
బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి : రేవూరి
గీసుకొండ: కేంద్రంలోని బీజేపీ కుట్రలు తిప్పికొట్టి, ఆ పార్టీ సర్కారు తీరు కారణంగా రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి పోరాటం చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ ఆదివారం కాంగ్రెస్ నాయకుడు దుపాకి సంతోష్ నిర్వహించిన ‘జై బాపు, జై అంబేడ్కర్, జై సంవిధాన్’ ర్యాలీలో పాల్గొని ఆయన మాట్లాడారు. రాజ్యాంగ పరిరక్షణ ప్రతీఒక్కరి బాధ్యత అన్నారు. పార్లమెంట్ సాక్షిగా బీజేపీ రాజ్యాంగాన్ని అవమానపరిచిందని ఆరోపించారు. బీజేపీ తీరుపై ప్రజలకు అవగాహన కలిగించడానికి గ్రామ గ్రామాన కార్యక్రమాలు చేపట్టాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. బీజేపీ మతాల మధ్య చిచ్చుపెడుతూ, లౌకికవాదానికి తూట్లు పొడుస్తోందని అన్నారు. గరీబ్‌నగర్, కీర్తినగర్‌లో నిర్వహించిన ర్యాలీల్లో కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, నేతలు కొండేటి కొమురారెడ్డి, సాల్మన్, గోదాసి చిన్న, దాసారపు సారయ్య, జానీ, హుజూర్, చెక్క రమేశ్, ఆఫ్రీన్, శైలజ, లలిత పాల్గొన్నారు.