
మార్మోగిన ‘జై హనుమాన్’ నినాదం
పరకాల పట్టణంలో ‘జై హనుమాన్’ నినాదం మార్మోగింది. హనుమాన్ భక్తులతో శనివారం నగరం కాషాయమయమైంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్, బజరంగ్‌దళ్ పరకాల శాఖ ఆధ్వర్యంలో వీర హనుమాన్ శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పోలీసు బందోబస్తు నడుమ పట్టణంలో సాగిన ఈయాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విశ్వహిందూ పరిషత్ పట్టణ అధ్యక్షుడు సతీశ్, సహా కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, భజరంగ్‌దళ్ నాయకులు రమేశ్, అఖిల్, కుమార్, డాక్టర్ రజనీకాంత్, జయపాల్, పురుషోత్తం, రంజిత్ పాల్గొన్నారు.
– పరకాల