
ఎయిమ్స్‌లో పీడియాట్రిక్ సర్జరీ డే
బీబీనగర్ : ఎయిమ్స్ వైద్య కళాశాలలో సోమవారం వరల్డ్ పీడియాట్రిక్ సర్జరీ డే ఘనంగా నిర్వహించారు. పీడియాట్రిక్ వైద్య విభాగంలో చికిత్స పొందడానికి వచ్చిన చిన్నారులతో కలిసి డైరెక్టర్ వికాస్ భాటియా, వైద్యులు కేక్ కట్ చేశారు. చిన్నారుల ఆరోగ్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఎయిమ్స్‌లో చిన్నారులకు ఆధునిక వైద్యసేవలు అందజేస్తున్నామని, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటే సంప్రదించాలన్నారు. ఆధునిక సర్జరీ యూనిట్ల్ల ఏర్పాటకు కృషి చేస్తున్నట్లు వికాస్ భాటియా తెలిపారు.