
కవులు సమాజాన్ని చైతన్యపరచాలి
నార్కట్‌పల్లి: కవులు తమ రచనల ద్వారా సమాజాన్ని చైతన్యపరచాలని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కార గ్రహీత ఎన్వీ రఘువీర్ ప్రతాప్ అన్నారు. నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులోని శ్రీసోమేశ్వర శివజ్ఞాన పీఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కవి సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కవి సమ్మేళనంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 67 మంది కవులు పాల్గొన్నారు. అనంతరం కవులకు బహుమతులు అందజేశారు. శివజ్ఞాన పీఠం ట్రస్ట్ అధ్యక్షుడు పోతులపాటి అరుణ రామలింగేశ్వర శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిలువేరు సాహితీ సంస్థ, తేజస్విని సాహితీ సంస్థల అధ్యక్షుడు సిలువేరు లింగమూర్తి, పెందోట సోము, సినీ పాటల రచయిత బండారు దానయ్య, తండు కృష్ణకౌండిన్య, పున్న అంజయ్య, పెరుమాళ్ల ఆనంద్, భానుశ్రీకొత్వాల్, సాగర్ల సత్తయ్య, ఝూన్సీ, ప్రవీణ్‌రెడ్డి, రాజేందర్‌శర్మ, జయారపు రామకృష్ణ, హరికృష్ణశర్మలు తదితరులు ఉన్నారు.
బుచ్చిరెడ్డి దంపతులకు సన్మానం
కనగల్: నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులోని శ్రీసోమేశ్వర శివజ్ఞాన పీఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించి కవి సమ్మేళనంలో కనగల్ మండలం చిన్న మాదారం జెడ్పీహెచ్‌ఎస్ ఉపాధ్యాయుడు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా ఆయనను ఆలయ ప్రధాన అర్చకుడు రామలింగేశ్వర శర్మ, కీర్తి పురస్కార గ్రహీత రఘువీర్ ప్రతాప్ సన్మానించారు. కార్యక్రమంలో పెందోట సోము, సిలువేరు లింగమూర్తి, పోతులపాటి అరుణ, శివ తదితరులు పాల్గొన్నారు.