
సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి
రాయపర్తి: సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సత్యశారద, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి కోరారు. కొలనుపల్లి గ్రామంలోని చిట్యాల పెద్దసోమయ్య–రాజనర్సమ్మ దంపతుల ఇంట్లో బుధవారం వారు సన్నబియ్యంతో వండిన భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం రేషన్‌షాపుల ద్వారా ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేస్తోందని పేర్కొన్నారు. అనంతరం వారు పెద్దసోమయ్య–రాజనర్సమ్మ దంపతులకు నూతన వస్త్రాలను అందజేశారు. అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీసీఓ నీరజ, డీఆర్‌డీఓ కౌసల్యాదేవి, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ సంధ్యారాణి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అన్నదాతల సంక్షేమమే ధ్యేయం
అన్నదాతల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రం,బురహాన్‌పల్లి,కొలన్‌పల్లి గ్రామాల్లో ఏ ర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సత్యశారదతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ధా న్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని కోరారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌డీఓ కౌసల్యాదేవి, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ సంధ్యారాణి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కిషన్, ఎంపీఓ ప్రకాశ్, ఏఓ వీ రభద్రం, పీఏసీఎస్ చైర్మన్ రామచంద్రారెడ్డి, వెంకట్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ తొర్రూరు అధ్యక్షుడు హామ్యానాయక్, పార్టీ మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటయ్య, వైస్‌ఛైర్మన్ కృష్ణారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
కలెక్టర్ సత్యశారద, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి
కొలనుపల్లిలో పెద్దసోమయ్య–
రాజనర్సమ్మ ఇంట్లో సహపంక్తి భోజనం