
మహనీయుడు.. మహాత్మా ఫూలే
భువనగిరిటౌన్ : మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని.. భారత గడ్డపై పుట్టడం మన అందరి అదృష్టమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం భువనగిరి పట్టణంలోని జగదేవ్ చౌరస్తా వద్ద బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫూలే జయంతి ఉత్సవాలకు జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేజ్ చిస్తి వివిధ సంఘాల నాయకులతో కలిసి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. దేశంలో ఎన్నో మార్పులకు జ్యోతిరావు ఫూలే ముఖ్య కారణమన్నారు. నాడు సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడి సామాజిక మార్పు తీసుకొచ్చిన గొప్ప సంఘ సంస్కర్త ఫూలే అని కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి పూలే ఎంతగానో శ్రమించారన్నారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏప్రిల్ మాసం మొత్తం మహనీయుల జయంతి ఉత్సవాలను పండుగలా నిర్వహించుకుందామ న్నారు. కులాల అంతరాలు పోవాలంటే చదివే చిరునామా అని అన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజలింగం, మాజీ మున్సిపల్ చైర్మన్, వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఫూలే.. భారతగడ్డపై పుట్టడం
మన అదృష్టం
భువనగిరి ఎమ్మెల్యే కుంభ ర ,
కలెక్టర్ హనుమంతరావు