
ట్రాక్టర్‌ను ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం
కనగల్: బైక్‌లపై వెళ్తున్న ఇద్దరు యువకులు రోడ్డుపై ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొని మృతిచెందారు. ఈ ఘటన కనగల్ మండలం బాబాసాహెబ్‌గూడెం గ్రామ స్టేజీ వద్ద బుధవారం రాత్రి జరిగింది. గురువారం ఎస్‌ఐ విష్ణుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. అనుముల మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రైతు సింగం కొండల్ ట్రాక్టర్‌లో బుధవారం వడ్ల లోడుతో కనగల్ మండలం శేరిలింగోటంలోని ఐకేపీ కేంద్రానికి వస్తుండగా.. బాబాసాహెబ్‌గూడెం గ్రామ స్టేజీ వద్ద టైరు పంక్చర్ కావడంతో ట్రాక్టర్ ట్రాలీని రోడ్డుపై నిలిపి ఉంచాడు. బుధవారం రాత్రి అనుముల మండలం శ్రీనాథపురం గ్రామ పంచాయతీ పరిధిలోని బంటువారిగూడేనికి చెందిన చింతకాయల కిరణ్(33), గుర్రంపోడు మండలం పల్లిపహాడ్ గ్రామానికి చెందిన జనికల అఖిల్ కలిసి బైక్‌పై నల్లగొండ వైపు వస్తూ బాబాసాహెబ్‌గూడెం గ్రామ స్టేజీ వద్ద ట్రాక్టర్‌ను గమనించకుండా దానిని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయడ్డారు. వారిని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కిరణ్ మృతిచెందాడు. అఖిల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మృతుడు కిరణ్‌కు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కిరణ్ వరికోత మిషన్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ప్రమాదం జరిగిన మూడు గంటల తర్వాత ట్రాక్టర్ ట్రాలీని పోలీసులు రోడ్డు పక్కకు తీయిస్తుండగా.. మిర్యాలగూడలోని చెన్త్నె షాపింగ్ మాల్‌లో పనిచేస్తున్న గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామానికి చెందిన బల్గూరి శేఖర్(35) స్వగ్రామానికి బైక్‌పై వెళ్తూ ట్రాక్టర్ ట్రాలీని ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. కిరణ్ తమ్ముడు సంతోష్, శేఖర్ భార్య కవిత ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ ట్రాలీని రోడ్డుపై నిర్లక్ష్యంగా వదిలి వెళ్లిన సింగం కొండల్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఫ ౖబైక్‌పై వెళ్తూ ఢీకొని ఒకరు..
ఫ పోలీసులు ట్రాక్టర్‌ను పక్కకు
తీస్తుండగా మరో యువకుడు ..

ట్రాక్టర్‌ను ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం