ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచండి | - | Sakshi

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచండి

Apr 11 2025 2:45 AM | Updated on Apr 11 2025 2:45 AM

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచండి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచండి

మోటకొండూర్‌, ఆత్మకూర్‌(ఎం) : మోటకొండూరు మండలం కదిరేణిగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను గురువారం జెడ్పీ సీఈఓ శోభారాణి పరిశీలించారు. పనులు వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పీహెచ్‌సీ, అంగన్‌వాడీ కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. పోషణ అభియాన్‌ హ్యాండ్‌ వాష్‌ డేలో పాల్గొన్నారు. అదే విధంగా సన్నబియ్యం లబ్ధిదారు ఇంట్లో భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ నాగదివ్య, ఎంపీడీఓ ఇందిర, ఎంపీఓ చంద్రశేఖర్‌, డాక్టర్‌ విజయ్‌ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ఆత్మకూరు ఎంపీడీఓ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. రాజీవ్‌ యువ వికాసం పథకంపై యువతకు అవగా హన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాములునాయక్‌, సూపరింటెండెంట్‌ లోకేశ్వర్‌రెడ్డి, ఎంపీఓ పద్మావతి పాల్గొన్నారు.

నృసింహుడికి

సంప్రదాయ పూజలు

యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గురువారం సంప్రదాయ పూజలు నేత్రపర్వంగా చేపట్టారు. వేకువజా మున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అ నంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చించారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు. సా యంత్రం వెండి జోడు సేవలను ఊరేగించారు.

ప్రాథమిక పాఠశాలల్లో

నేటి నుంచి ఎస్‌ఏ–2

భువనగిరి : జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో శుక్రవారం నుంచి ఎస్‌ఏ–2 వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 484 ఉండగా వాటిలో 14,195 మంది విద్యార్థులు ఉన్నారు. ఉద యం 9 నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఉన్నత, జిల్లా పరిషత్‌ పాఠశాలల విద్యార్థులకు ఈ నెల 9నుంచి పరీక్షలు మొదలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement