలు కల్పించాలి
వరంగల్: మామునూరు ఎయిర్‌పోర్ట్, కాకతీయ మె గాటెక్స్ టైల్ పార్కు, గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణాల్లో భూములు కోల్పోయిన తమకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని భూనిర్వాసితులు కలెక్టర్ డాక్టర్ సత్యశారదను కోరారు. కలెక్టర్ కాన్ఫరెన్‌్స్‌హాల్‌లో కలెక్టర్ అధ్యక్షతన బుధవారం జరిగిన జి ల్లాస్థాయి సంప్రదింపుల సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించి ఖిలా వరంగల్ మండలంలోని నక్కలపల్లి, గుంటూరుపల్లి, గాడిపల్లి గ్రామాల భూనిర్వాసితులతో జనరల్ అవార్డు,కన్సర్న్ అవార్డులపై చర్చించా రు.ఎయిర్‌పోర్ట్ నిర్మాణంలో భూములు కోల్పోతు న్న తమకు అధిక ధర కావాలని,రోడ్డు సౌకర్యం కావాలని నిర్వాసితులు కోరారు. నేషనల్ గ్రీన్‌ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న సంగెం మండలం చింతలపల్లి భూనిర్వాసితులతో ఆర్బిట్రేషన్ నిర్వహించారు. సమావేశంలో తహసీల్దార్లు నాగేశ్వరరా వు, రాజ్‌కుమార్, రైతులు పాల్గొన్నారు.