వర్జీనియారైతుకునిరాశే ! | - | Sakshi

వర్జీనియారైతుకునిరాశే !

Apr 15 2025 2:11 AM | Updated on Apr 15 2025 2:11 AM

వర్జీ

వర్జీనియారైతుకునిరాశే !

బరువు 150 కేజీలు

దాటకూడదు

బేళ్ల బరువు 150 కేజీలు దాటకుండా చూసుకోవాలి. గ్రేడింగ్‌లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. హీట్‌, సాఫ్ట్‌ లేకుండా గ్రేడ్‌ల ఆధారంగా పొగాకు సిద్ధం చేసుకోవాలి. అవశేషాలు లేకుండా ఎగుమతికి ఆమోదయోగ్యంగా ఉండే పొగాకును పండించుకోవాలి.

– బి.శ్రీహరి, వేలం సూపరింటెండెంట్‌, జంగారెడ్డిగూడెం కేంద్రం–1

ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి

ఈ ఏడాది పంటకు పెట్టుబడు లు, ఖర్చులు, కౌలు పెరిగాయి. సరాసరి రూ.300 వస్తేనే రైతుల కష్టాలు తీరతాయి. ప్రస్తుత ధరలు చూస్తే భయమేస్తుంది. ఇలానే కొనసాగితే రైతులు నష్టాల పాలవ్వడం ఖాయం.

– కలగర నాని, పొగాకు రైతు, కొమ్ముగూడెం, బుట్టాయగూడెం మండలం

బుట్టాయగూడెం: ఎన్నో ఆశలతో పొగాకు పంట వేసిన రైతుకు ఈ ఏడాది నిరాశ తప్పేలా లేదు. గత రెండేళ్లుగా పొగాకు పంటకు రికార్డు స్థాయిలో ధర రావడంతో ఈ ఏడాది రైతులు భూమి కౌలు, పెట్టుబడిని సైతం లెక్క చేయకుండా పంట వేశారు. గత నెల 24న ప్రారంభమైన పొగాకు కొనుగోళ్లు మొదటి రోజే ధర రైతులను నిరాశ పరిచింది. కిలో పొగాకుకు సరాసరి రూ.300 వస్తుందని రైతులు ఆశపడ్డారు. అయితే రూ.290 పలుకడంతో రైతులు ఢీలా పడిపోయారు. పొగాకు కొనుగోళ్లు ప్రారంభమై 20 రోజులు దాటినప్పటికీ ధరలో మార్పు లేకుండా మార్కెట్‌ ధర నిలకడగా ఉండడంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ప్రసుత్తం పొగాకుకు సరాసరి ధర రూ.278 రాగా కనిష్ట ధర రూ.265 పలికింది. గరిష్ట ధర రూ.290 పలుకుతోంది. ధరలు ఇలా కొనసాగితే తీవ్ర నష్టాల పాలవుతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

70 మిలియన్‌ కిలోల ఉత్పత్తి అంచనా

రాజమండ్రి పొగాకు బోర్డు రీజియన్‌ పరిధిలో ఈ ఏడాది సీజన్‌లో సుమారు 70 మిలియన్‌ల కిలోల పొగాకు ఉత్పత్తి అవుతుందని బోర్డు అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు, కొనుగోలుదారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది పొగాకు ఆశాజనకంగా ఉన్నప్పటికీ వాతావరణంలో మార్పుల కారణంగా ఆకు గుల్లబారి తూకం రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొగాకు బోర్డు సుమారు 56.88 మిలియన్‌ కిలోల ఉత్పత్తికి అనుమతి ఇచ్చింది. గతేడాది మార్కెట్‌లో పొగాకు కిలో గరిష్టంగా రూ. 410 పలికింది. దీంతో అధిక సంఖ్యలో రైతులు పొగాకు సాగు చేశారు. బోర్డు అనుమతి లేకుండా సుమారు 8 వేల హెక్టర్లలో పంట సాగు చేస్తున్నట్లు సమాచారం.

అదనపు పంటతో చిక్కులు

బోర్డు అధికారులు ఇచ్చిన అనుమతి కంటే అదనంగా సాగు చేయడం వల్ల చిక్కులు వచ్చే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. గత రెండేళ్లుగా పొగాకు ధరలు అధికంగా రావడంతో ఈ ఏడాది జీడిమామిడి, మామిడి, ఇతర పంటలను తొలగించి కొత్తగా రైతులు కూడా పొగాకు సాగు చేశారు. అధికంగా రూ.లక్ష వరకూ కౌలుకు తీసుకుని సారంలేని భూముల్లో పొగాకు పండించడం వల్ల లోగ్రేడ్‌ పొగాకుగా పండినట్లు సమాచారం.ఈ ఏడాది ఆశించిన దాని కంటే 20 శాతం అదనంగా పంట వేయడంతో ధరలు కూడా ఆశించిన స్థాయిలో రాకపోవచ్చని చెబుతున్నారు.

ఆశాజనకంగా లేని పంట ధరలు

కిలో సరాసరి ధర రూ.278

రూ.300 వస్తే గానీ గిట్టుబాటు కాదంటున్న రైతులు

అమ్మకాలకు ఆసక్తి చూపని రైతులు

బోర్డు అధికారులు ఆదుకోవాలని విజ్ఞప్తి

5 కంపెనీలు మాత్రమే కొనుగోలు

ప్రస్తుతం పొగాకు బేళ్ల కొనుగోల్లు మందకొడిగా సాగుతున్నాయి. ప్రారంభంలో కిలో గరిష్ట ధర రూ. 290, కనిష్ట ధర రూ.265, సగటు ధర రూ. 280.31 లభించింది. బేళ్ల కొనుగోళ్లలో 9 కంపెనీలు పాల్గొనాల్సి ఉండగా ప్రస్తుతం 5 కంపెనీలే పాల్గొంటున్నాయి. వీటిలో 90 శాతం ఐటీసీ మాత్రమే కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం రైతులు కూడా బేళ్లను అమ్మేందుకు ఆసక్తి చూపడం లేదు. కొనుగోళ్లు ప్రారంభానికి, చివరకు ధరల్లో వ్యత్యాసం ఉంటుందని రైతులు చెబుతున్నారు.

వర్జీనియారైతుకునిరాశే !1
1/2

వర్జీనియారైతుకునిరాశే !

వర్జీనియారైతుకునిరాశే !2
2/2

వర్జీనియారైతుకునిరాశే !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement