సన్నబియ్యం సంబురం | - | Sakshi
Sakshi News home page

సన్నబియ్యం సంబురం

Apr 2 2025 2:01 AM | Updated on Apr 2 2025 2:01 AM

సన్నబ

సన్నబియ్యం సంబురం

తొలిరోజు 80 దుకాణాల్లో ప్రారంభం

ఒక్కరికి 10 కిలోల చొప్పున ఇవ్వాలి

ప్రభుత్వం సన్నబియ్యం ఇవ్వడం సంతోషకరం విషయం. కానీ ఒకరికి నెలకు 6 కిలోలు కాకుండా 10 కిలోల చొప్పున బియ్యం ఇవ్వాలి. బియ్యంతో పాటు నిత్యావసర సరుకులైన మంచినూనె, చింతపండు, ఉల్లిగడ్డ, పప్పులు, ఉప్పు కారం సరఫరా చేయాలి. రేషన్‌దుకాణాల ద్వారా అన్ని సరుకులు సరఫరా చేయాలి.

– కందూకూరి అండాలు, అడ్డగూడూరు

సంతోషంగా ఉంది

ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయడం సంతోషంగా ఉంది. గతంలో ఇచ్చే దొడ్డు బియ్యం రుచిగా ఉండకపోయేది. తినలేక చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు సన్న బియ్యం పంపిణీ చేయడం ఆనందంగా ఉంది. ఎప్పుడూ ఇలాగే సన్న బియ్యం పంపిణీ చేయాలి.

– దేవమ్మ, బీబీనగర్‌

ఫ నేటి నుంచి అన్ని దుకాణాల్లో పంపిణీ ఫ సన్నబియ్యం పట్ల లబ్ధిదారుల్లో హర్షం

సాక్షి యాదాద్రి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం జిల్లాలో అట్టహాసంగా మొదలైంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 515 రేషన్‌ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలిరోజైన మంగళవారం సుమారు 80 రేషన్‌ దుకాణాల్లో బియ్యం సరఫరా చేపట్టారు. బుధవారం నుంచి రామన్నపేట మండలంతోపాటు జిల్లాలోని అన్ని దుకాణాల్లో పంపిణీ చేయనున్నారు.

గుట్టలో ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి

ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్టలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి బియ్యం పంపిణీ ప్రారంభించారు. భువనగిరి, బీబీనగర్‌లో ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూరు, అడ్డగూడూరులో ఎమ్మెల్యే మందుల సామేల్‌, మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్‌ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

లబ్ధిదారుల హర్షం

ఆహార భద్రతా పథకంలో భాగంగా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యంతో లబ్ధిదారులు మురిసిపోతున్నారు. జిల్లాలో 515 రేషన్‌ దుకాణాల్లో మొత్తం 2,17,072 రేషన్‌కార్డులు ఉండగా, వాటిలో 6,26,738 యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్‌కు 6 కిలోల బియ్యం చొప్పున నెలకు 4,240 మెట్రిక్‌టన్నులు బియ్యం పంపిణీ చేయనున్నారు. అన్నిరేషన్‌ దుకాణాలకు అధికారులు బియ్యం సరఫరా చేశారు. అయితే కొన్ని చోట్ల స్థలాభావం వల్ల 3800 మెట్రిక్‌ టన్నుల బియ్యం మాత్రమే పంపిణీ జరిగింది. బియ్యం పంపిణీ తో ఖాళీ ఏర్పడగానే మిగతా కోటా బియ్యం పంపిణీ చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు.

సన్నబియ్యం సంబురం1
1/3

సన్నబియ్యం సంబురం

సన్నబియ్యం సంబురం2
2/3

సన్నబియ్యం సంబురం

సన్నబియ్యం సంబురం3
3/3

సన్నబియ్యం సంబురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement