
దరఖాస్తులు పరిష్కరించాలి
వరంగల్ అర్బన్ : టీఎస్ బీపాస్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని బల్దియా కమిషనర్ అశ్వి ని తానాజీ వాకడే ఆదేశించారు. బుధవారం బల్ది యా ప్రధాన కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికా రులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ నిర్దేశిత 21 రోజుల గడువులోగా ఫైల్ క్లియ ర్ చేయాలని, షార్ట్ ఫాల్ ఉంటే దరఖాస్తుదారుడికి సూచించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సమావేశంలో ఇన్‌చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ఏసీపీలు ఖలీల్, రజిత శ్రీనివాస్‌రెడ్డి, ఏర్షాద్ పాల్గొన్నారు.
ఎర్లీ బర్డ్ స్కీంపై అవగాహన కల్పించాలి
ఎర్లీ బర్డ్ స్కీంను సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సీడీఎంఏ డాక్టర్ శ్రీదేవి అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి మున్సిపల్ కమిషనర్‌లు, అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బల్దియా ప్రధాన కార్యాలయం నుంచి కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కమిషనర్ జోనా, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, రవీందర్ పాల్గొన్నారు.