
సీఎంఆర్‌ఎఫ్ పేదలకు వరం
ఆత్మకూరు/దామెర/నడికూడ: కల్యాణ లక్ష్మి, సీఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఆత్మకూరు రైతు వేదిక, దామెర, నడికూడ తహసీ ల్దార్ కార్యాలయాల్లో గురువారం అర్హులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తోందని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్డీఓ నారాయణ, తహసీల్దార్లు జగన్మోహన్‌రెడ్డి, నాగరాజు, జ్యోతివరలక్ష్మి, ఎంపీడీఓ కల్పన, వ్యవసాయ అధికారి యాదగిరి, కాంగ్రెస్ నాయకులు కమలాపురం రమేశ్, వాసు, బీరం సుధాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి