ఆరేళ్ల చిన్నారికి బ్రెయిన్‌ క్యాన్సర్‌ | - | Sakshi

ఆరేళ్ల చిన్నారికి బ్రెయిన్‌ క్యాన్సర్‌

Apr 17 2025 1:45 AM | Updated on Apr 17 2025 1:45 AM

ఆరేళ్ల చిన్నారికి బ్రెయిన్‌ క్యాన్సర్‌

ఆరేళ్ల చిన్నారికి బ్రెయిన్‌ క్యాన్సర్‌

మా పాపకు ప్రాణదానం చేయండి

మాది నిరుపేద కుటుంబం. మా పెద్ద పాపకి బ్రెయిన్‌ క్యాన్సర్‌ రావడంతో ఉన్న ఇంటిని అమ్మి వైద్యం చేయించాం. అయినా నయం కాలేదు. మా దగ్గర ఖర్చు చేయడానికి పైసలు లేవు. ఎవరైనా దాతలు మాకు సహాయం అందించి మా పాప ప్రాణం కాపాడండి. మాకు రేషన్‌కార్డు లేకపోవడంతో ఎక్కడా ఉచిత వైద్యం పొందలేకపోతున్నాం. మాపై దయతలచి అధికారులు రేషన్‌కార్డు మంజూరు చేయాలని వేడుకుంటున్నా.

– అనిత, ప్రసన్న తల్లి

మునుగోడు: తోటి పిల్లలతో కలిసి బడికి పోవాల్సిన ఆరేళ్ల చిన్నారి బ్రెయిన్‌ క్యాన్సర్‌ బారిన పడింది. ఎలాగైనా తమ కుమార్తెను కాపాడుకోవడానికి ఆమె తల్లిదండ్రులు ఇల్లు అమ్మి, అప్పులు చేసి కీమోథెరపీ చేయిస్తున్నారు. ప్రస్త్తుతం వారి చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వివరాలు.. మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామానికి చెందిన పగిడిమర్రి మహేష్‌, అనిత దంపతులకు 2016లో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమారైలు సంతానం. పెద్ద కుమారై ప్రసన్న 2019లో జన్మించింది. 2023లో ప్రసన్న అనారోగ్యానికి గురికావడంతో అప్పటి నుంచి ఆ చిన్నారిని అనేక ఆస్పత్రుల్లో వైద్యులకు చూపించినా ఆమెకు వచ్చిన జబ్బు ఏమిటో ఏ డాక్టర్‌ గుర్తించలేకపోయారు. ఆరు నెలల క్రితం ఆ చిన్నారి బ్రెయిన్‌లో ట్యూమర్‌ ఉందని వైద్యులు తేల్చారు. దీనికి తోడు బ్రెయిన్‌ క్యాన్సర్‌ కూడా ఉందని చెప్పారు.

ఆస్తులు అమ్మి వైద్యం చేయిస్తున్న

తల్లిదండ్రులు..

మహేష్‌ వండ్రంగి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడికి స్వగ్రామంలో ఎలాంటి వ్యవసాయ భూమి, ఆస్తులు లేవు. బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌కు వలస వెళ్లి తన అన్నదమ్ములతో కలసి ఉంటూ అక్కడే పనిచేసి ఓ ఇల్లు కొనుక్కున్నాడు. కుమారై అనారోగ్యానికి గురికావడంతో ఆ ఇంటిని రూ.23 లక్షలకు విక్రయించి ఆమెకు హైదరాబాద్‌లో కీమోథెరపీ చేయిస్తున్నాడు. అంతేకాకుండా తన వద్ద ఉన్న వస్తువులు రవాణా చేసే రెండు వాహనాలను కూడా విక్రయించినా తన కుమార్తె వైద్యానికి డబ్బులు సరిపోకపోవడంతో బంధువులు, స్నేహితుల వద్ద అప్పు చేశాడు. ఇప్పటి వరకు రూ.40లక్షల వరకు ప్రసన్న వైద్యం కోసం ఖర్చు చేశాడు.

రేషన్‌ కార్డు లేకపోవడంతో ఆర్థిక భారం..

మహేష్‌, అనిత దంపతులు 2018లో రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ అప్పటి నుంచి నూతన రేషన్‌ కార్డులు ఇవ్వకపోవడంతో వారికి నేటికీ రేషన్‌ కార్డు మంజూరు కాలేదు. దీంతో వారి కుమార్తెకు ఏ ఆస్పత్రిలో కూడా ఉచిత వైద్యం అందడం లేదు. కనీసం తమ చిన్నారికి అవసరమైన రక్తం కూడా వేల రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుందని వాపోతున్నారు. తమకు రేషన్‌ కార్డు ఉంటే వైద్య ఖర్చుల భారం సగానికి పైగా తగ్గేదంటున్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు తమపై దయతలచి తమ చిన్నారిని కాపాడుకునేందుకు నూతన రేషన్‌ కార్డు మంజూరు చేయడంతో పాటు వైద్య ఖర్చులకు దాతలు సహాయం అందించాలని వేడుకుంటున్నారు.

ఫ సొంత ఇల్లు అమ్మి, అప్పులు చేసి

కీమోథెరపీ చేయిస్తున్న తల్లిదండ్రులు

ఫ ఇప్పటివరకు రూ.40లక్షలకు పైగా అయిన వైద్యం ఖర్చు

ఫ దాతల సాయం కోసం ఎదురుచూపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement