
ఉప్పరపల్లి క్రాస్‌రోడ్డులో ఇక్కట్లు..
వర్ధన్నపేట: వరంగల్–ఖమ్మం జాతీయ రహదారి ఉప్పరపల్లి క్రాస్‌రోడ్డు వద్ద ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి నుంచి పర్వతగిరి, కొంకపాక, అన్నారం తదితర గ్రామాలకు ఆర్టీసీ బస్సులు రోజుకు పదికి పైగా నడుస్తాయి. అదేవిధంగా వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ఖమ్మం, తొర్రూరు, వర్ధన్నపేట, వరంగల్, హనుమకొండ వెళ్లేందుకు ప్రయాణికులు వేచి చూస్తుంటారు. బస్‌షెల్టర్ లేకపోవడంతో ఎండలో ఉండాల్సి వస్తోంది. సమీపంలోని చెట్లు, బేకరీల వద్ద సేద తీరుతున్నారు. తాగునీరు లేక అల్లాడుతున్నారు.