వరంగల్‌ | - | Sakshi

వరంగల్‌

Apr 11 2025 12:57 AM | Updated on Apr 11 2025 12:57 AM

వరంగల

వరంగల్‌

డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు జరిగేనా?
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 21 నుంచి నిర్వహించాలని నిర్ణయించారు.

శుక్రవారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

8లోu

సహకారం అందిస్తున్న

జెడ్పీ సెక్షన్‌ అధికారులు

కోరుకున్న చోటుకు

వెళ్లేందుకు లాంగ్‌ లీవులు

సంఘాల డిమాండ్‌తో

ప్రత్యేకాధికారి వద్దకు ఫైల్‌

వరంగల్‌: జిల్లా పరిషత్‌ పరిధిలోని మండలాల్లో జానియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నా ఇతర శాఖలో పనిచేసి వచ్చిన ఉద్యోగికి పోస్టింగ్‌ ఇవ్వడంలో అధికారులు జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జెడ్పీకి చెందిన ఒక జూనియర్‌ అసిస్టెంట్‌ జెడ్పీ కార్యాలయ ఆవరణలో ఉన్న పీఆర్‌ ములుగు క్యూసీ సబ్‌ డివిజన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. పీఆర్‌ ఇంజనీరింగ్‌శాఖలోని ఒక ఏఈ చనిపోవడంతో కారుణ్య నియామకం కింద అతడి కుమారుడికి ఇదే క్యూసీ సబ్‌ డివిజన్‌లో పోస్టింగ్‌ ఇస్తూ పీఆర్‌ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తప్పని పరిస్థితుల్లో అక్కడ పనిచేస్తున్న జూనియర్‌ అసిస్టెంట్‌ జెడ్పీలో ఇతర ప్రాంతంలో పోస్టింగ్‌ కోసం రిపోర్టు చేశారు. మార్చి రెండోవారంలో రిపోర్ట్‌ చేసినా ఇప్పటి వరకు పోస్టింగ్‌ ఇవ్వడం లేదని, ఇందుకు సంబంధిత సెక్షన్‌ అధికారులు సహకారం అందిస్తున్నారని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రవికుమార్‌ ఆరోపిస్తున్నారు.

దొడ్డిదారిన పోస్టింగ్‌ పొందేందుకు..

జిల్లా పరిషత్‌ పరిధిలో సాధారణ బదిలీలు లేకపోవడంతో దొడ్డిదారిన కోరుకున్న చోట పోస్టింగ్‌ పొందేందుకు ఉద్యోగులు లాంగ్‌ లీవు పెడుతున్నారు. ఏ మండలంలోనైనా ఒక ఉద్యోగి 6 నెలల పాటు సెలవులో ఉంటే సదరు ఉద్యోగిని జెడ్పీకి సరెండర్‌ చేస్తారు. వరంగల్‌ మండలం పైడిపల్లి ప్రభుత్వ పాఠశాలలోని జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగ విరమణ పొందుతున్న విషయం తెలుసుకున్న చెన్నారావుపేట మండల కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి లాంగ్‌ లీవు పెట్టినట్లు సమాచారం. ఫిబ్రవరి నెలాఖరున పైడిపల్లి పాఠశాలలోని జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగ విరమణ పొందడంతో ఖాళీ ఏర్పడింది. ఈ ఖాళీలో క్యూసీలో పనిచేసిన జూనియర్‌ అసిస్టెంట్‌ జాయిన్‌ అయ్యేందుకు ప్రయత్నాలు చేసినా సంఘం నాయకులు అభ్యంతరం చెప్పారు. ఈస్థానంలోకి లాంగ్‌లీవు పెట్టిన చెన్నారావుపేట నుంచి జెడ్పీకి వచ్చిన ఉద్యోగికి అధికారులు పోస్టింగ్‌ ఇచ్చారు. ఆశించిన స్థానం భర్తీ కావడంతో జూనియర్‌ అసిస్టెంట్‌ చెన్నారావుపేటకు పోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. భూపాలపల్లిలో జూనియర్‌ అసిస్టెంట్‌ సతీమణి ఉద్యోగం చేస్తున్నందున అక్కడ ఖాళీగా ఉన్న సబ్‌ డివిజన్‌లో పోస్టింగ్‌ తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేయడంలో జాప్యం జరుగుతున్నట్లు తెలిసింది. సంఘాల నాయకుల ఒత్తిడితో జూనియర్‌ అసిస్టెంట్‌కు చెన్నారావుపేటలో పోస్టింగ్‌ ఇచ్చేందుకు జెడ్పీ అధికారులు ఫైల్‌ సిద్ధం చేసి జెడ్పీ ప్రత్యేక అధికారి, కలెక్టర్‌ వద్దకు పంపారు. ఈఫైల్‌పై కలెక్టర్‌ రిమార్క్స్‌ రాయగా తిరిగి జెడ్పీకి వచ్చినట్లు తెలిసింది. కలెక్టర్‌ ఆమోదించిన వెంటనే జూనియర్‌ అసిస్టెంట్‌కు పోస్టింగ్‌ ఉత్తర్వులు జారీ చేస్తామని జెడ్పీ ఎస్టాబ్లిష్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ తెలిపారు.

న్యూస్‌రీల్‌

జెడ్పీల్లో ఇష్టారాజ్యం..

జిల్లా పరిషత్‌ పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. చైర్మన్ల స్థానంలో ప్రత్యేక అధికారులుగా నియమితులైన ఆయా జిల్లాల కలెక్టర్లు జెడ్పీ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. ఇందువల్ల జెడ్పీల్లో అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా మారిందని ఆరోపిస్తున్నారు. జెడ్పీ నుంచి ఉద్యోగులకు సంబంధించిన ఫైళ్లు ప్రత్యేక అధికారుల ఆమోదం కోసం పంపితే జాప్యం జరుగుతున్నదని, ఈవిషయాలపై ఉద్యోగులకు సమాధానం చెప్పలేక జెడ్పీ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలోని జిల్లా పరిషత్‌లన్నింటిలో ఈపరిస్థితులు నెలకొన్నట్లు తెలిసింది. ప్రత్యేక అధికారులు జిల్లా పరిషత్‌లపై దృష్టి సారించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వరంగల్‌1
1/1

వరంగల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement