ఈ నెల 27న మెగా జాబ్‌మేళా | - | Sakshi

ఈ నెల 27న మెగా జాబ్‌మేళా

Mar 20 2025 2:22 AM | Updated on Mar 20 2025 2:22 AM

ఈ నెల

ఈ నెల 27న మెగా జాబ్‌మేళా

భీమవరం: స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, డాక్టర్‌ సీఎస్‌ఎన్‌ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో భీమవరంలోని సీఎస్‌ఎన్‌ డిగ్రీ కళాశాలలో ఈ నెల 27న మెగా జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎస్‌ఎస్‌డీసీ జిల్లా మేనేజర్‌ పోతిన లోకమాన్‌ చెప్పారు. బుధవారం కళాశాలలో మాట్లాడుతూ జాబ్‌మేళాకు దాదాపు 20 కంపెనీలు హాజరుకానున్నాయని పీజీ, డిగ్రీ, బీటెక్‌, ఇంటర్‌, పదో తరగతి విద్యార్థులు ఈ క్యాంపస్‌ డ్రైవ్‌లో పాల్గొనవచ్చన్నారు. దీనికి ఆన్‌లైన్‌ ద్వారా, కళాశాలకు నేరుగా వచ్చి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ డాక్టర్‌ చీడే సత్యనారాయణ, ప్రిన్సిపల్‌ సకుమళ్ల సత్యనారాయణ, కో–ఆర్డినేటర్‌ ఎం.రాధిక తదితరులు పాల్గొన్నారు.

యూత్‌ పార్లమెంట్‌ నిర్వహణకు డీఎన్నార్‌ ఎంపిక

భీమవరం: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల స్థాయి వికసిత్‌ భారత్‌ యూత్‌ పార్లమెంట్‌–2025 కార్యక్రమం ఈ నెల 24,25 తేదీల్లో నిర్వహించనున్నట్లు భీమవరం డీఎన్నార్‌ కళాశాల ప్రిన్సిపల్‌ జి.మోజెస్‌ చెప్పారు. ఈ కార్యక్రమం నిర్వహణకు డీఎన్నార్‌ను నోడల్‌ కళాశాలగా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఎంపిక చేసిందన్నారు. రెండు జిల్లాల నుంచి వచ్చిన 454 వీడియోలను పరిశీలించి వాటిలో 150 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికై న అభ్యర్ధులు ఒన్‌ నేషన్‌–ఒన్‌ ఎలక్షన్‌ అనే అంశంపై మూడు నిమిషాలు మాట్లాడాల్సి ఉంటుందని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టు డివిజన్‌–2 ఈఈగా మూర్తి

పోలవరం రూరల్‌: పోలవరం ప్రాజెక్టు డివిజన్‌–2 ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా ఏఎస్‌ఎల్‌ఎన్‌ఎస్‌ మూర్తి బాధ్యతలు స్వీకరించారు. పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించిన మూర్తిని సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. జలవనరుల శాఖలో పదోన్నతులు పోలవరం ప్రాజెక్టు జలవనరుల శాఖ అధికారులకు పదోన్నతులు లభించాయి. పి.వెంకటరమణ డివిజన్‌–1 ఈఈగా, ఏఎస్‌ఎల్‌ఎస్‌ఎన్‌ మూర్తి డివిజన్‌–2 ఈఈగా, డి.శ్రీనివాసరావు డివిజన్‌–3 ఈఈగా, కె.సుబ్రహ్మణ్యం డివిజన్‌–4 ఈఈగా, జి.కృష్ణ, డివిజన్‌–5 ఈఈగా, కె.బాలకృష్ణమూర్తి డివిజన్‌–6ఈఈగా, డి.దామోదరం డివిజన్‌–7ఈఈగా, కె.పుల్లారావు డివిజన్‌–8ఈఈగా పదోన్నతులు పొందినట్లు అధికారులు పేర్కొన్నారు.

విద్యా సంస్థల బస్సులపై కేసుల నమోదు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు బుధవారం విద్యా సంస్థల బస్సుల తనిఖీలు నిర్వహించి 8 కేసులు నమోదు చేసినట్టు ఉప రవాణా కమిషనర్‌ షేక్‌ కరీమ్‌ తెలిపారు. ఫిట్‌నెస్‌, పొల్యూషన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహన బీమా తదితర అంశాలను పరిశీలించి ఆయా సర్టిఫికెట్లు లేని, నిబంధనలకు విరుద్ధంగా నడుతుపున్న 8 బస్సులపై కేసులు నమోదు చేసినట్టు వివరించారు.

అభయాంజనేయస్వామి హుండీ లెక్కింపు

పెదపాడు: అభయాంజనేయస్వామి హుండీ ఆదాయం రూ.12,08,963 వచ్చినట్లు ఆలయ ఈఓ పీ.తారకేశ్వరరావు తెలిపారు. అభయాంజనేయస్వామి హుండీ ఆదాయం లెక్కింపు బుధవారం నిర్వహించారు. 80 రోజులకు జరిగిన లెక్కింపులో ఈ ఆదాయం వచ్చిందని పర్యవేక్షణాధికారి సురేష్‌ కుమార్‌ తెలిపారు.

ఈ నెల 27న మెగా జాబ్‌మేళా 
1
1/1

ఈ నెల 27న మెగా జాబ్‌మేళా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement