
అక్రమార్కుల ‘వీ హబ్’
సాక్షి, వరంగల్: జిల్లా సంక్షేమ శాఖలో చేపట్టిన ఉద్యోగాల నియామకాల్లో అనర్హులను అందలం ఎక్కించారని, నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు కొల్లగొట్టారని ‘సాక్షి’ ముందుగానే చెప్పింది. ఈ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు.. ఉద్యోగార్థుల విద్యార్హత, అనుభవ సర్టిఫికెట్లు తూతూ మంత్రంగానే పరిశీలించి తమకు కావాల్సి న వారికి ‘మామూలు’గానే ఉద్యోగాలిచ్చేశారని 2023 జూలై 14, జూలై 22న, చైల్డ్‌లైన్ పోస్టుల్లోనూ అక్రమాలకు తెరలేపారని 2023 ఆగస్టు 8న ‘జనరల్‌గా జాబ్ లిచ్చేస్తారా’ అంటూ వరుస కథనాలను ప్రచురించింది. విజిలెన్స్ ఆరా తీసి ఆ నియామకాల్లో కీలకంగా ఉన్న జిల్లా సంక్షేమ విభాగాధికారి శారద ఉండడంతో దీనిపై అడుగు ముందుకు పడలేదు. తర్వాత ఆమె ఉద్యోగ విరమణ పొందడంతో మళ్లీ అక్రమాల నియామకాల విషయం తెరమీదకు వచ్చింది. అప్పుడు ‘సాక్షి’ చెప్పినట్లుగానే కొత్త మిషన్ పథకం కింద డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ ఉమెన్‌కు సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్‌కు చెందిన ఉద్యోగాల్లో గోల్‌మాల్ జరిగిందని నిర్ధారణ అయ్యింది. ఏకంగా స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ పోస్టు దక్కించుకున్న సుజాత విద్యార్హత సర్టిఫికెట్లు నకిలీవని తేలింది. ఈమైపె ప్రస్తుత జిల్లా సంక్షేమ విభాగాధికారి రాజమణి ఫిర్యాదు మేరకు హనుమకొండ పోలీసులు కేసు నమోదు చేసి విచా రిస్తుండడం సంచలనంగా మారింది. దీంతోపాటు జిల్లా మిషన్ కోఆర్డినేటర్‌ను నిబంధనలకు విరుద్ధంగా నియమించారని, నోటిఫికేషన్ ప్రకారం డిగ్రీలో విద్యార్హత లేకున్నా, పూర్తిస్థాయి అనుభవం లేకు న్నా సు’కుమా’రంగా తీసుకున్నారన్న ఆరోపణ లు న్నాయి. జెండర్ స్పెషలిస్ట్ నియామకంలో కూడా ఓ అంగన్‌వాడీ టీచర్ కోడలుకు అనుభవం లేకున్నా కట్టబెట్టారన్న విమర్శలున్నాయి. ఇవేకాకుండా చైల్డ్‌లైన్‌లోని కొన్ని ఉద్యోగాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి తీసుకోవడంపై ఇప్పటికే విజిలెన్‌్స్ దృష్టి సారించింది. ఇదిలా ఉండగానే వీహబ్‌లో ఓ మహిళ ఉద్యోగి రాజీనామా చేయడంతో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది.
విచారణ ముమ్మరం..
నకిలీ సర్టిఫికెట్లు సదరు ఉద్యోగి ఎక్కడి నుంచి తీసుకువచ్చి సమర్పించారన్నది తెలుసుకునే దిశగా పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఇప్పటికే ఆ విభాగం కార్యాలయానికి పలుమార్లు పోలీసులు వెళ్లారు. నియామకం సమయంలో కీలకంగా వ్యవహరించిన అధికారులు ఏదో ఒక కారణంతో కార్యాలయానికి రాకుండా ఉంటున్నారని సమాచారం. వీరిని పోలీసులు విచారిస్తేనే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయనే టాక్ ఉంది. సదరు ఉద్యోగి భర్త సంక్షేమ శాఖలోని ఓ విభాగంలో అకౌంటెంట్‌గా పనిచేస్తూ.. అక్కడి అధికారులతో కుమ్మకై ్క వారి సహకారంతోనే ఈ ఉద్యోగం తెచ్చుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఇంకోవైపు వీహబ్ ఇతర పోస్టుల్లో కూడా విద్యార్హత, అనుభవ పత్రాలు సరైనవా కావా అన్నది పోలీసులు విచారిస్తే తేలనుంది. ఆయా నియామకాల్లో అన్ని విద్యార్హత సర్టిఫికెట్లు, అనుభవ పత్రాలు అసలైనవా కావా అన్నది తెలుసుకోవాల్సిన సంక్షేమ విభాగ ప్రధాన కార్యాలయంలో పనిచేసే అధికారులు మౌనంగా ఉండడం, ముఖ్యంగా పోలీసు విచారణ జరుగుతున్న సమయంలో సెలవులో ఉండడం అనుమానాలకు తావి స్తోంది. వీరిలో ఒక అధికారి ఈ నెలలోనే ఉద్యోగ విరమణ ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగా సుజాత సమర్పించిన నకిలీ సర్టిఫికెట్లు నర్సంపేట కేంద్రంగానే తయారయ్యాయనే తెలుస్తోంది.
జిల్లా సంక్షేమ శాఖలో
అనర్హులకు ఉద్యోగాలు
నకిలీ విద్యార్హత సర్టిఫికెట్ల నిర్ధారణతో వాస్తవాలు వెలుగులోకి..
‘సాక్షి’ కథనాలతో విజిలెన్స్ విచారణ..
ఆ తర్వాత సుజాతపై కేసు
ఆ నియామకాల్లో కీలకంగా ఉన్న
ఇద్దరు అధికారులు సెలవుల్లో..
వీరిని విచారిస్తేనే అవినీతి
తేటతెల్లమయ్యే అవకాశం

అక్రమార్కుల ‘వీ హబ్’

అక్రమార్కుల ‘వీ హబ్’

అక్రమార్కుల ‘వీ హబ్’