
ఆర్థిక బలోపేతానికి మహిళా శక్తి క్యాంటీన్లు
● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
పరకాల: మహిళలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేసేందుకు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు దోహదపడతాయని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పరకాలలోని నూతన సబ్ రిజిస్ట్రర్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తుందని, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించేలా కృషి చేస్తుందన్నారు. పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, వారికి కావాల్సిన ప్రోత్సాహకాలను అందిస్తుందన్నారు. కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ కె.నారాయణ, పరకాల మున్సిపల్ కమిషనర్ సీహెచ్.వెంకటేశ్, సబ్ రిజిస్ట్రార్ శ్రావణ్, ఎంపీడీఓ పెద్ది ఆంజనేయులు, తహసీల్దార్ విజయలక్ష్మి, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.