పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం పాలకొల్లులోని క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే భక్తుల తాకిడి మొదలైంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి విశేష అభిషేకాలు ప్రారంభించారు. అధిక సంఖ్యలో భక్తులు మహాన్యాసపూర్వక అభిషేకాలు నిర్వహించారు. రాత్రి 8.35 గంటలకు జగజ్జ్యోతి వెలిగించారు. రాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయంలో స్వామివారికి మల్లన్న పాగా అలంకరించారు. అనంతరం లక్షపత్రి పూజ నిర్వహించారు. సుమారు 40 వేల మంది భక్తులు స్వామిని దర్శించినట్టు అంచనా. ఆలయ ఈఓ ముచ్చర్ల శ్రీనివాసరావు, పట్టణ సీఐ కె.రజనీకుమార్, ఎస్సై పృద్వీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులకు భక్తులకు ఉచిత ప్రసాదం, అన్నసమారాధనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment