ప్రధాన వార్తలు

చంద్రబాబు జీవితానికి ఇదే చివరి ఎలక్షన్ కావొచ్చు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్నారు.జగన్ ప్రెస్‌మీట్ హైలైట్స్..మీడియా ప్రతినిధి: ఎన్నిక రద్దు కోరతారా?వైఎస్ జగన్: ఇలా జరిగేవాటికి ఎన్నికలు జరపడం ఎందుకు?. అసలు ఎన్నికల సంఘం ఏం చేస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తులు, వ్యవస్థలు దిగజారిపోయారు. కచ్చితంగా ఈ ఎన్నికను కోర్టుల్లో సవాల్ చేస్తాం. మా అభ్యర్థులిద్దరినీ అందుకే పిలిపించాం. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో.. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రెండు ఉప ఎన్నికలు జరిపించాలని కోరతాం. మీడియా ప్రతినిధి: ఓట్ చోరీ పేరిట ఇండియా బ్లాక్ చేపట్టిన ర్యాలీకి దూరంగా ఎందుకు ఉన్నారు?ఏపీ 2024 ఎన్నికల నాటికి.. లెక్కింపు నాటికి 12.5 శాతం ఓట్లు పెరిగాయి. అంటే 48 లక్షల ఓట్లు పెరిగాయి.. ఎలా?. ఓట్ల చోరీ అంటూ జాతీయ స్థాయిలో ఉద్యమం లేవనెత్తుతున్న రాహుల్ గాంధీ.. ఏపీ గురించి ఎందుకు మాట్లాడడం లేదు?. ఎందుకంటే.. రేవంత్ ద్వారా చంద్రబాబు కాంగ్రెస్ హైకమాండ్ టచ్‌లో ఉంది. రాహుల్ గాంధీ చంద్రబాబుతో హాట్లైన్లో టచ్‌లో ఉన్నారు. కాబట్టే ఏపీ గురించి మాట్లాడడం లేదు. కాంగ్రెస్‌కు జాతీయ స్థాయిలో అధికార ప్రతినిధి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్ చంద్రబాబు గురించి ఒక్క మాట మాట్లాడడం లేదు. కానీ, నా గురించి మాత్రం మాట్లాడుతున్నారు. ఏపీలో ఎన్నో స్కామ్‌లు జరుగుతున్నాయి. అమరావతి నిర్మాణం పెద్ద స్కాం. పీపీఏల్లో కూడా అక్రమాలు జరుగుతున్నాయి. వీటి గురించి కాంగ్రెస్ ఎందుకు మాట్లాడడం లేదు.చంద్రబాబుకి వార్నింగ్ఏడాదిన్నర ఇప్పటికే గడిచిపోయిందికళ్లు మూసుకుని తెరిచేలోపు మూడున్నరేళ్లు గడిచిపోతుందికొద్దోగొప్పో ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవాళ్లకు నా విన్నపంప్రజాస్వామ్యం కాపాడుకోకపోతే ప్రమాదకరమైన పరిస్థితులు పుడతాయి.. అది గుర్తించాలితప్పుడు పనులకు పునాదులు వేయొద్దు చంద్రబాబుతప్పులు, దుర్మార్గాలు.. రేపు వృక్షంగా మారతాయిమీరు చేసే ప్రతీ పని, ప్రతీ తప్పు మీకు చుట్టుకుంటుందిచంద్రబాబు జీవితానికి ఇదే ఆఖరికి ఎన్నికలు కావొచ్చుకృష్ణా, రామా అనుకుంటే కాస్త పుణ్యమైనా వస్తుందిఇకనైనా మారితే మంచిదిఇలాగే ఉంటే.. భవిష్యత్తులో టీడీపీకి డిపాజిట్ కూడా రాదువైఎస్సార్సీపీ వాళ్లే లక్ష్యంగా..టీడీపీ వాళ్లు వందలమంది ఉన్న పోలీసులు పట్టించుకోలేదుఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ మూకలు రెచ్చిపోయాయివైఎస్సార్సీపీ మహిళా ఏజెంట్లపై దాడి చేశారుఅభ్యర్థి హేమంత్ రెడ్డిని ఇంట్లో నుంచి బయటకు రానీయలేదుపులివెందుల టౌన్లో ఉన్న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేశారుతన ఇంట్లో ఉన్న అవినాష్‌ను ఉదయం 4గం.కే అరెస్ట్ చేశారుఎర్రబలిల్లో బూత్‌లోకి ఓటర్లను రానీయలేదురిగ్గింగ్ చేయడానికి వెళ్లిన టీడీపీ వాళ్లకు చక్కగా పోలీసులు స్వాగతం పలికారువైఎస్సార్సీపీ శ్రేణులను మాత్రం తరిమి తరిమి కొట్టారుతమ ఊరిలో తమను ఓటు వేయనీయలేదని ఆవేదన వ్యక్తం చేశారుఓటు వేస్తామంటూ.. కొందరు పోలీసుల కాళ్లు పట్టుకున్నారుఓటుకు వెళ్తుంటే బూత్‌ల్లోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారంటూ మరికొందరు ధర్నాలు చేశారుప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందంటూ ఇంకొందరు ఆవేదన వ్యక్తం చేశారుపోలీసులు.. పచ్చ చొక్కా వేసుకోవాల్సిందే!ఏరికోరి పోలీసులను నియమించుకున్నారుడీఐజీ కోయ ప్రవీణ్ ఆధ్వర్యంలో ఈ ఉప ఎన్నికలు జరిగాయికోయ ప్రవీణ్.. టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహనరావు సమీప బంధువుపచ్చ చొక్కా వేసుకున్న డీఐజీ.. ఆయన బలగం ఈ ఎన్నిక నిర్వహించాయిటీడీపీ ప్రభుత్వం మాట వినని ఐపీఎస్ అధికారులకు తప్పని వేధింపులుబాబు మాట వినకుంటే డీజీ స్థాయి వాళ్లు కూడా జైలుకే!ఒక్కో ఓటర్‌కు ఒక్కోరౌడీని దింపారుమంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే రిగ్గింగ్ జరిగిందిమంత్రి సవిత ఆధ్వర్యంలో బయటి నుంచి వచ్చారుజమ్మలమడుగు నుంచి ఆదినారాయణరెడ్డి నల్లపురెడ్డికి తీసుకొచ్చారుఈ కొత్తపల్లిలో పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి మకాం వేశారుబీటెక్ రవి పులివెందుల రూరల్ ఓటర్ కాదు.. కనంపల్లిలో తిష్ట వేసి దౌర్జన్యం చేశాడుపోలీసుల సమక్షంలోనే బయటివాళ్లు వచ్చి పాగా వేశారుపచ్చ చొక్కా వేసుకున్న పోలీసులు 700 మంది.. బయటి నుంచి టీడీపీ నేతలు, వాళ్ల వర్గీయులు.. దాదాపుగా మొత్తం 7 వేలమంది పులివెందులలో మోహరించారుఒక్కో ఓటర్ కోసం బయటి నుంచి వచ్చిన ఒక్కో రౌడీప్రతీ పోలింగ్‌బూత్‌కు 400 మందిని మోహరించారుపోలీసులే దొంగ ఓట్లను ప్రొత్సహించారుకలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సమక్షంలోనే టీడీపీ నేతలు దొంగ ఓట్లు వేశారుస్వేచ్ఛగా జరిగాయని ఎవరైనా అంటారా?ఆఖరికి ఇవాళ రెండు కేంద్రాల్లో జరుగుతున్న రీపోలింగ్‌లోనూ దొంగ ఓట్లేఈ సందర్భంగా.. క్యూ లైన్లో దర్జాగా నిలబడి దొంగ ఓట్లు వేసిన వాళ్ల ఫొటోలతో సహా వివరాలను వైఎస్ జగన్ చదివి వినిపించారుపోలింగ్ బూత్‌లను మార్చేశారుపోలింగ్ బూత్‌లను ఇష్టానుసారంగా మార్చేశారుఒక ఊరివాళ్లు.. మరో ఊరికి వెళ్లి మరీ ఓటేయాలటసొంత గ్రామం కాకుండా ఇతర గ్రామాలకు వెళ్లి ఓటేయాలా?ప్రజాస్వామ్యం సిగ్గుపడేలా ఎన్నిక నిర్వహించారుపోలింగ్బూత్ ఆవరణలో సీసీటీవీ ఫుటేజీలు ఇచ్చే ధైర్యముందా?ప్రతిబూత్‌లో వెబ్‌కాస్టింగ్ ఇచ్చే దమ్ముందా?అసలు పులివెందులలో జరిగింది ఎన్నికే అంటారా?ఏపీలో ప్రజాస్వామ్యం కనబడడం లేదురాష్ట్ర చరిత్రలో ఏనాడూ ఇంత హింస జరగలేదుబందిపోటు దొంగల తరహాలో చంద్రబాబు ఎన్నిక జరిపించారుచంబల్ లోయ బందిపోట్లను మరిపించేలా ఎల్లో బ్యాచ్ ఓట్ల రిగ్గింగ్‌కు పాల్పడిందిఈ బందిపోట్ల ముఠానాయకుడు చంద్రబాబేచంద్రబాబుది అడ్డగోలు రాజకీయంచంద్రబాబుది రాక్షస పాలనఆయనొక మాబ్స్టర్, ఫ్రాడ్స్టర్చంద్రబాబుకి తన పాలనపై నమ్మకం ఉంటే.. ప్రజాస్వామ్యబద్ధంగా, కేంద్ర బలగాలతో ఎన్నిక జరిపించండిపోలింగ్ ఏజెంట్లు లేకుండా జరిగేది ఎన్నికలంటారా?ఓటర్ జాబితా పరిశీలన పోలింగ్ ఏజెంట్ హక్కుఏజెంట్ల నుంచి ఫాం-12ను పోలీసులు లాక్కున్నారువైఎస్సార్సీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్‌ల్లో కూర్చోనీయలేదు15 బూత్‌ల్లో వైఎస్సార్సీపీ ఏజెంట్లే లేకుండా చేశారువైఎస్సార్సీపీ ఏజెంట్లు లేకుండా పోలింగ్ ఎలా నిర్వహిస్తారు?రాష్ట్రంలో ఇంత అన్యాయంగా ఏనాడూ ఎన్నికలు జరగలేదుప్రజాస్వామ్యం ఇంత దిగజారిన పరిస్థితులు బహుశా ఏనాడూ చూసి ఉండరుఏపీలో శాంతిభద్రతలు లేవురాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదునిన్న పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా దాడులే అందుకు నిదర్శనంపోలింగ్ బూత్‌ల్లో ఏజెంట్లు లేకుండా ఎన్నికలు జరిపారు

ఏపీ ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ మాట్లాడరేం?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. ఏపీలో ఓట్ల గురించి ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. ఎందుకంటే చంద్రబాబుతో రాహుల్ గాంధీ హాట్లైన్లో టచ్‌లో ఉన్నారని ఆరోపించారు. చంద్రబాబుతో రేవంత్, కాంగ్రెస్ హైకమాండ్ టచ్‌లో ఉంటారని చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఓట్ల చోరీ గురించి అవకతవకలు జరిగాయని రాహుల్ గాంధీ.. కర్ణాటక, మహారాష్ట్ర గురించి మాట్లాడతారు. కానీ, ఏపీ గురించి మాత్రం ఆయన ఎందుకు మాట్లాడటం లేదు?. రేవంత్ ద్వారా చంద్రబాబు కాంగ్రెస్ అధిష్టానంతో టచ్‌లో ఉంటారు. చంద్రబాబు గురించి ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణికం ఠాకూర్ ఒక్క కామెంట్ కూడా ఎందుకు చేయరు?. అమరావతిలో ఎన్నో స్కామ్‌లు జరుగుతున్నాయి. అమరావతి నిర్మాణం పెద్ద స్కాం. దీనిపై కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు?. పీపీఏల్లో కూడా అక్రమాలు జరుగుతున్నాయి. 2024 ఎన్నికల నాటికి.. ఓట్ల లెక్కింపు నాటికి 12.5శాతం ఓట్లు పెరిగాయి. అంటే 48 లక్షల ఓట్లు పెరిగాయి.. ఇది ఎలా?’ అని ప్రశ్నించారు.

ఆర్మీ దుస్తుల్లో రియాలిటీ షోకి.. ప్రొటోకాల్ ఉల్లంఘనేనా?
కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC).. భారతదేశంలో ప్రసిద్ధమైన హిందీ భాషా టెలివిజన్ క్విజ్ షో. నటదిగ్గజం అమితాబ్ బచ్చన్ హోస్టింగ్‌లో 17వ సీజన్ నడుస్తోంది ఇప్పుడు. అయితే.. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా టెలికాస్ట్ కాబోతున్న ప్రత్యేక ఎపిసోడ్ ప్రోమో తాజాగా రిలీజ్ కాగా.. సోషల్ మీడియా తీవ్రస్థాయిలో మండిపడుతోంది. Kaun Banega Crorepati (KBC) 2025 స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఎపిసోడ్‌పై ఇప్పుడు నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హనరింగ్ హీరోస్ పేరిట ఓ స్పెషల్ ఎపిసోడ్ ప్రొమోను వదిలింది సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్. కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కమాండర్ ప్రేరణా దియోస్తలీ ఈ షోలో పాల్గొనడమే ఇందుకు కారణం. ప్రొమోలో.. అమితాబ్ బచ్చన్ వీరిని ఘనంగా స్వాగతించారు. ఆపరేషన్ సిందూర్ ఉద్దేశం ఏంటని ప్రశ్నించారాయ. దానికి కర్నల్ ఖురేషీ సమాధానమిస్తూ.. పాకిస్తాన్ తరచూ ఉగ్రదాడులు చేస్తోంది. స్పందన అవసరం. అందుకే ఆపరేషన్ సిందూర్ జరిగింది అని తెలిపారు. అయితే.. ఆర్మీ అధికారులను పూర్తి యూనిఫారంలో ఓ టీవీ రియాలిటీ షోలో చూపించడం పట్ల సోషల్ మీడియాలో కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్లను అలా యూనిఫామ్‌లోనే ఆహ్వానించాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. కొంతమంది ఇది సైనిక ప్రోటోకాల్‌కు అనుగుణంగా ఉందా? అని ప్రశ్నించారు. సైన్యం పీఆర్ ఏజెన్సీలా మారిపోయిందా?.. లేకుంటే రాజకీయ మైలేజ్ కోసం ఇలాంటి పని చేశారా? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.భారత సాయుధ దళాలకు ఒక గౌరవం, హుందాతనం ఉన్నాయి. రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాటిని నాశనం చేస్తున్నారు. ఇది సిగ్గుచేటు.. .. ఏ దేశంలోనైనా కీలకమైన సైనిక ఆపరేషన్ తర్వాత అధికారులు ఇలా టీవీ షోలలో పాల్గొనడం చూశామా? విధి నిర్వహణలో ఉన్నవారికి ఇలా ఎలా అనుమతిస్తారు? ప్రస్తుత ప్రభుత్వం తమ స్వార్థ రాజకీయాల కోసం మన సైన్యాన్ని సిగ్గు లేకుండా వాడుకుంటోంది.. ఆర్మీ అధికారులు.. అదీ యూనిఫాంలో.. ఆర్మీ ఆపరేషన్ గురించి మాట్లాడడం.. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా?Army officers in uniform going to KBC to talk about Op Sindoor with Amitabh Bachchan.Has something like this ever happened before? pic.twitter.com/hs5X0uJCKp— Arjun* (@mxtaverse) August 13, 2025ఆర్మీ ప్రోటోకాల్ ప్రకారం...ఆర్మీ డ్రెస్ రెగ్యులేషన్స్ ప్రకారం.. సాంస్కృతిక కార్యక్రమాల్లో అధికారిక యూనిఫారాన్ని ధరించడం అనుమతించబడదు. బహిరంగ ప్రదేశాలు అంటే రెస్టారెంట్లు వగైరా.. చివరకు వ్యక్తిగత ప్రయాణాల్లోనూ ధరించడానికి వీల్లేదు. తాజాగా మలయాళ స్టార్ నటుడు తన లెఫ్టినెంట్ కర్నల్ హోదాను అగౌరవపరుస్తూ.. కేరళ ప్రభుత్వ ప్రచారంలో యూనిఫాంతో కనిపించారనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆయన ఆ ఆరోపణలు ఖండించారు. అయితే.. ఇక్కడ ఓ మినహాయింపు ఉంది. కమాండింగ్ ఆఫీసర్ చేత రాతపూర్వకంగా అనుమతి తీసుకుని.. అనధికారిక కార్యక్రమాలకు యూనిఫాం ధరించి వెళ్లొచ్చు. బహుశా.. ఇప్పుడు ఈ ముగ్గురు అలాగే హజరై ఉంటారని పలువురు భావిస్తున్నారు. పంద్రాగష్టున సోనీ టీవీలో సోనీలీవ్ ఓటీటీలో ఈ ఫుల్ ఎపిసోడ్‌ను వీక్షించొచ్చు.పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్, పీఓకేలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై విజయవంతంగా దాడులు నిర్వహించింది. ఈ మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను కేంద్ర రక్షణ, విదేశాంగ శాఖ బ్రీఫింగ్ ఇచ్చింది. ఇంత క్లిష్టమైన ఆపరేషన్ గురించి దేశ ప్రజలకు వెల్లడించింది కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్లే. ఇక.. ప్రేరణా ప్రేరణా దియోస్తలీ.. కిందటి ఏడాది భారత నేవీలో వార్‌షిప్ తొలి కమాండ్‌గా గుర్తింపు దక్కించుకున్నారు.

జేడన్ సీల్స్.. బ్యాటింగ్ ప్రపంచానికి ముంచుకొస్తున్న సరికొత్త ముప్పు
జేడన్ సీల్స్. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ క్రికెట్లో తరుచూ వినిపిస్తున్న పేరు. ఈ విండీస్ నయా ఫాస్ట్ బౌలింగ్ సంచలనం ఈ ఏడాదిలో ఫార్మాట్లకతీతంగా విశేషంగా రాణిస్తూ బ్యాటర్ల పాలిట సింహస్వప్నంలా మారాడు. 2021లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ 23 ఏళ్ల ట్రినిడాడియన్ బౌలర్ ఈ ఏడాదే లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. సీల్స్ ఈ ఏడాది 8 వన్డేల్లో 18 వికెట్లు.. 21 టెస్ట్‌ల్లో 88 వికెట్లు తీశాడు.తాజాగా పాకిస్తాన్‌పై సంచలన ప్రదర్శనతో సీల్స్ మరోసారి వార్తల్లో నిలిచాడు. పాక్‌తో నిన్న జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో సీల్స్ 7.2 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 6 వికెట్లు తీశాడు. ఫలితంగా పాక్ విండీస్ నిర్దేశించిన 295 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ 92 పరుగులకే కుప్పకూలింది.ఈ ఇన్నింగ్స్‌లో సీల్స్ నిప్పులు చెరిగే బంతులతో పాక్ ఆటగాళ్లను భయబ్రాంతులకు గురి చేశాడు. సీల్స్ దెబ్బకు పాక్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. పాక్ ఇన్నింగ్స్‌లో డకౌటైన ఐదుగురు ఆటగాళ్లలో సీల్స్ ఒక్కడే నాలుగు వికెట్లు తీశాడు. సీల్స్ బౌలింగ్‌లో పాక్ ఆటగాళ్లు బంతి బంతికి గండాన్ని ఎదుర్కొన్నారు. బంతిని వదిలేసినా సమస్యే, ఆడాలని ప్రయత్నించినా సమస్యే.సీల్స్ ప్రదర్శనలు ఈ ఏడాదంతా ఇలాగే కొనసాగాయి. పాక్‌తో తాజాగా ముగిసిన వన్డే సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌కు ముందు స్వదేశంలోనే ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సీల్స్ వేసిన స్పెల్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ స్పెల్స్‌లో ఒకటిగా నిలిచింది. ఆ మ్యాచ్‌లో సీల్స్ 15.5 ఓవర్లలో 10 మెయిడిన్లు వేసి కేవలం 5 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఈ సంచలన ప్రదర్శనల అనంతరం సీల్స్ క్రికెట్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు మరో పేసు గుర్రం వచ్చిందంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. విండీస్ జట్టు త్వరలో భారత్‌లో పర్యటంచనుండగా సీల్స్‌పై ఫోకస్ మరింత పెరిగింది. వరల్డ్ క్లాస్ భారత బ్యాటర్లను అతను ఏ మేరకు నిలవరించగలడో అని చర్చలు మొదలయ్యాయి. సీల్స్ ఈ ఏడాది ఐపీఎల్ మినీ వేలంలోనూ హాట్ పిక్ అయ్యే అవకాశం ఉంది. అతడిని కేకేఆర్ తన్నుకుపోవచ్చు. ఎందుకంటే అతను కరీబియన్ లీగ్‌లో ఇదివరకే వారి సిస్టర్ ఫ్రాంచైజీ అయిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు ఆడుతున్నాడు.రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన సీల్స్ విండీస్ తరఫున ఇప్పటివరకు 21 టెస్ట్‌లు ఆడి మూడు 5 వికెట్ల ప్రదర్శనలతో 88 వికెట్లు తీశాడు. 25 వన్డేల్లో ఓ ఐదు వికెట్ల ప్రదర్శనతో 31 వికెట్లు తీశాడు.

అమలు చేశారా బాబూ!.. షరతుల సంగతేంటి?
సత్యం, అసత్యాలతో నిమిత్తం లేదు.. వినేవారు ఏమనుకుంటారో అన్న సందేహం అస్సలు రాదు. తనను తానే పొగిడేసుకుంటారు. చెప్పే దాంట్లో నిజం ఉందన్న భ్రాంతి కలిగిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరికి మచ్చు తునకలివి. మాటల మార్చేందుకు ఏమాత్రం తటపటాయించరు కూడా. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న చంద్రబాబు ఎక్కడ ఏ ఉపన్యాసం చేసినా చిత్ర, విచిత్రాలు కనిపిస్తాయి.పాడేరులో ఆదివాసి దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఇటీవల ఆయన ప్రసంగం చూడండి. ఇక్కడ తనకంటే మేధావి ఎవరైనా ఉన్నారా అని అడగటమూ.. లేరని ఆయనే తేల్చయడం కూడా జరిగిపోయిందట. తనది ముందు చూపని.. సూపర్ సిక్స్ ప్రకటించాం.. సూపర్ హిట్ చేశాం అని కూడా ఆయనంతకు ఆయన ప్రకటించుకున్నారు. ఈ మాటలిప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అంతేకాదు.. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికను దృష్టిలో ఉంచుకుని మళ్లీ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావించి తనకు తోచిన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో రింగ్ రోడ్డుతో సహా పలు కార్యక్రమాలు తనవే అన్నట్లుగా ఆయన మాట్లాడుతుంటారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే హెలికాఫ్టర్‌లో పర్యటిస్తుంటే గిరిజన ప్రాంతంలో ఉన్న కొండలు చూసి ఆయన ముగ్దులయ్యారట. వచ్చే జన్మలో గిరిజనుడిగా పుట్టాలని, ఇక్కడే ఉండాలని అనిపించిందని అన్నారు.ఒకప్పుడు ఎస్సీలలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని వ్యాఖ్యానించి విమర్శలకు గురైన చంద్రబాబు ఇప్పుడు గిరిజనులలో పుట్టాలని అనుకుంటున్నానని చెప్పడం స్వాగతించవలసిన విషయమే. కాకపోతే, ఇక్కడే ఉండాలని అనిపించిందని అన్న మాటలో చిత్తశుద్ది ఉందా అన్న సంశయం రావచ్చు. ఆయనకు నిజంగానే ఈ కోరిక ఉంటే, ఈ జన్మలోనే ఉంటానని చెప్పవచ్చు. తను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న తర్వాత గిరిజన ప్రాంతంలోనే ఉంటానని ప్రకటించి ఉంటే ఆయన కోరిక తీరేది కదా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. గిరిజన ప్రాంతాలలో డోలీలు లేకుండా చేసేశామని ఆయన అన్నారట. అందులో వాస్తవం లేదన్నది అందరికీ తెలిసిన విషయమే. అసలు సరైన రోడ్లు లేక గిరిజనులు పడేపాట్లు ఇన్నీ అన్నీ కావు. ఈ మధ్యనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతంలో పర్యటించి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసినా, అవి ముందుకు సాగడం లేదని గిరిజనులు గుర్రాలపై తిరుగుతూ నిరసన తెలిపారు.పీ-4 కోసం బయట నుంచి మార్గదర్శులను తెచ్చి గిరిజనులకు సహాయ పడతామని ఆయన అన్నారు. అంటే దీని అర్ధం ఇంతవరకు ఈ ప్రాంత పేదలను దత్తత తీసుకోవడానికి ఎవరూ పెద్దగా ముందుకు రాలేదని చెప్పకనే చెప్పినట్ల అయ్యింది. కాగా చంద్రబాబుకు పీ-4 పిచ్చి పట్టిందా అంటూ ఆయనకు మద్దతు ఇచ్చే ఒక మీడియా రాసిన వ్యాసం చూసిన తర్వాతైనా అందులో ఉన్న డొల్లతనం అర్థమై ఉండాలి. గిరిజనులకు మానిఫెస్టోలో ఇచ్చిన హామీలేమిటి? వాటిని ఏ మేరకు అమలు చేశామో చెప్పకుండా, అది తెచ్చా! ఇది తెచ్చా! అని ప్రచారం చేసుకుంటే ఏమి ప్రయోజనం? గిరిజనుల కోసం స్పెషల్ డీఎస్సీ వేస్తామని చెప్పిన హామీ ఎందుకు నెరవేర్చలేకపోయారో వివరించి ఉండాలి కదా! పాడేరు మెడికల్ కాలేజీని త్వరలో పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. బాగానే ఉంది. కానీ, ఏడాది కాలంలో ఎందుకు ముందుకు తీసుకువెళ్లలేదు?.వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు పూనుకుని భవనాల నిర్మాణాలు కూడా చేపడితే, మెడికల్ సీట్లు అక్కర్లేదని చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం ఏ రకంగా రాష్ట్రానికి, గిరిజన ప్రాంతానికి మేలు చేసినట్లు?. గిరిజన ప్రాంతాన్ని తానే అభివృద్ది చేశానని, ఉద్యోగాలు ఇచ్చానని ఆయన చెప్పుకున్నా, వాస్తవ పరిస్థితి అలా కనిపించదు. గిరిజనుల ఇళ్ల వద్దకే సేవలందించే వలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. ఫలితంగా ఇప్పుడు గిరిజనులు రేషన్ కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది.కేంద్ర స్కీములను కూడా తన ఖాతాలో వేసుకుని మాట్లాడారు. ఫలానా పనిలో తన వాటా ఇంత అని చెప్పుకుంటే ఫర్వాలేదు. కానీ, మొత్తం తానే చేశానని చెప్పడం ద్వారా నగుబాటుకు గురవుతున్న విషయాన్ని ఆయన పట్టించుకోరు. ఔటర్ రింగ్ రోడ్డు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వచ్చిందన్న విషయం ప్రజలకు తెలియదా?. పోనీ హైదరాబాద్‌లో అన్ని చేశానని చెప్పుకునే చంద్రబాబు విశాఖ, విజయవాడ తదితర ముఖ్యమైన నగరాలకు ఫలానా పని చేశానని ఎందుకు చెప్పలేకపోతున్నారు?. సూపర్ సిక్స్ హామీల అమలు.. సూపర్ హిట్ అని ప్రచారంలో పెట్టడం ఆయన మేధావితనానికి నిదర్శనం అనుకోవాలి. జనం కూడా అన్ని హామీలు నెరవేర్చేశారని భావించాలన్నమాట. నిజమే! అక్కడ ఉన్న ఆ సమావేశంలో ఆయనంత మేధావి లేకపోవడం వల్ల ఆ హామీల గురించి ఎవరూ ప్రశ్నించి ఉండకపోవచ్చు. లేదా పోలీసులతో ఎక్కడ కేసులు పెట్టిస్తారో అన్న భయంతో ఆ విషయాలు అడిగి ఉండకపోవచ్చు.చివరికి వైఎస్సార్సీపీ గిరిజన ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజును సభ వద్దకు అనుమతించకపోవడంతో ప్రశ్నించే వారే లేకుండాపోయారు. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామన్న హామీ నెరవేరిందా?. నెలకు రూ.3000 నిరుద్యోగ భృతి ఇస్తున్నారా?. తల్లికి వందనం సహా రైతు భరోసా, తదితర స్కీములు ఒక ఏడాది ఎగవేసి, ఈ ఏడాది అరకొరగా అమలు చేస్తే అవి సూపర్ హిట్ అయినట్లా? మహిళలకు ఉచిత బస్ ప్రయాణం గురించి ఇచ్చిన హామీ ఏమిటి? ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదు. ఇప్పుడు అమలు చేయాలని సంకల్పించినా, అన్ని రకాల బస్సుల్లో ఆ సదుపాయం కల్పించకుండా షరతులు పెట్టడం ప్రజలను మోసం చేయడం అవుతుందా? కాదా?. ఎన్నికల మేనిఫెస్టోలోని మిగిలిన 145 హామీల సంగతేమిటి?. అవి అమలు చేయకపోయినా ఫర్వాలేదని అనుకుంటున్నారా?. వాటి ఊసే ఎత్తడం లేదే!. అయినా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పగలిగిన ధైర్యం అనండి.. నేర్పరితనం అనండి ఆయన సొంతమే అని అనుకోవాలి!.ఇక గిరిజన ప్రాంతంలో సభకు వెళ్లి అక్కడ కూడా వివేకా హత్య కేసు ప్రస్తావన తేవడంలోని దురుద్దేశం అర్దం కావడం లేదా?. పులివెందులలో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో దాని గురించి ఈ ప్రచారం చేయడం అవసరమా?. పులివెందుల ప్రజలకు అక్కడ ఏం జరిగిందో తెలియకుండా ఉంటుందా?. ఒకపక్క టీడీపీకి చెందిన వారు రౌడీయిజం చేస్తుంటే, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై అంత దారుణంగా దాడి చేసినా, అలాంటి ఘోరాలను అరికట్టకపోగా, వైఎస్సార్సీపీ వారిని ఉద్దేశించి ఏవేవో మాట్లాడితే నమ్మడానికి జనం పిచ్చివాళ్లని అనుకుంటున్నారా?. రౌడీయిజం, అబద్దాలు రాజకీయాలకు అవసరమా? అని చంద్రబాబు ప్రశ్నించడం విడ్డూరమే అనుకోవాలి. అబద్దాలు చెప్పడంలో దేశంలోనే ఆయనను మించిన నేత లేరని ప్రత్యర్ధి పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తుంటారు. వారు చేసే విమర్శలలో ఒక్కదానికి కూడా ఆయన నేరుగా ఎప్పుడూ జవాబుఇవ్వలేదు. కళ్లార్పకుండా అబద్దాలు ఆడగల సత్తా చంద్రబాబుకు ఉందని దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో పలుమార్లు అన్నారు.ఆ సమయంలో చంద్రబాబు లేచి తాను ఆడిన అబద్దమేమిటో చెప్పాలని ఎప్పుడూ సవాల్ చేసినట్లు కనిపించలేదు. రౌడీయిజం గురించి మాట్లాడాలంటే ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ గూండాలు చేస్తున్న రౌడీయిజం గురించి ముందుగా ఆయన బదులు ఇస్తే బాగుంటుంది. ఏమైందో కానీ, టీడీపీకి చెందిన ఒక మీడియానే ఆ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలపై, రౌడీయిజంపై విమర్శలు చేసింది. దానికి చంద్రబాబు జవాబు ఇచ్చే పరిస్థితి లేదనే చెప్పాలి. ఒకటి మాత్రం వాస్తం. ఆయనకు ముందుచూపు ఉన్నమాట కొంతవరకు ఒప్పుకోవాలి. కాంగ్రెస్, బీజేపీలను ఆయన దూషించినంతగా మరెవరూ దూషించి ఉండరు. కానీ, ఆ రెండు పార్టీలతో మళ్లీ జతకట్టగలరు. 2024 ఎన్నికల సమయంలో ఎంత ముందు చూపులేకపోతే బీజేపీని బ్రతిమిలాడి మరీ పొత్తు ఎలా పెట్టుకుంటారు?. దాని ద్వారా టీడీపీ ఎన్నో రకాల మాయోపాయాలను ప్రదర్శించగలిగింది కదా!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

ముఖేశ్ అంబానీ ఏం చదివారో తెలుసా?
ఇండియాలో బిజినెస్ ఐకానిక్‌గా ఎదిగి దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన ముఖేశ్ అంబానీ పుట్టింది భారత్‌లో కాదు. అంబానీ ఏడెన్(ప్రస్తుతం యెమెన్)లో జన్మించారు. పుట్టిన ఏడాదికే ఇండియా వచ్చి చదువు పూర్తయ్యాక తండ్రితోపాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ స్థాపించి రూ.కోట్ల రూపాయలు సంపాదించారు.తాజాగా హురున్ ఇండియా 2025లో అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాల జాబితాలో తన స్థానాన్ని సుస్థిరపరుచుకున్నారు. చాలా విభాగాల్లో వ్యాపారాలు సాగిస్తున్న అంబానీ కుటుంబ వ్యాపార విలువ రూ.28.2 లక్షల కోట్లు. ఇది భారతదేశ జీడీపీలో పన్నెండో వంతుగా ఉండడం విశేషం. అయితే ఇంతకీ ముఖేశ్ అంబానీ ఏం చదివారో తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. ఆ వివరాలు కింద తెలియజేశాం.పుట్టిన ప్రదేశం: 1957 ఏప్రిల్ 19న ఏడెన్ (ప్రస్తుత యెమెన్)లో జన్మించారు. తర్వాత ఆయన 1958లో కుటుంబంతో భారత్‌కు వచ్చారు. 1950ల్లో ఆయన తండ్రి ధీరూబాయ్ అంబానీ యెమెన్‌లో పని చేస్తుండేవారు. దాంతో ముఖేశ్ అక్కడే జన్మించాల్సి వచ్చింది.ప్రాథమిక విద్య: గ్వాలియర్‌లోని సింధియా పాఠశాలలో చదివారు.హైస్కూల్: ముఖేశ్ సోదరుడు అనిల్ అంబానీతో కలిసి ముంబైలోని పెద్దార్ రోడ్‌లోని హిల్ గ్రాంజ్ హైస్కూల్లో సెకండరీ విద్య పూర్తి చేశారు.సీనియర్ సెకండరీ: ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో చదివారు.అండర్ గ్రాడ్యుయేషన్: ముంబైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి కెమికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందారు.పోస్ట్ గ్రాడ్యుయేషన్: స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ ప్రోగ్రామ్‌లో చేరారు. ఒకప్పటి మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీవ్ బామర్ స్టాన్‌ఫోర్డ్‌లో ముఖేశ్ క్లాస్మేట్. 1980లో తన తండ్రి ధీరూభాయ్ అంబానీతో కలిసి రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్మాణంలో పాలుపంచుకున్నారు.ఇదీ చదవండి: తలపై గన్ పెట్టి బెదిరిస్తే ఎలా?

Jigris Teaser: నవ్వులు పూయిస్తున్న ‘జిగ్రీస్’ టీజర్
‘కొంతమంది ఉంటారు శుద్ధపూసలు. ఫస్ట్ వద్దేవద్దు అని షో చేస్తారు. తర్వాత కూర్చున్నాక నాకంటే ఎక్కువ తాగుతారు’ అనే డైలాగ్‌తో మొదలైంది జిగ్రీస్ మూవీ టీజర్. కృష్ణ బురుగుల, ధీరజ్ అథేర్య, మణి వక్కా, రామ్‌నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించారు. కృష్ణ వోడపల్లి నిర్మాతగా వ్యవహరించాడు. తాజాగా ఈ మూవీ టీజర్‌ని స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా విడుదల చేశారు. ఫ్రెండ్షిప్, అడ్వెంచర్, కామెడీ నేపథ్యంలో టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది.టీజర్ రిలీజ్ అనంతరం సందీప్ మాట్లాడుతూ.. ‘ కృష్ణ వోడపల్లి నాకు చిన్నప్పటి నుంచి స్నేహితుడు. నాకు చెబితే తిడతానని.. చెప్పకుండానే సినిమా స్టార్ట్ చేశాడు. యానిమల్ షూటింగ్ గ్యాప్‌లో హైదరాబాద్‌కి వచ్చినప్పుడు కొన్ని విజువల్స్ చూపించాడు. చాలా బాగున్నాయి. కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. ఈ రోజుల్లో కాన్ టెంపరరీ కామెడీ బూతులు లేకుండా చాలా బాగా రాసిండు, తీసిండు డైరెక్టర్ హరీష్. టీజర్లో చూసిన కామెడీ చాలా తక్కువే. సినిమాలో అలాంటి సీన్లు చాలా ఉన్నాయి. కంటెంట్ బాగుంటే చాలు డైరెక్టర్, నిర్మాతలతో సంబంధం లేకుండా సినిమాను హిట్ చేస్తారు మన తెలుగు ప్రేక్షకులు. ఈ చిన్న సినిమా కంటెంట్ బాగుంది. అందరూ సపోర్ట్ చేయండి’ అన్నారు. బిగ్ ఫిష్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Rajasthan: డీఆర్డీఓలో ఉంటూ పాక్‌కు రహస్యాలు.. గెస్ట్‌హౌస్ మేనేజర్ అరెస్ట్
జైసల్మేర్: డీఆర్డీఓ శాస్త్రవేత్తల, భారత ఆర్మీ అధికారుల రహస్య వివరాలను పాకిస్తాన్ నిఘా సంస్థతో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఆర్డీఓ ఉద్యోగిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో గల డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) గెస్ట్ హౌస్‌లో కాంట్రాక్టు మేనేజర్‌గా పనిచేస్తున్న మహేంద్ర ప్రసాద్‌ను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేశాడనే ఆరోపణలతో మహేంద్ర ప్రసాద్‌ను రాజస్థాన్ సీఐడీ ఇంటెలిజెన్స్ అరెస్టు చేసింది.మహేంద్ర ప్రసాద్ భారతదేశానికి సంబంధించిన రహస్య, వ్యూహాత్మక సమాచారాన్ని పాకిస్తాన్‌కు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. బుధవారం అతనిని కోర్టు ముందు హాజరుపరచనున్నారు. తరువాత తదుపరి విచారణ కోసం రిమాండ్‌కు తీసుకువెళ్లనున్నారు. రాబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు, రాజస్థాన్ సీఐడీ ఇంటెలిజెన్స్ రాష్ట్రంలోని భద్రతను చురుకుగా పర్యవేక్షిస్తోందని రాజస్థాన్, జైపూర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సిఐడి (సెక్యూరిటీ), డాక్టర్ విష్ణుకాంత్ మీడియాకు తెలిపారు.ఉత్తరాఖండ్‌లోని అల్మోరాకు చెందిన కాంట్రాక్టు మేనేజర్ మహేంద్ర ప్రసాద్ పాకిస్తాన్ నిఘా సంస్థతో సోషల్ మీడియా ద్వారా సంభాషిస్తున్నట్లు సీఐడీ నిఘా సమయంలో వెల్లడయ్యింది. క్షిపణి, ఆయుధ పరీక్షల కోసం ఫైరింగ్ రేంజ్‌ను సందర్శించే డీఆర్డీఓ శాస్త్రవేత్తలు, భారత ఆర్మీ అధికారుల కదలిక గురించి అతను పాకిస్తాన్‌లోని హ్యాండ్లర్లకు రహస్య సమాచారాన్ని అందిస్తున్నట్లు సీఐడీ పోలీసులు అనుమానిస్తున్నారు.జైపూర్‌లోని సెంట్రల్ ఇంటరాగేషన్ సెంటర్లో వివిధ నిఘా సంస్థలు నిందితుడిని సంయుక్తంగా విచారించాయి. మహేంద్ర ప్రసాద్ మొబైల్ ఫోన్‌ను సాంకేతికంగా పరీక్షించగా, అతను డీఆర్డీఓతో పాటు భారత సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ నిర్వాహకులతో పంచుకుంటున్నాడని స్పష్టమయ్యింది. ఈ నేపధ్యంలో అధికారిక రహస్యాల చట్టం, 1923 కింద మహేంద్ర ప్రసాద్‌పై కేసు నమోదు చేశారు.

అమితాబ్ పరువు తీస్తోంది.. సిగ్గులేని మనిషి : జయపై కంగన ఫైర్
సమాజ్‌వాదీ పార్టీ , రాజ్యసభ ఎంపీ జయాబచ్చన్పై హిమాచల్ ప్రదేశ్‌లోని మండికి చెందిన బీజేపీ ఎంపి కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో తనతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని బచ్చన్ తోసేస్తున్న వీడియో వైరల్ అయిన నేపథ్యంలో కంగనా ఆమెపై తీవ్ర విమర్శలు చేసింది.ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో జయాబచ్చన్ వీడియోను షేర్ చేస్తూ ఇలా కాబెంట్ చేసింది. “అత్యంత చెడిపోయిన, విశేషాధికారం కలిగిన మహిళ” అని అంటూ విమర్శలు గుప్పించింది. అంతేకాదు భర్త అమితాబ్ బచ్చన్ మర్యాదను మంటగలుపుతోందంటూ వ్యాఖ్యానించింది.“ఆమె అమితాబ్ బచ్చన్ భార్య కాబట్టి ప్రజలు ఆమె కోపతాపాలను/అర్ధంలేని తనాన్ని సహించారు. సమాజ్‌వాదీ పార్టి కోడిపుంజులా పందెంకోడిలా, ప్రవర్తింస్తోందంటూ ఎద్దేవా చేస్తే, ఎంత అవమానం, సిగ్గుచేటు” అని కంగనా మండిపడింది. ప్రస్తుతం కంగనా వ్యాఖ్యాలు నెట్టింట చర్చకు దారి తీశాయి. గతంలో జయాబచ్చన ఇలాంటి విమర్శలొచ్చిన సందర్భంలో కంగనా వెనకేసుకొచ్చింది. నిజం చెప్పాలంటే..ఆమె కోపిష్టిమనిషే కానీ అదే సమయంలో ఆమె గొప్ప వ్యక్తి అంటూ జయాను తెగ పొగిడేసింది. 1970లలో ఆమె సినీరంగంలో రాణించారని, సినీ పరిశ్రమలో అత్యంత గౌరవప్రదమైన మహిళల్లో ఒకరు అంటూ జయపై కంగనా ప్రశంసించింది. (జయా బచ్చన్‌కు మళ్లీ కోపమొచ్చింది...సెల్ఫీ తీసుకోబోతే)సెల్ఫీ కోసం ఆశతో వచ్చిన అభిమానిని తోసేసి ఏం చేస్తున్నావ్ (క్యా కర్ రహే హై ఆప్?) అంటూ ఆగ్రహం వ్యక్తం చేసి పక్కకు నెట్టేశారు.దీంతో సదరు వ్యక్తి సారీ చేప్పారు. ఈ అనూహ్య పరిణామానికి అక్కడున్నవారంతా హతాశులైన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్ హల్చల్ చేసింది. సింపుల్‌గా సెల్ఫీ వద్దు అంటే సరిపోయేది.. కానీ అతణ్ణి చేత్తో నెట్టివేయడం దారుణం అంటున్నారు. కొంతమంది యాటిట్యూడ్ అంటూ జయాబచ్చన్‌ను విమర్శించగా, మరి కొందరు జయ ప్రవర్తనను సమర్థించారు కూడా.

వీధి కుక్కల తీర్పుపై సుప్రీం కోర్టు యూటర్న్?
న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతం నుంచి వీధి కుక్కలన్నింటినీ తొలగించాలంటూ వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టు యూటర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. చాలామంది ఈ తీర్పును సమర్థించగా.. కొన్ని వర్గాల నుంచి మాత్రం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ తరుణంలో.. ఈ అంశాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ముందు కొందరు న్యాయవాదులు లేవనెత్తారు. అయితే అభ్యంతరాల నేపథ్యంలో ఆ తీర్పును పునపరిశీలిస్తానని బుధవారం స్పష్టం చేశారు. దీంతో తీర్పు వెనక్కి తీసే అవకాశాలు ఉండొచ్చనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు జంతు ప్రేమికులు.రాజధాని రీజియన్‌లో పసికందులు, వృద్దులుపై వీధి కుక్కల దాడుల ఘటనలపై పలు మీడియా సంస్థలు ఇచ్చాయి. అందులో ఘటనలతో పాటు రేబిస్ బారిన పడి మరణించిన దాఖలాలను ప్రస్తావించాయి. ఈ కథనాలను సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. వీధి కుక్కలను నివాస ప్రాంతాల్లో సంచరించడం ఏమాత్రం యోగ్యం కాదని, వాటిని పట్టుకుని షెల్టర్లకు తరలించాలని, ఇందుకు 8 వారాల గడువు విధిస్తూ ఢిల్లీ సర్కార్‌కు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం (ఆగస్టు 11వ తేదీ) ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో..ఏదైనా సంస్థలు ఈ చర్యలను అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని, ఇది ప్రజల మేలు కోసం చేస్తున్నది స్పష్టం చేసింది. అయితే వీధి కుక్కల కోసం షెల్టర్లు నిర్మించడం, తరలించడం ఆచరణ సాధ్యం కాకపోవచ్చని ఢిల్లీ అధికార యంత్రాంగం అంటోంది. అదే సమయంలో రాజకీయ, సినీ, ఇతర ప్రముఖుల నుంచి సుప్రీం కోర్టు తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.
నాడు సోనియా పేరు ఓటరు లిస్టులో ఎలా చేరింది?: రాహుల్‌కు బీజేపీ కౌంటర్
IPL 2026: ‘ఈసారి వేలంలో అతడికే అత్యధిక ధర’
జగాలన్నీ ఒకెత్తు, కృష్ణుడు ఒక్కడూ ఒక ఎత్తు
20 ఏళ్లకే దేశానికి అధ్యక్షుడు..! కట్‌చేస్తే..
ముఖేశ్ అంబానీ ఏం చదివారో తెలుసా?
ఓటీటీలోకి 'సూపర్ మ్యాన్' లేటెస్ట్ సినిమా
గుడ్‌న్యూస్ చెప్పిన 'రంగస్థలం' నటుడు.. బేబీ బంప్‌తో భార్య!
ఏపీ ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ మాట్లాడరేం?: వైఎస్ జగన్
పచ్చ జెండా కట్టినా వదలని 'ఎల్లో' మూకలు
ఇషాన్ కిషన్ సేనకు భారీ షాక్.. టీమిండియా స్టార్ ఆటగాడు దూరం
'ప్రతి నిమిషం నా తోడుగా ఉంది మీరే'.. తల్లిదండ్రులతో సింగర్ మధుప్రియ (ఫొటోలు)
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. సంఘంలో గౌరవం
మనదే బాగుంది.. ఒక్క హామీ అమలు చేయకున్నా నిత్యం కనిపిస్తున్నాం..!!
ఎట్టకేలకు వీడిన సచివాలయ ఉద్యోగి కిడ్నాప్ మిస్టరీ.. అసలు కథ ఇదే..
మహేశ్ బాబు నిర్మాతగా కొత్త సినిమా.. ఈ హీరోని గుర్తుపట్టారా?
మెడలో పసుపు తాడుతో 'కోర్ట్' హీరోయిన్
మందుబాబులకు ఇక ఇంటి వద్దకే మద్యం: స్విగ్గీ రెడీ
నకిలీ నోట్ల ముఠానట! ఇక్కడికొచ్చి లొంగిపోతున్నాడు!
ఇంకొన్ని ఫిర్యాదులొచ్చే వరకూ ఆగుదాం సార్!!
మరోసారి చెలరేగిపోయిన టీమిండియా యువ సంచలనం.. 119 పరుగులు, 10 వికెట్లు
ఈ రాశి వారికి ఆశయాలు నెరవేరతాయి.. భూములు కొంటారు
ఎన్నికల కమిషన్ విఫలం: హైకోర్టు
నన్నెవ్వరూ ఆపలేరు.. ఎన్టీఆర్ కౌంటర్ లోకేష్‌కేనా?
కరుగుతోన్న బంగారు కొండ.. తులం ఎంతంటే..
ఈ రాశి వారు వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు
పులివెందుల పోలీసులకు హైకోర్టులో చుక్కెదురు
క్రికెట్లో పెను సంచలనం.. 5 బంతుల్లో మ్యాచ్ ఫినిష్
పేరుకే పల్లెటూరు.. చూస్తే సిటీ లెవల్!
పులివెందుల,ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో భారీ రిగ్గింగ్
నాడు సోనియా పేరు ఓటరు లిస్టులో ఎలా చేరింది?: రాహుల్‌కు బీజేపీ కౌంటర్
IPL 2026: ‘ఈసారి వేలంలో అతడికే అత్యధిక ధర’
జగాలన్నీ ఒకెత్తు, కృష్ణుడు ఒక్కడూ ఒక ఎత్తు
20 ఏళ్లకే దేశానికి అధ్యక్షుడు..! కట్‌చేస్తే..
ముఖేశ్ అంబానీ ఏం చదివారో తెలుసా?
ఓటీటీలోకి 'సూపర్ మ్యాన్' లేటెస్ట్ సినిమా
గుడ్‌న్యూస్ చెప్పిన 'రంగస్థలం' నటుడు.. బేబీ బంప్‌తో భార్య!
ఏపీ ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ మాట్లాడరేం?: వైఎస్ జగన్
పచ్చ జెండా కట్టినా వదలని 'ఎల్లో' మూకలు
ఇషాన్ కిషన్ సేనకు భారీ షాక్.. టీమిండియా స్టార్ ఆటగాడు దూరం
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. సంఘంలో గౌరవం
మనదే బాగుంది.. ఒక్క హామీ అమలు చేయకున్నా నిత్యం కనిపిస్తున్నాం..!!
ఎట్టకేలకు వీడిన సచివాలయ ఉద్యోగి కిడ్నాప్ మిస్టరీ.. అసలు కథ ఇదే..
మహేశ్ బాబు నిర్మాతగా కొత్త సినిమా.. ఈ హీరోని గుర్తుపట్టారా?
మెడలో పసుపు తాడుతో 'కోర్ట్' హీరోయిన్
మందుబాబులకు ఇక ఇంటి వద్దకే మద్యం: స్విగ్గీ రెడీ
నకిలీ నోట్ల ముఠానట! ఇక్కడికొచ్చి లొంగిపోతున్నాడు!
ఇంకొన్ని ఫిర్యాదులొచ్చే వరకూ ఆగుదాం సార్!!
మరోసారి చెలరేగిపోయిన టీమిండియా యువ సంచలనం.. 119 పరుగులు, 10 వికెట్లు
ఈ రాశి వారికి ఆశయాలు నెరవేరతాయి.. భూములు కొంటారు
ఎన్నికల కమిషన్ విఫలం: హైకోర్టు
నన్నెవ్వరూ ఆపలేరు.. ఎన్టీఆర్ కౌంటర్ లోకేష్‌కేనా?
కరుగుతోన్న బంగారు కొండ.. తులం ఎంతంటే..
ఈ రాశి వారు వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు
పులివెందుల పోలీసులకు హైకోర్టులో చుక్కెదురు
క్రికెట్లో పెను సంచలనం.. 5 బంతుల్లో మ్యాచ్ ఫినిష్
పేరుకే పల్లెటూరు.. చూస్తే సిటీ లెవల్!
పులివెందుల,ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో భారీ రిగ్గింగ్
ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ రూ. 50వేలు: స్పందించిన ఆర్బీఐ గవర్నర్
సినిమా

స్టార్ హీరో కొడుకు కోసం ముగ్గురు హీరోయిన్లు?
తమిళ హీరో విక్రమ్ వారసుడు ధ్రువ్ విక్రమ్ ఇప్పటికే రెండు సినిమాల్లో హీరోగా చేశాడు. కానీ సరైన సక్సెస్ అందుకోలేకపోయాడు. అయినా సరే ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం మారి సెల్వరాజ్ దర్శకత్వంలో 'బైసన్' అనే మూవీ చేస్తున్నాడు. క్రీడా నేపథ్యంలో సాగే ఈ చిత్రం చివరిదశకు చేరుకుంది. మరోవైపు మణిరత్నం దర్శకత్వంలో ఓ యూత్ ఫుల్ లవ్ స్టోరీలో ధ్రువ్‌కి ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఆ సినిమా చేస్తున్నప్పుడు కంఫర్ట్‌గా అనిపించలేదు: అనుపమ)మరోవైపు హిందీలో గతేడాది హిట్ అయిన 'కిల్' చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. టాలీవుడ్ దర్శకుడు రమేష్ వర్మ దీన్ని తెరకెక్కించనున్నారు. తమిళ వెర్షన్ కోసం ధ్రువ్ విక్రమ్ హీరోగా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇందులోనే ధ్రువ్‌కి జంటగా కాయదు లోహార్, అనుపమ పరమేశ్వరన్, కేతిక శర్మని తీసుకున్నట్లు తెలుస్తోంది.వాస్తవానికి ఒరిజినల్ హిందీ వెర్షన్లో ఒక హీరోయినే ఉంటుంది. కానీ తమిళం, తెలుగు భాషల్లోకి వచ్చేసరికి 'కిల్' చిత్ర కథలో మార్పులు చేసి ముగ్గురు హీరోయిన్లని ప్లాన్ చేసినట్లు సమాచారం. కాగా ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.(ఇదీ చదవండి: 'కూలీ' రెమ్యునరేషన్.. ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ?)

'కూలీ' రెమ్యునరేషన్.. ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ?
రజినీకాంత్ 'కూలీ' మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతానికైతే 'వార్ 2'తో పోలిస్తే దక్షిణాదిలో ఈ సినిమాకే బోలెడు హైప్ ఉంది. టికెట్ బుకింగ్స్‌లోనూ ఆ ట్రెండ్ కనిపిస్తోంది. మరి ఈ పోటీలో ఎవరు హిట్ కొడతారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే 'కూలీ'కి ఇంత హైప్ ఏర్పడటానికి కారణం ఏంటి? ఇందులో నటించిన స్టార్స్ ఎవరికెంత పారితోషికం ఇచ్చారనేది ఇప్పుడు చూద్దాం.చాన్నాళ్లుగా సరైన హిట్ లేని రజినీకాంత్‌కి 'జైలర్' సక్సెస్ మంచి ఊపు ఇచ్చింది. దీంతో లోకేశ్ కనగరాజ్ చెప్పిన మాస్ యాక్షన్ స్టోరీకి రజినీ ఓకే చెప్పాడు. అలా 'కూలీ' సెట్ అయింది. అయితే ఈ మూవీలో రజినీ, నాగ్, ఆమిర్ ఖాన్.. ఇలా ఎంతమంది స్టార్స్ ఉన్నప్పటికీ.. డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్, అనిరుధ్ పాటలే చాలావరకు తెలుగులో బోలెడంత హైప్‌కి కారణమని చెప్పొచ్చు.సరే అసలు విషయానికొస్తే ఈ సినిమాని సన్ పిక్చర్స్ దాదాపు రూ.350-400 కోట్ల బడ్జెట్‌తో నిర్మించింది. అయితే ఇందులో సగం నటీనటుల పారితోషికాలకే అయిపోయింది. ఎందుకంటే హీరోగా చేసిన రజినీకాంత్ రూ.150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారట. తర్వాత డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ రూ.50 కోట్లు అందుకున్నాడు. కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్వయంగా లోకేశ్.. తన పారితోషికం గురించి బయటపెట్టాడు.(ఇదీ చదవండి: రిలీజ్‌కి ముందే 'కూలీ' వసూళ్ల రికార్డ్)ఇక విలన్‌గా చేసిన నాగార్జునకు రూ.20-24 కోట్లు, తర్వాత అతిథి పాత్రలో నటించిన ఆమిర్ ఖాన్‌కి రూ.20 కోట్లు.. కీలక పాత్రలు చేసిన సత్యరాజ్, ఉపేంద్రకు తలో రూ.5 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరో కీ రోల్ చేసిన శ్రుతి హాసన్ రూ.4 కోట్లు అందుకున్నట్లు టాక్. అలానే ఈ సినిమాకు అదిరిపోయే పాటలిచ్చిన అనిరుధ్‌కి రూ.15 కోట్ల వరకు రెమ్యునరేషన్ ముట్టజెప్పినట్లు సమాచారం. ఇలా సగానికి పైగా బడ్జెట్ పారితోషికాలకే పోగా.. మిగిలిన మొత్తంతో సినిమాని నిర్మించినట్లు తెలుస్తోంది.'కూలీ'పై భారీ అంచనాలు ఉన్నాయి. తమిళం నుంచి తొలి రూ.1000 కోట్ల సినిమా కాబోతుందని జోస్యాలు చెబుతున్నారు. కానీ అది ఎంతవరకు నిజం కాబోతుందనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. గురువారం(ఆగస్టు 14) ఉదయం 6-7 గంటల నుంచే తెలుగు రాష్ట్రాల్లో షోలో పడనున్నాయి. ఇప్పటికే టికెట్స్ ఆన్ లైన్లో పెట్టగా బాగానే సేల్ అవుతున్నాయి. మరి ఈ 'కూలీ'.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: రజినీకాంత్ కూలీ.. తెలంగాణలోనూ అదే పరిస్థితి!)

ఉపాసన ఫోన్లో చరణ్ నెంబర్ ఏ పేరుతో ఉంటుందో తెలుసా?
సినిమా సెలబ్రిటీల జీవనశైలి ఎప్పుడూ ఒక మాయాజాలంలా అభిమానులను, సినీ ప్రియులను ఆకర్షిస్తుంది. వారు ధరించే దుస్తులు మొదలు వాడే వస్తువుల వరకు ప్రతి దాని గురించి తెలుసుకోవాలనే కుతూహలం అందరిలోనూ ఉంటుంది. వారు ఇళ్లలో ఎలా ఉంటారు? రోజువారీ జీవితంలో వారి ఆహారపు అలవాట్లు ఏమిటి? జీవిత భాగస్వామితో వాళ్లు ఎలా ఉంటారు? తదితర విషయాలపై అందరికి ఆసక్తి ఉంటుంది. అందుకే పలు ఇంటర్వ్యూల్లో సినీ ప్రముఖులు తమ పర్సనల్ లైఫ్ గురించి చెబుతుంటారు. తాజాగా మెగా కోడలు ఉపాసన తన భర్త రామ్ చరణ్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకుంది.ఆ పేరుతో చరణ్ మొబైల్ నెంబర్సాధారణంగా భార్యభర్తలు తమ భాగస్వామి మొబైల్ నెంబర్లను ముద్దు పేరుతో సేవ్ చేసుకుంటారు. మహిళలు అయితే తమ భర్త పేరుని హబ్బీ, బేబీ, స్వీట్హార్ట్, మై లవ్..తదితర పేర్లతో సేవ్ చేసుకుంటారు. కానీ ఉపాసన మాత్రం చరణ్ నెంబర్ని వెరైటీ పేరుతో సేవ్ చేసుకుంది. తన ఫోన్లో చరణ్ నెంబర్ని ‘రామ్ చరణ్ 200(Ram Charan 200)’ అనే పేరుతో సేవ్ చేసుకుందట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఉపాసననే తెలియజేస్తూ..ఆ పేరు వెనుక ఉన్న కథ కూడా చెప్పింది.అందుకే ఆ పేరు.. చరణ్ నెంబర్ని రామ్ చరణ్ 200 అని ఎందుకు సేవ్ చేసుకుందో ఉపాసన వివరించింది. ప్రస్తుతం చరణ్ వాడుతున్న సిమ్ సంఖ్య ఇదట. ఇప్పటి వరకు ఆయన 199 సార్లు తన మొబైల్ నెంబర్ని మార్చుకున్నారట. ప్రస్తుతం వాడుతున్నది 200వ నెంబర్ అట. అందుకే రామ్ చరణ్ 200 అని సేవ్ చేసుకున్నానని నవ్వూతూ చెప్పింది ఉపాసన. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. చరణ్ 200 సార్లు మొబైల్ నెంబర్స్ మార్చారా? అంటూ నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మహేశ్ బాబు నిర్మాతగా కొత్త సినిమా.. ఈ హీరోని గుర్తుపట్టారా?
ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్న మహేశ్ బాబు.. ఆ బిజీలో ఉన్నాడు. మరోవైపు నిర్మాతగా కొత్త మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మేరకు డీటైల్స్ బయటపెట్టారు. 'కేరాఫ్ కంచరపాలెం' ఫేమ్ వెంకటేశ్ మహా చాన్నాళ్ల తర్వాత మళ్లీ దర్శకత్వం చేస్తున్నాడు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? హీరో ఎవరు?(ఇదీ చదవండి: మెడలో పసుపు తాడుతో 'కోర్ట్' హీరోయిన్ శ్రీదేవి.. ఏంటి విషయం?)టాలీవుడ్లో హీరో కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్.. ఇటీవలే 'కింగ్డమ్'లోనూ హీరోకి సరిసమానంగా ఉండే నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు వెంకటేశ్ మహా దర్శకత్వంలో కొత్త సినిమా చేయబోతున్నాడు. దీనికి 'రావు బహదూర్' అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ కూడా వదిలారు.సత్యదేవ్.. 'రావు బహదూర్' ఫస్ట్ లుక్ పోస్టర్లో డిఫరెంట్‌గా కనిపించాడు. చెప్పాలంటే గుర్తుపట్టడం చాలా కష్టం. ముసలి రాజు గెటప్‌లో అస్సలు గుర్తుపట్టలేనట్లు ఉన్నాడు. 'అనుమానం పెనుభూతం' అనే ట్యాగ్ లైన్‌తో ఈ మూవీ తీస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించేశారు. గతంలో సత్యదేవ్-వెంకటేశ్ మహా 'ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య' అనే మూవీ చేశారు. కాకపోతే అది రీమేక్. ఇప్పుడు ఒరిజినల్ కంటెంట్‌తో వస్తున్నారు. ఈసారి ఏం మ్యాజిక్ చేస్తారో చూడాలి?(ఇదీ చదవండి: ఆ సినిమా చేస్తున్నప్పుడు కంఫర్ట్‌గా అనిపించలేదు: అనుపమ)
క్రీడలు

BCCI: అప్పటి వరకు అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ
బెంగళూరు: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ తన పూర్తి పదవీకాలం కొనసాగనున్నారు. 2022 అక్టోబర్‌లో ఎంపికైన ఆయన ఈ ఏడాది సెప్టెంబర్ వరకు బోర్డు అధ్యక్షుడిగా ఉంటారు. గత నెల 19న బిన్నీకి 70 ఏళ్లు పూర్తయ్యాయి. నిబంధనల ప్రకారం ఆయన వెంటనే తప్పుకోవాల్సి ఉంది. అయితే తాజాగా మంగళవారం ‘నేషనల్ స్పోర్ట్స్ బిల్’ పార్లమెంట్లో ఆమోదం పొందింది. దీని ప్రకారం క్రీడా సంఘాల ఆఫీస్ బేరర్ల వయోపరిమితిని 75 ఏళ్లకు పెంచారు.ఇక బీసీసీఐ కూడా ఒక క్రీడా సమాఖ్యగా ఈ బిల్లు పరిధిలోకి రావడంతో ఈ నిబంధన కూడా దానికి వర్తించనుంది. దీంతో బిన్నీ కొనసాగేందుకు మార్గం సుగమమైంది. సెప్టెంబరు చివర్లో జరిగే ఏజీఎంలోనే కొత్త అధ్యక్షుడి ఎన్నికపై బీసీసీఐ ముందుకు వెళుతుంది. ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు తీసుకోకపోయినా... 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్లో మన జట్టు దేశానికి ప్రాతినిధ్యం వహించనున్న నేపథ్యంలో బీసీసీఐ కూడా కొత్త బిల్లు పరిధిలోకి వచ్చింది.అయితే బోర్డు నుంచి ఎలాంటి సమాచారం కోరకుండా దానిని ఆర్టీఐ పరిధి నుంచి తప్పిస్తూ సవరణ చేర్చిన తర్వాతే ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. పార్లమెంట్లో ఇప్పుడే బిల్లు పాస్ అయింది కాబట్టి దానిని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత లోటుపాట్లపై చర్చిస్తామని బీసీసీఐ న్యాయ నిపుణుల బృందం అభిప్రాయపడింది. చదవండి: Shai Hope: వన్డే క్రికెట్ చరిత్రలో మోస్ట్ అండర్ రేటెడ్ బ్యాటర్

చిక్కుల్లో సురేశ్ రైనా.. ఈడీ నోటీసులు
టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా చిక్కుల్లో చిక్కుకున్నాడు. అక్రమ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ల వ్యవహారంలో అతనికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు పంపింది. ఇవాళ అతను ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.1xBet అనే అక్రమ బెట్టింగ్ యాప్‌కు ప్రమోషన్ చేశాడని రైనాపై ఆరోపణలు ఉన్నాయి. ఈ యాప్ గాంబ్లింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ గుర్తించింది. దీంతో మనీలాండరింగ్ నిరోధక చట్టం PMLA కింద రైనాపై విచారణ జరుగనుంది. అక్రమ యాప్ ప్రకటనల్లో రైనా కనిపించినట్లు ఈడీ వద్ద ఆధారాలు ఉన్నాయి.ఈ కేసుకు సంబంధించి ఈడీ ఇప్పటికే గూగుల్, మెటా సంస్థలకు కూడా నోటీసులు జారీ చేసింది. 1xBet తరహాలోనే గ్యాంబ్లింగ్‌కు పాల్పడే పలు యాప్స్‌పై కూడా దర్యాప్తు జరుగుతుంది. ఈ కేసులకు సంబంధించి దేశవ్యాప్తంగా 27,000 కోట్ల పన్ను ఎగవేత జరిగినట్లు అంచనా. ఇలాంటి కేసుల్లోనే సినీ సెలబ్రిటీలు విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్, రానా దగ్గుబాటి కూడా విచారణ ఎదుర్కొంటున్నారు.ఇదిలా ఉంటే, సురేశ్ రైనా టీమిండియా, ఐపీఎల్ నుంచి తప్పుకున్న తర్వాత వ్యాఖ్యాతగా కొనసాగుతున్నాడు. త్వరలో అతను సీఎస్కేకు బ్యాటింగ్ కోచ్‌గా వెళ్లనున్నాడని సమాచారం. రైనాకు టీమిండియా తరఫున ఆడిన దానికంటే ఐపీఎల్ ద్వారా విశేషమైన గుర్తింపు దక్కింది. ఐపీఎల్లో విశేషంగా రాణించడం ద్వారా అతన్ని మిస్టర్ ఐపీఎల్‌గా కీర్తిస్తారు. ఐపీఎల్లో రైనా 2008 నుంచి 2021 వరకు సీఎస్కే తరఫున ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు. సీఎస్కే సాధించిన 4 ఐపీఎల్ టైటిళ్లలో రైనా కీలకపాత్ర పోషించాడు.

మీకు ఆటే ముఖ్యమా?: బీసీసీఐ తీరుపై హర్భజన్ ఆగ్రహం
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీరుపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మండిపడ్డాడు. దేశం కంటే మీకు ఆటే ముఖ్యమా అంటూ బోర్డు పెద్దల్ని ప్రశ్నించాడు. క్రికెట్ కంటే సైనికుల త్యాగం ఎంతో గొప్పదని.. కాబట్టి ఇప్పటికైనా ఆసియా కప్-2025 (Asia Cup) విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించాడు.పాక్‌తో మ్యాచ్ బహిష్కరించిన ఇండియా చాంపియన్స్ఇటీవల పహల్గామ్లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి అమాయక పర్యాటకుల ప్రాణాలు పొట్టనబెట్టుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో తీవ్రంగా స్పందించిన భారత సైన్యం.. ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఇందుకు పాక్ సైన్యం ప్రతిస్పందించగా.. దాయాదికి కూడా గట్టిగానే బుద్ధి చెప్పింది.ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు నెలకొనగా.. ఇటీవల జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) టోర్నీలో భారత ఆటగాళ్లు పాకిస్తాన్ (IND vs PAK)తో మ్యాచ్‌ను బహిష్కరించారు. సెమీ ఫైనల్లో దాయాదితో పోటీ పడాల్సి ఉండగా.. తమకు అన్నింటికంటే దేశమే ముఖ్యమని శిఖర్ ధావన్, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు ఈ మ్యాచ్ నుంచి కూడా నిష్క్రమించారు.ఆసియా కప్‌లో మాత్రం దాయాదితో పోరుకు సై!అయితే, ఆసియా కప్ టీ20 టోర్నీ-2025లో మాత్రం భారత్- పాకిస్తాన్ ఒకే గ్రూపులో ఉండటంతో పాటు.. అత్యధికంగా మూడుసార్లు ముఖాముఖి పోటీ పడే అవకాశం ఉన్నట్లు షెడ్యూల్ ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీరుపై మాజీ క్రికెటర్లు, అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మీకు ఆటే ముఖ్యమా?పాకిస్తాన్‌తో టీమిండియా మ్యాచ్‌లను బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ముందుగా నిర్ణయించిన ప్రకారం మ్యాచ్‌లు యథావిధిగా సాగనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ స్పందించాడు. ‘‘వారికి (బీసీసీఐ) ఏది ముఖ్యమో.. ఏది ప్రాధాన్యం లేని విషయమో అర్థం కావడం లేదు.సరిహద్దులో నిలబడి ప్రాణాలకు తెగించి దేశాన్ని కాపాడే సైనికుల కుటుంబాలు.. తరచూ వారిని చూడలేవు. ఒక్కోసారి సైనికులు తమ ప్రాణాలనే త్యాగం చేయాల్సి వస్తుంది. వాళ్లు ఎప్పటికీ ఇంటికి తిరిగా రాలేరు కూడా!వారి త్యాగమే ఎంతో గొప్పదిఅందరి కంటే వారి త్యాగమే ఎంతో గొప్పది. వారితో పోలిస్తే ఇలాంటివి చాలా చిన్న విషయాలు. వారి కోసం మనం ఒక్క క్రికెట్ మ్యాచ్‌ను వదులుకోలేమా? మన ప్రభుత్వం కూడా ‘హింస- త్యాగం’ ఒకేచోట ఉండలేవని చెప్తోంది.కొంత మంది సరిహద్దులో యుద్ధం చేస్తున్నపుడు.. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నపుడు.. మనం మాత్రం వెళ్లి వాళ్లతో క్రికెట్ ఆడటమా?.. సమస్య పరిష్కారమయ్యేంత వరకు క్రికెట్ అనేది చిన్న విషయంలా చూడాలి. దేశ ప్రయోజనాలే మనకు ప్రథమ ప్రాధాన్యం కావాలి.మనకు ఏ గుర్తింపు వచ్చినా.. అది దేశం కారణంగానేనని గుర్తుపెట్టుకోండి. మీరొక ఆటగాడు లేదంటే నటుడు.. ఎవరైనా కానీవండి. దేశం కంటే ఎవరూ గొప్పవారు కాదు. దేశం తరఫున తప్పక నిర్వర్తించాల్సిన విధులను విస్మరించకూడదు’’ అంటూ భజ్జీ బీసీసీఐ తీరును ఎండగట్టాడు. చదవండి: Shai Hope: వన్డే క్రికెట్ చరిత్రలో మోస్ట్ అండర్ రేటెడ్ బ్యాటర్

న్యూజిలాండ్‌ను కాదని స్కాట్లాండ్కు వలస వెళ్లిన టీ20 క్రికెటర్
న్యూజిలాండ్ క్రికెటర్ టామ్ బ్రూస్ అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్న స్కాట్లాండ్కు వలస వెళ్లాడు. న్యూజిలాండ్ తరఫున సరైన అవకాశాలు రాకపోవడంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో జరుగనున్న వరల్డ్‌కప్ లీగ్-2 మ్యాచ్‌ల కోసం బ్రూక్ స్కాట్లాండ్ వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. బ్రూస్ తండ్రి స్వస్థలం స్కాట్లాండే కావడంతో అతనికి ఈ అవకాశం దక్కింది. బ్రూస్ న్యూజిలాండ్‌కు ఆడకముందు 2016లో స్కాట్లాండ్ డెవలెప్మెంట్ జట్టుకు ఆడాడు.2017లో బ్రూస్ న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో అరంగేట్రం చేశాడు. బ్రూస్ న్యూజిలాండ్ తరఫున రెండో మ్యాచ్‌లోనే మ్యాచ్ విన్నింగ్ హాఫ్ సెంచరీ సాధించి పర్వాలేదనిపించాడు. ఆతర్వాత అతను అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయాడు. తదుపరి 15 ఇన్నింగ్స్‌ల్లో మరో ఫిఫ్టి మాత్రమే చేయగలిగాడు. దీంతో జట్టులో స్థానం గల్లంతైంది.2020లో స్వదేశంలో భారత్‌తో జరిగిన సిరీస్‌లో అతను చివరిసారిగా న్యూజిలాండ్‌కు ఆడాడు. ఆ సిరీస్‌లో వరుస డకౌట్ల కారణంగా అతనిపై వేటు పడింది. ఆ సిరీస్‌ను న్యూజిలాండ్ 0-5 తేడాతో భారత్‌కు కోల్పోయింది.భారత్‌తో సిరీస్ తర్వాత బ్రూస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా జట్టులోకి రాలేకపోయాడు. దీంతో కెరీర్‌ను కొనసాగించేందుకు తన తండ్రి స్వస్థలమైన స్కాట్లాండ్కు వలస వెళ్లాడు. అక్కడ దేశవాలీ మ్యాచ్‌ల్లో సత్తా చాటి వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. 2017-2020 మధ్యలో బ్రూస్ న్యూజిలాండ్ తరఫున 17 మ్యాచ్‌లు ఆడి 2 హాఫ్ సెంచరీల సాయంతో 122.44 స్ట్రయిక్‌రేట్‌తో 279 పరుగులు చేశాడు.స్కాట్లాండ్ వన్డే జట్టుకు ఎంపికైన అనంతరం బ్రూస్ ఇలా అన్నాడు. "మా కుటుంబానికి స్కాటిష్ చరిత్ర ఉంది. స్కాట్లాండ్కు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉంది. ప్రపంచ వేదికపై స్కాట్లాండ్ విజయానికి నా వంతు కృషి చేస్తాను". ఈ మార్పుతో బ్రూస్ రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో చేరాడు.కాగా, వరల్డ్‌కప్ లీగ్-2లో భాగంగా స్కాట్లాండ్ కెనడా, నమీబియా దేశాలతో ఆగస్ట్ 29-సెప్టెంబర్ 6 మధ్యలో నాలుగు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది.
బిజినెస్

సమగ్ర భూ సంస్కరణలు చేపట్టాల్సిందే..
భారత్‌ను ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చేందుకు సమగ్ర భూ సంస్కరణలను చేపట్టాలంటూ భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) కీలక సూచనలు చేసింది. సమన్వయంతో, ఏకాభిప్రాయంతో కూడిన సంస్కరణలు అమలు చేసేందుకు, దేశవ్యాప్తంగా 3–5 శాతం మధ్య ఒకే స్టాంప్ డ్యూటీని అమలు చేసేందుందుకు వీలుగా జీఎస్టీ మాదిరి కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని కోరింది.రక్షణాత్మక ధోరణి, వాణిజ్య యుద్ధాలు సవాలును విసురుతున్నాయంటూ.. భారత్‌లో స్థిరమైన విధానాలు, బలమైన పారిశ్రామిక సామర్థ్యాలు, దేశీయంగా అతిపెద్ద వినియోగ మార్కెట్, యువ శ్రామిక శక్తి, విశ్వసనీయ భాగస్వామిగా చాలా దేశాల్లో ఉన్న గుర్తింపు.. ఇవన్నీ భారత్‌ను పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా మార్చగలవని సీఐఐ తెలిపింది. ప్రతీ రాష్ట్రంలోనూ సమగ్ర భూ నిర్వహణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, భూ వినియోగ మార్పిడిని పూర్తిగా డిజిటలైజ్ చేయడంతోపాటు స్టాంప్ డ్యూటీని 3–5 శాతం మధ్య స్థిరీకరణ చేయాలని సూచించింది. స్పష్టమైన భూ యాజమాన్యం దిశగా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఈ చర్యల ద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు చేరువ కావొచ్చని అభిప్రాయపడింది.సమ్మిళిత వృద్ధి..భారత్‌లో తయారీకి ఊతమివ్వడమే కాకుండా, ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంచే దిశగా బలమైన భూ సంస్కరణలు అమలు చేయాలని సీఐఐ కోరింది. గ్రామీణాభివృద్ధి సామర్థ్యాలను వెలికితీయడం ద్వారా సమ్మిళిత వృద్ధిని సాధించొచ్చంటూ కీలక సూచనలు చేసింది. భూ చట్టాల నిర్వహణ ప్రస్తుతం రాష్ట్రాల పరిధిలో ఉంది. కనుక కేంద్రం–రాష్ట్రాల మధ్య సహకారానికి వీలుగా జీఎస్టీ కౌన్సిల్ మాదిరి ఏర్పాటు చేయాలి. సమన్వయం, ఏకాభిప్రాయం ఆధారంగా ఈ సంస్థ సంస్కరణలు చేపట్టాలి.ఇండియా ఇండ్రస్టియల్ ల్యాండ్ బ్యాంక్ (ఐఐఎల్‌బీ) ఏర్పాటు ప్రశంసనీయమేనంటూ, ఇందులో ఉన్న సవాళ్లను ప్రస్తావించింది. ప్రస్తుతం ఇది కేవలం సమాచార సాధనంగానే పనిచేస్తోంది. రాష్ట్రాల మధ్య భూముల కేటాయింపు అధికారాలు సైతం ఉండాలి. దీనివల్ల పారదర్శకత పెరిగి, భూముల సమీకరణ సులభతరం అవుతుంది.ఇదీ చదవండి: టారిఫ్ ఒడిదుడుకులు ఇంకెన్ని రోజులు!రాష్ట్రాల స్థాయిల్లోనూ ఒకటికి మించిన అధికార యంత్రాంగాలు ఉండడాన్ని అవరోధంగా పేర్కొంది. దీన్ని అధిగమించేందుకు ఇంటెగ్రేటెడ్ ల్యాండ్ అథారిటీని ఏర్పాటు చేయాలి. భూములు కేటాయింపు, మార్పిడి, వివాదాల పరిష్కార అధికారాలు దీనికి ఉండాలి.భూ మార్పిడి విధానం డిజిటైజేషన్ చేయాలి. డిజిటల్ సంతకం పెట్టిన సర్టిఫికెట్లు, క్యూఆర్ కోడ్ ఆధారిత మూడో పక్షం ధ్రువీకరణతో పారదర్శకత తీసుకురావచ్చు. అవినీతిని తొలగించొచ్చు.దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో స్టాంప్ డ్యూటీలు వేర్వేరుగా ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా 3–5 శాతం మధ్యలో ఏకే విధమైన రేటును అమలు చేయాలి.

టారిఫ్ ఒడిదుడుకులు ఇంకెన్ని రోజులు!
అమెరికా టారిఫ్‌ల వల్ల నెలకొన్న ఒడిదుడుకుల ప్రభావం మనపై స్వల్పకాలికంగానే ఉంటుందని యూనియన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎండీ మధు నాయర్ చెప్పారు. దీర్ఘకాలికంగా చూసినప్పుడు, భారీ రుణభారం ఉన్న అమెరికా, ప్రస్తుతంతో పోలిస్తే కాస్త బలహీనపడొచ్చని ఆయన చెప్పారు. పరిస్థితులు క్రమంగా స్థిరపడి భారత్‌లాంటి దేశాలకు మేలు జరుగుతుందని ఆయన వెల్లడించారు. మన మార్కెట్లలో తీవ్ర స్థాయిలో కరెక్షన్ రాకపోవచ్చన్నారు. విదేశీ ఇన్వెస్టర్ల సంగతి అలా ఉంచితే, భారత ఆర్థిక మూలాలు మెరుగ్గా ఉన్న నేపథ్యంలో దేశీయంగా మార్కెట్లలోకి పెట్టుబడుల ప్రవాహం పటిష్టంగా ఉంటోందని నాయర్ చెప్పారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు, ఈపీఎఫ్ నిధులు, రిటైల్ ఇన్వెస్టర్లు, యులిప్స్ వంటి మార్గాల్లో ప్రతి నెలా రూ. 50,000 కోట్ల మేర పెట్టుబడులు వస్తున్నాయని ఆయన తెలిపారు. రూ.లక్ష కోట్ల ఏయూఎం లక్ష్యంరాబోయే అయిదేళ్లలో రూ. లక్ష కోట్ల ఏయూఎం (నిర్వహణలోని ఆస్తుల పరిమాణం) స్థాయిని సాధించాలని నిర్దేశించుకున్నట్లు నాయర్ చెప్పారు. ప్రస్తుతం ఇది సుమారు రూ. 23,000 కోట్లుగా ఉన్నట్లు వివరించారు. అధిక వృద్ధి సాధన దిశగా ప్రస్తుత పథకాలపై మరింతగా దృష్టి పెట్టడంతో పాటు కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నట్లు నాయర్ తెలిపారు. సెప్టెంబర్ 1న డైవర్సిఫైడ్ ఈక్విటీ ఆల్ క్యాప్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్‌ను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: టెలికాం టారిఫ్‌లు పెంపు?అర్థయ పేరిట స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఎస్ఐఎఫ్)ను నవంబర్‌లో అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు. ప్రస్తుతం కన్జూమర్ డిస్క్రిషనరీ, టెలికం, క్యాపిటల్ గూడ్స్/ఇండస్ట్రియల్స్ రంగాలు పెట్టుబడులకు ఆకర్షణీయంగా ఉండగా ఇంధన, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాలు కాస్త ప్రతికూలంగా ఉన్నాయని నాయర్ చెప్పారు.

హిందాల్కో లాభం రూ. 4,004 కోట్లు
న్యూఢిల్లీ: మెటల్ రంగ ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం హిందాల్కో ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 30 శాతం జంప్‌చేసి రూ. 4,004 కోట్లకు చేరింది. అత్యుత్తమ ప్రొడక్ట్ మిక్స్, వ్యయ నియంత్రణ ఇందుకు సహకరించాయి. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 3,074 కోట్లు ఆర్జించింది.మొత్తం ఆదాయం సైతం 13 శాతం ఎగసి రూ. 64,232 కోట్లను తాకింది. అల్యూమినియంకు అధిక ధరలు లభించడం ఇందుకు దోహదపడింది. గత క్యూ1లో రూ. 57,013 కోట్ల టర్నోవర్ అందుకుంది. యూఎస్ అనుబంధ సంస్థ నోవెలిస్ 1 శాతం అధికంగా 963 కేటీ షిప్‌మెంట్స్‌ను సాధించినట్లు కంపెనీ పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో హిందాల్కో షేరు 0.7% నీరసించి రూ. 667 వద్ద ముగిసింది.

మరింత దిగొచ్చిన ధరలు
న్యూఢిల్లీ: కూరగాయలు, ఆహారోత్పత్తులు, ధాన్యాల ధరలు మరింత కిందకు దిగొచ్చాయి. ఫలితంగా జూలై నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) ఎనిమిదేళ్ల కనిష్ట స్థాయి అయిన 1.55 శాతానికి పడిపోయింది. 2017 జూన్ నెలలో నమోదైన 1.46 శాతం తర్వాత ఇదే అత్యంత కనిష్ట రిటైల్ ద్రవ్యోల్బణం. ఈ ఏడాది జూన్ నెలలో ద్రవ్యోల్బణం 2.1 శాతంతో పోల్చి చూసినా 0.55 శాతం తక్కువగా నమోదైంది.2024 జూన్ నెలలో ఇది 3.6%గా ఉంది. ఈ వివరాలను కేంద్ర గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ విడుదల చేసింది. అంతర్జాతీయంగా అనిశ్చితులు పెరిగిపోయిన తరుణంలో రిటైల్, ఆహార ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం అన్నది వినియోగదారులతో పాటు విధాన నిర్ణేతలకూ ఉపశనమం కలిగిస్తుందన్నది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. ⇒ ఆహార విభాగంలో ద్రవ్యోల్బణం (కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్/సీఎఫ్‌పీఐ) మైనస్ 1.76 శాతానికి క్షీణించింది. జూన్‌లో ఇది మైనస్ 1.01గా ఉంది. 2019 జనవరి తర్వాత ఆహార విభాగంలో అతి తక్కువ ద్రవ్యోల్బణం ఇది. వరి, గోధుమ, చక్కెర, పప్పులు, ధాన్యాలు, కూరగాయలు, గుడ్లు తదితర ఉత్పత్తులు ఈ విభాగం కిందకు వస్తాయి. ⇒ గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం జూలై నెలకు 1.18 శాతంగా నమోదైంది. జూన్‌లో ఇది 1.72 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంత ఆహార ద్రవ్యోల్బణం మైనస్ 1.74 శాతానికి పతనమైంది. ⇒ పట్టణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 2.05 శాతానికి తగ్గింది.
ఫ్యామిలీ

పేరుకే పల్లెటూరు.. చూస్తే సిటీ లెవల్!
పల్లెటూరు అనగానే మననందరికీ గుర్తుకు వచ్చేది పచ్చని పొలాలు, పొందికైన ఇళ్లు, నినాదంగా గడిచే జీవితం. కానీ ఆ ఊరు అలా ఉండదు. పేరుకే పల్లెటూరు, దాని తీరు చూస్తే నగరానికి ఏమాత్రం తీసిపోదు. ఎందుకంటే ఆ ఊరు ఆసియాలోనే సంపన్న గ్రామం. ఇంతకీ ఇది ఎక్కడుందనేగా మీ డౌటు. ఇంకెక్కడ మన ఇండియాలోనే. ఏంటి ఏషియా రిచెస్ట్ విలేజ్ మనదేశంలో ఉందా అని ఆశ్చర్యపోతున్నారా! మరి ఇంకేందుకు ఆలస్యం.. ఆ ఊరు ఎక్కడ ఉందో, దాని విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఉన్న మాధపర్ గ్రామం.. ఆసియాలోనే ధనిక గ్రామంగా ప్రసిద్ధికెక్కింది. ఎటు చూసినా కాంక్రీట్ బిల్డింగ్లు, ఆధునాతన సౌకర్యాలతో అలరారుతూ ఉంటుంది ఈ విలేజ్. ఈ ఊర్లోని బ్యాంకుల్లో రూ. 7 వేల కోట్లు పైగా డిపాజిట్లు ఉన్నాయంటేనే అర్థమవుతుంది ఈ ఊరు రేంజ్. దేశంలోని మిగతా పల్లెటూళ్లకు భిన్నంగా ఉంటుంది మాధపర్ (Madhapar). ఈ గ్రామంలో 20 వేల ఇళ్లు ఉండగా.. దాదాపు 32,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన ఈ ఊర్లో 17 బ్యాంకులు ఉన్నాయి. మరికొన్ని బ్యాంకులు తమ శాఖలను తెరిచేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ ఊరు సంపన్న గ్రామంగా ఎలా ఎదిగింది, ఇక్కడివారు ఏం చేస్తారనే తెలుసుకోవాలనుకుంటున్నారా?గ్లోబల్ రూట్స్, లోకల్ గ్రోత్మాధపర్ విజయ రహస్యం అక్కడి ప్రజలే. ఇక్కడి కుటుంబాల్లోని చాలా మంది అమెరికా, బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్, ఆఫ్రికా, గల్ఫ్ దేశాల్లో స్థిరపడ్డారు. వీరంతా స్వగ్రామానికి దండిగా డబ్బులు పంపిస్తుంటారు. తాము ఉంటున్న దేశంలో కంటే మాధపర్ బ్యాంకుల్లో డబ్బును దాచుకోవడానికి ఇష్టపడతారు. ఇంటికి డబ్బు పంపడమే కాకుండా గ్రామంలో విద్య, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలలో కూడా పెట్టుబడి పెడుతున్నారు. ఫలితంగా స్థిరమైన వృద్ధితో ఆర్థిక స్వావలంబన సాధించి సంపన్న గ్రామంగా ఎదిగింది మాధపర్ గ్రామం.ప్రవాసంలో ఉంటున్నా.. దేవాలయాలు, వారసత్వ కట్టడాలను సృష్టించడంలో సిద్ధహస్తులైన మిస్త్రి కమ్యునిటికి చెందిన వారు 12వ శతాబ్దంలో ఈ గ్రామాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. కాలక్రమేణా విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ స్థిరపడ్డారు. ప్రస్తుతం పటేల్ కమ్యునిటికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. ఉన్నత చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం విదేశాలకు ఇక్కడి నుంచి చాలా మంది వలస వెళ్లడంలో మాధపర్ గ్రామం రూపురేఖలు మారిపోయాయి. ప్రవాసంలో ఉంటున్నా మూలాలను మరిచిపోకుండా సొంతూరిపై ఎన్నారైలు మమకారం చూపడంతో మాధపర్ ధనిక గ్రామంగా ఎదిగింది. పట్టణాలకు దీటుగా సౌకర్యాలు సమకూర్చుకుంది. విశాలమైన రోడ్లు, నాణ్యమైన పాఠశాలలు, కాలేజీలతో పాటు ఆధునిక వైద్యాన్ని అందించే ఆస్పత్రులు కూడా ఉన్నాయి.చదవండి: డిబ్బి డబ్బులతో కాలేజీ ఫీజులు కట్టేస్తున్న స్కూల్ పిల్లలు!దేశానికి నమూనా మాధపర్ విజయగాథ కేవలం సంపదకు సంబంధించినది మాత్రమే కాదు. ఐక్యత, దార్శనికత, తిరిగి ఇవ్వడం అనే మూడు అంశాల ఆధారంగా మాధపర్ గ్రామం స్వావలంబన సాధించింది. అంతేకాదు ప్రజల మధ్య బలమైన సమాజ సంబంధాలు ఉంటే గ్రామీణ జీవితాన్ని కూడా అసాధారణంగా మార్చవచ్చని ఈ ఊరు నిరూపించింది. గ్రామీణ జీవిత సౌందర్యాన్ని ఆధునిక జీవన సౌకర్యాలతో మిళితం చేసి దేశానికి నమూనాగా నిలిచింది.

ఎవరీ'లేడీ టార్జాన్'? ఏకంగా రాష్ట్రపతి భవన్లో విందుకు ఆహ్వానం..
ఒక సామాన్య మహిళ అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని అందుకుంది. ఆమె సెలబ్రిటీ/మోడల్/క్రీడాకారిణో కాదు. సాదాసీదాగా ఓ మారుమూల ప్రాంతంలో నివశించే గ్రామీణ మహిళ. ఆమెకు భారత ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని ఎందుకు ఇస్తుందో తెలుసా..!.టార్జాన్ మహిళగా పిలిచే ఆమె పేరు జమునా తుడు( Jamuna Tudu). చేతిలో ఒక కర్రతో అడవంతా కలియతిరిగే ఆమెకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్(Rashtrapati Bhavan)లో విందుకు ఆహ్వానం లభించింది. ఎందుకు ఆమెకింత గౌరవం అంటే..పద్మశ్రీ అవార్డు గ్రహిత అయిన ఆమె అటవీ నిర్మూలన, అక్రమ కలప నరికివేతలకు వ్యతిరేకంగా పాటుపడిన ప్రకృతి మాత. అడవిని ఇంతలా కంటికి రెప్పలా కాచ్చుకున్న ఆమె ప్రస్థానం ఏవిధంగా సాగిందంటే..జార్ఖండ్‌కి చెందిన జమునా చేతిలో ఒక కర్రతో అచ్చం పోలీసుల మాదిరిగా అడవులను గస్తీ కాస్తుంటుంది. ముఖ్యంగా అక్రమ కలప నరికివేతకు వ్యతిరేకంగా నిరసన తెలిపేది(చట్టం ఉల్లంఘమైన పని కలప కోత, కొనుగోలు, అమ్మకం). అంతేగాదు అడవులను రక్షించుకునేలా గ్రామస్తులను, స్థానికులను చైతన్యపరిచేది. అడవిని కాపాడుకోవలన్న లక్ష్యం పట్ల అచంచలమైన స్థెర్యాన్ని, తెగువని చూపేది. ఆ లక్ష్యంలోకి మరికొంత మంది మహిళలకు స్వచ్ఛంగా భాగస్వామ్యం అయ్యేలా చేసింది. అలా ఇవన్నీ అట్టడుగు స్థాయి అటవీ సంరక్షణ ఉద్యమానికి దారితీశాయి. ఈ క్రమంలో తనపై ప్రాణాంతక దాడులు జరిగినా వెనుకడుగు వేయలేదామె. ఆ ఇబ్బందులన్నింటిని నేరుగానే ఎదుర్కొంది. సాధారణ దినసరి కూలీగా, ఒక మేస్త్రీ భార్యగా జమునా అసామాన్యమైన పోరాటం అందరికీ స్ఫూర్తిని కలిగించింది. అంతేగాదు అడువుల రక్షణ కోసం ఆమె చేసిన అవిశ్రాంత పోరాటం కారణంగానే ఆమెకు 'లేడీ టార్జాన్'గా పేరొచ్చింది. ఆ నేపథ్యంలోనే ఆమెకు ఇంతటి గౌరవం లభించింది. దీనిపై జమునా స్పందిస్తూ..ఈ ఆహ్వానం తన మనోధైర్యాన్ని పెంచడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ రంగంలో పనిచేస్తున్న ఇతర మహిళలకు కూడా ప్రేరణ కలిగిస్తుందని పేర్కొంది. అలాగే ఈ గౌరవం తన పోరాటం, నిస్వార్థ సేవకు గొప్ప నిదర్శనమని సగర్వంగా చెబుతోందామె.(చదవండి: స్వచ్ఛ భారత్ కోసం విదేశీయుడి తపన..! నెటిజన్ల ప్రశంసల జల్లు)

'ఏక్ దిన్-ఏక్ గల్లీ'..! స్వచ్ఛమైన భారతీయుడిగా విదేశీయుడు..
మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛ భారత్ మిషన్‌ని చేపట్టి.. దశల వారీగా పలు కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. మరుగుదొడ్లు నుంచి పారిశుధ్య కార్యక్రమాలు, తాగునీరు, తదతరాలన్నింటిని స్వచ్ఛంగా పరిరక్షించుకునేలా సమర్థవంతమైన పథకాలు, కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. ఇంకా కొన్ని రాష్ట్రల్లో అక్కడక్కడ పరిశుభ్రత విషయంలో పరిస్థితి అత్యంత అధ్వాన్నంగానే ఉంది. అందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారే కరువు. అలాంటిది ఒక విదేశీయడు ఓ నియమాన్ని ఏర్పాటు చేసుకుని మరి వీధులను శుభ్రం చేస్తున్నాడు అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక విదేశీయుడు వీధులను శుభ్రం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. హర్యానాలోని గురుగ్రామ్‌లో ఒక సెర్బియన్ దేశస్తుడు మార్పుని ఆహ్వానించేలా ఆయనే స్వయంగా నడుంకట్టాడు. ఆయన్ ఏక్‌దిన్‌కే ఏక్ గల్లీ అనే చొరవతో ఈ కార్యక్రమాన్నిచేపట్టినట్లు వీడియోలో వివరించాడు. View this post on Instagram A post shared by 4cleanindia (@4cleanindia) దీన్ని నాలుగు రోజుల క్రితం ప్రారంభించినట్లు తెలిపాడు. ఇప్పటి వరకు ‘మిలీనియం సిటీ’లోని అనేక ప్రాంతాలను శుభ్రం చేస్తున్న వీడియోలను కూడా పంచుకున్నాడు. దీనికి స్థానికుల నుంచి కూడా మద్దతు లభించడం విశేషం. ఈ వీడియోలను చూసిన నెటిజన్లు అతడు నిజంగా స్వచ్ఛమైన భారతీయుడిని అభివర్ణించడమే కాకుండా క్లీన్ ఇండియా కోసం భారతీయులను ప్రేరేపించేలా చేస్తున్న మహోన్నత వ్యక్తి అని మరి కొందరూ ఆ విదేశీయుడిపై ప్రశంసల జల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by 4cleanindia (@4cleanindia) (చదవండి: అలాంటి ఇలాంటి అధిక బరువు కాదు..! ఏకంగా 325 కిలోలు..చివరికి..)

అవిసె గింజలతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
అవిసె గింజలు (Flax Seeds) ప్రాచీన కాలం నుండి ఆయుర్వేద వైద్యంలో వీటిని ఉపయోగిస్తున్నారు. ఆధునిక కాలంలో కూడా పోషకాహార నిపుణులు వీటి ప్రాముఖ్యతను గుర్తించి, రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటారు. ఇవాల్టీ టిప్ ఆఫ్ ది డేలో భాగంగా అవిసె గింజల్లో పోషకాలు వాటివ కలిగే అద్భుత ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.ఇవి చూడ్డానికి చిన్నగా కనిపించినా వీటిని సూపర్ ఫుడ్ అనిపిలుస్తారు. ప్రోటీన్, ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. అవిసె గింజలు- అద్భుతాలుఅవిసె గింజలు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వీటిల్లోని ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్, ప్రత్యేకంగా ఆల్ఫా-లినోలెనిక్ ఆసిడ్ (ALA) అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రక్తపోటును తగ్గించడం, చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.అవిసె గింజలు ఫైబర్ అధికంగా ఉటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.శరీరంలోని జీవక్రియలను వేగవంతం చేసి, బరువును నియంత్రణలో ఉంచడంలో దోహదపడుతుంది.జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. ఇది మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది, పేగుల కదలికలను క్రమబద్ధం చేస్తుంది.అవిసె గింజలు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి మధుమేహంతో బాధపడేవారికి చాలామంచిది. (భార్య గర్భవతి : రూ. కోటిన్నర జాబ్ వదిలేశాడు)అవిసె గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి అవిసె గింజలు యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి.అవిసె గింజల్లోని యాంటీఆక్సిడెంట్లు కేన్సర్‌ను నిరోధిస్తాయి. “లిగ్నన్స్” అనే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొన్ని రకాల కేన్సర్ల, ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ వంటి వాటిని నివారించడంలో సహాయపడతాయని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.అత్యధిక మొత్తంలో పాఅన్శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు (పీయూఎఫ్ఏలు), ముఖ్యంగా ఎఎల్ఎలు, ఉంటాయి కాబట్టి అవిసె గింజలు ఆరోగ్యదాయకమైన అనుబంధాహారంగా ప్రాచుర్యం పొందాయి.. ఎఎల్ఎ, లిగ్నాన్లు పుష్కలంగా ఉండటం మూలంగా అవిసె గింజలు గుండెకు మేలు చేస్తాయి. రక్తపోటును తగ్గిస్తాయి. టైప్ 2 డయాబెటిస్ రోగుల్లో ఫాస్టింగ్ గ్లూకోజ్ స్థాయిలను, ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తాయి.మెనోసాజ్ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మలబద్దకం, మానసిక అలసటను తగ్గిస్తాయి. అవిసె గింజల పిండిని అనేక అనారోగ్యాలను తగ్గించడానికి అనాదిగా వాడుతున్నారు. అయితే, శ్యానోజెనిక్ గ్లైకోసైడ్స్, ట్రిప్సిన్ ఇన్హిబిటర్స్, ఫైటిక్ ఆసిడ్ వంటి యాంటీ న్యూట్రియంట్లు ఉన్నప్పటికీ.. మొత్తంగా చూస్తే అవిసె గింజలను ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు నెరవేరతాయి. అంతేకాదు ఇవి చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా దోహపడతాయి. చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. గాయాలను త్వరగా మానేలా చేస్తాయి. ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే జుట్టు ఆరోగ్యంగా, బలంగా పెరగడానికి దోహదపడతాయి.అవిసె గింజలను ఎలా ఉపయోగించాలి:అవిసె గింజలను పొడిగా చేసి, సూప్ లు, సలాడ్ లు, పెరుగు లేదా స్మూతీలలో కలుపుకోవచ్చు.అవిసె గింజల నూనెను కూడా ఉపయోగించవచ్చు.అవిసె గింజలను నానబెట్టి, రాత్రిపూట నీటిలో నానబెట్టి, ఉదయం తినవచ్చు. లైట్‌గా వేయించి, తేనె లేదా వెచ్చని నీటితో కూడా తీసుకోవచ్చు.అవిసె గింజలను పచ్చిగా తినడం అంత మంచిది కాదు, ఎందుకంటే వాటిలోని పోషకాలు సరిగా జీర్ణం కావు. రోజుకు ఒకటి నుండి రెండు చెంచాల అవిసె గింజల పొడి తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వీటిని వినియోగించేందుకు వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం
ఫొటోలు
అంతర్జాతీయం

నోరు పారేసుకున్న మునీర్
న్యూయార్క్: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ మరోసారి రెచి్చపోయారు. ప్రస్తుతం అమెరికాలో అధికారిక పర్యటనలో ఉన్న ఆయన భారత్‌పై నోరుపారేసుకున్నారు. భారత సైన్యం గనుక పాకిస్తాన్‌పై దాడి చేస్తే తాము నష్టపోవడం కాకుండా సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని హెచ్చరించారు. తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని గుర్తుచేశారు. శనివారం ఫ్లోరిడాలోని టాంపా పట్టణంలో ప్రవాస పాకిస్తానీల సమావేశంలో మాట్లాడారు. కాశ్మీర్ అంశాన్ని మర్చిపోయే ప్రసక్తే లేదన్నారు. కాశ్మీర్ అనేది పాకిస్తాన్‌కు ‘తల నుంచి గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే సిర’ లాంటిదని చెప్పారు. తమ దేశానికి రావాల్సిన నీటిపై హక్కులను వదులుకొనే ప్రసక్తే లేదన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ జల హక్కులకు కాపాడుకుంటామన్నారు. ఇటీవల భారత్–పాక్ మధ్య ఘర్షణలో తాము పైచేయి సాధించమని వ్యాఖ్యానించారు. భారత్ మరోసారి దాడిచేస్తే తగిన సమాధానం చెప్తామన్న సందేశం ఇచ్చామని పేర్కొన్నారు. కాశ్మీర్ అనేది భారతదేశ అంతర్గత వ్యవహారం కాదని, అది పూర్తిగా అంతర్జాతీయ ఎజెండా అని తేల్చిచెప్పారు. పాకిస్తాన్‌కు కాశ్మీర్ అత్యంత కీలకమని మహ్మద్ అలీ జిన్నా చెప్పారని గుర్తుచేశారు. Pakistan Army Chief Asim Munir in Florida dinner:“We are a nuclear nation — if we go down, we’ll take half the world down with us.”On India’s Indus dam plan: “We’ll wait for them to build it, then destroy it with 10 missiles.”Loose threats, no shame. Remember Kargil — we…— Praffulgarg (@praffulgarg97) August 10, 2025సింధూ నది ఇండియా జాగీర్ కాదు తమ దేశానికి నీరు రాకుండా ఎగువన భారత్ గనుక డ్యామ్‌లు నిర్మిస్తే వాటిని కచ్చితంగా పేల్చేస్తామని అసిమ్ మునీర్ హెచ్చరించారు. డ్యామ్‌లు నిర్మించేదాకా వేచి చూస్తామని, వాటి నిర్మాణం పూర్తయ్యాక ధ్వంసం చేస్తామని అన్నారు. సింధూ నది ఇండియా జాగీర్ కాదని స్పష్టంచేశారు. అది సొంత ఆస్తిలాగా భావించొద్దని ఇండియాకు సూచించారు. నదులకు అడ్డుకట్ట వేయాలని చూస్తే అడ్డుకొని శక్తి తమకు ఉందన్నారు. పాకిస్తాన్–అమెరికా మధ్య సంబంధాలు నానాటికీ బలపడుతున్నాయని మునీర్ హర్షం వ్యక్తంచేశారు. నెలన్నర వ్యవధిలోనే తాను మరోసారి అమెరికాకు రావడమే అందుకు నిదర్శనమని తెలిపారు. భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని అపేసినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మునీర్ మరోసారి కృతజ్ఞతలు తెలియజేశారు. ⚡️🤯 Asim Munir Threatens Nuclear Armageddon: "We'll Take Half the World Down with Us" - ReportThe Pakistani military chief was speaking at a black-tie event in the US, saying if his country faces an existential threat in a future war with India, “we are a nuclear nation, if we… pic.twitter.com/P8E3n0yUHJ— Tarique Hussain (@Tarique18386095) August 11, 2025

గాజాపై ఇజ్రాయెల్ దాడి.. ఐదుగురు జర్నలిస్టులు మృతి
డెయిర్ అల్–బలాహ్: గాజా నగరంలో ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో అల్‌జజీరా అరబిక్ ప్రతినిధి 28 ఏళ్ల అనాస్ అల్ షరీఫ్‌తోపాటు మరో నలుగురు జర్నలిస్టులు మరణించారు. ఈ దాడుల్లో కరస్పాండెంట్ మహ్మద్ క్రీకే, కెమెరా ఆపరేటర్లు ఇబ్రహీం జహెర్, మహమ్మద్ నౌఫల్, మోమెన్ అలీవా, వారి సహాయకుడు మహ్మద్ నౌఫల్ మరణించినట్లు అల్‌జజీరా ధ్రువీకరించింది. అల్–షిఫా ఆసుపత్రి ప్రధాన ద్వారం దగ్గర్లో ఉన్న టెంట్ లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. దాడిలో మొత్తం ఏడుగురు మరణించారని అల్–షిఫా ఆస్పత్రి అధికారి ఒకరు తెలిపారు. కాగా, అల్ షరీఫ్ రిపోర్ట్ చేస్తుండగానే బాంబు దాడి జరిగింది. ఈ ప్రాణాంతక దాడికి ముందు, అల్ షరీఫ్ గాజా నగరంలోని తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో పెరుగుతున్న దాడులను వివరిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘రెండు గంటలుగా గాజా నగరంపై ఇజ్రాయెల్ దురాక్రమణ తీవ్రమైంది’ అని పోస్ట్‌లో పేర్కొన్నాడు. అల్ షరీఫ్ ప్రాణాలు కోల్పోవడానికి ముందు రాసిన మెసేజ్‌ను అతని ఫ్రెండ్ ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ఇది నా చివరి వీలునామా, నా చివరి సందేశం. నా ఈ మాటలు మీకు చేరితే, ఇజ్రాయెల్ నన్ను చంపడంలో, నా గొంతును నొక్కేయడంలో విజయం సాధించిందని అర్థం’ . అని ఆ సందేశంలో పేర్కొన్నారు. అల్ షరీఫ్ హమాస్ నాయకుడు: ఐడీఎఫ్అయితే.. వైమానిక దాడిలో మరణించిన అల్ షరీఫ్.. హమాస్ నాయకుడని ఇజ్రాయెల్ సైన్యం చాలా కాలంగా ఆరోపిస్తోంది. ‘అనాస్ అల్ షరీఫ్ హమాస్ ఉగ్రవాద సంస్థలోని ఒక ఉగ్రవాద విభాగానికి అధిపతిగా పనిచేశాడు. ఇజ్రాయెల్ పౌరులు, ఐడిఎఫ్ దళాలపై రాకెట్ దాడులకు ఆయన నాయకత్వం వహించాడు’ అని ఇజ్రాయెల్ సైన్యం అల్ షరీఫ్ మరణానంతరం ఒక ప్రకటనలో తెలిపింది. అల్ షరీఫ్‌పై ఇజ్రాయెల్ చేసిన వాదనలకు ఎలాంటి ఆధారాలు లేవని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక నివేదకురాలు ఐరీన్ ఖాన్ కొట్టిపారేశారు. అంతేకాదు.. ఫ్రంట్‌లైన్ రిపోర్టింగ్ చేస్తున్న ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని ఆమె గతంలోనే హెచ్చరించారు. ఖండించిన జర్నలిస్టు సంఘాలు.. జర్నలిస్టుల హత్యను పాలస్తీనా జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. వారు ఉగ్రవాదులు కాదని, అలా నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు కూడా లేవని కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ (సీపీజే) చీఫ్ ఎగ్జిక్యూటివ్ జోడీ గిన్స్బర్గ్ తెలిపారు. ‘ప్రస్తుత యుద్ధంలోనే కాదు, గత దశాబ్దాల్లోనూ ఇజ్రాయెల్ నమూనా ఇది. జర్నలిస్టును చంపడం.. అతను ఉగ్రవాది అని ముద్ర వేయడం ఇజ్రాయెల్ దళాలు పనిగట్టుకొని చేస్తున్నాయి’ అని ఆమె ఆరోపించారు.

భారత విమానాలకు గగనతలం మూసేసి.. రూ.1,240 కోట్లు నష్టపోయిన పాక్
ఇస్లామాబాద్: భారత విమానాలకు గగనతలాన్ని మూసేసిన పాకిస్తాన్ భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ విమానాశ్రయాల అథారిటీ (పీఏఏ) కేవలం రెండు నెలల్లో రూ. 1,240 కోట్లు నష్టపోయింది. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాద దాడి తరువాత, భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో, భారత్ విమానాలకు పాక్ గగనతలాన్ని మూసేయడం తెలిసిందే. ఇది ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో దేశం ఆదాయంలో భారీ నష్టాన్ని ఎదుర్కొంటోందని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా మొహమ్మద్ ఆసిఫ్ తెలిపారు. దీనివల్ల రోజుకు 100 నుంచి 150 భారతీయ విమానాలు ప్రభావితం అయ్యాయన్నారు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 30 మధ్య ఓవర్‌ఫ్లైయింగ్ ఛార్జీల నుంచి పీఏఏ ఆదాయం పడిపోయిందని పేర్కొన్నారు. ఈ ఆంక్షల వల్ల పాకిస్తాన్ విమాన ట్రాఫిక్ దాదాపు 20 శాతం తగ్గిందని వెల్లడించారు. ఇదిలా ఉండగా.. భారత విమానాలకు తన గగనతల మూసివేతను ఆగస్టు 24 వరకు పాక్ పొడిగించింది.

తుర్కియేలో శక్తివంతమైన భూకంపం
ఇస్లాంబుల్: తుర్కియే పశ్చిమప్రాంతాన్ని శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైంది. ఇస్లాంబుల్‌కు 206 కిలోమీటర్ల దూరంలో భూమిలో సుమారు 11 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. ఇస్లాంబుల్, చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు ప్రముఖ పర్యాటక ప్రాంతం ఇజి్మర్లోనూ దీని ప్రభావంతో ప్రకంపనలు సంభవించాయి. షిండిర్గిలో ఒక భవనం కూలినట్లు సమాచారం. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. తుర్కియే తరచూ భూకంపాల ప్రభావానికి గురవుతోంది.
జాతీయం

Bihar: ఓటరు జాబితా సవరణపై సుప్రీం సీరియస్.. ఈసీకి వార్నింగ్
న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం రెండు నెలల వ్యవధి ఉన్న ప్రస్తుత సమయంలో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ తరుణంలో ఓటర్ల జాబితా సవరణ పేరుతో భారీగా ఓట్లను తొలగిస్తే, ఆయా వర్గాలు కోర్టును ఆశ్రయించేందుకు సమయం కూడా ఉండదని పేర్కొంది.బీహార్‌లో ముమ్మరంగా జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణలో ఎలాంటి అక్రమాలైనా చోటుచేసుకున్నట్లు తేలితే. ఎన్నికలు సమీపించే సెప్టెంబర్‌లో అయినా ఆ జాబితాను పక్కనపెట్టేస్తామని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరికలు చేసింది. ఈసీ గతంలో.. ఆధార్ కార్డు కలిగి ఉన్నప్పటికీ బీహార్ పౌరుల పౌరసత్వాన్ని నిర్ధారించి, ఓటు హక్కు కల్పించలేమంటూ చేసిన వాదనను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. దీనిని నిర్ణయించేది ఐదు కోట్ల మంది ఓటర్లని, ఈసీ కాదని ఎన్నికల కమిషన్ పేర్కొంది.పౌరసత్వ నిర్ధారణకు ఈసీ ఏమీ పోలీసు కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కాగా బీహార్‌లో ఎన్నికల సంఘం హడావుడిగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణను ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. మరోవైపు ఈ జాబితా సవరణలోని లోపాలు ప్రతీ రోజూ బయటపెడుతూనే ఉన్నాయి. వీటిపై సుప్రీంకోర్టులోనూ పలు పిటిషన్లు కూడా దాఖలయ్యాయ. ఈ నేపధ్యంలో ఎన్నికలు తరుముకు వస్తున్న తరుణంలో, ఇంత తక్కువ సమయంలో ఈ భారీ ప్రక్రియ ఎందుకు చేపట్టారని ఎన్నికల సంఘాన్ని నిలదీసింది.దీనిపై స్పందించిన ఈసీ తన నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ, అనర్హులైన ఓటర్లను తొలగిస్తూ, ఓటర్ల జాబితాను శుద్ధి చేసేందుకే ఈ ప్రక్రియ చేపట్టినట్లు వివరణ ఇచ్చింది. అయితే ప్రతిపక్షాలు ఈ ఓటర్లు జాబితా సవరణ ప్రక్రియపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఇంతలో లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మహారాష్ట్ర, కర్నాటకలలో ఓటర్ల జాబితాలో ఓట్ల చోరీని ఆధారాలతో సహా బయటపెట్టడంతో పాటు బీహార్ లో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపైనా పలు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం తీరుపై సుప్రీంకోర్టు సీరియస్ కావడం ప్రతిపక్షాలను ఊరటనిచ్చింది.

సీబీఐకి ‘గట్టు’ దంపతుల హత్యకేసు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచి్చంది. ఈ కేసును తిరిగి దర్యాప్తు చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. వామనరావు తండ్రి గట్టు కిషన్‌రావుకు భద్రత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తన కుమారుడు, కోడలి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కిషన్‌రావు 2021 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎన్.కె. సింగ్లా ధర్మాసనం సీబీఐ విచారణకు ఆదేశించింది. కిషన్‌రావు తరఫున సీనియర్ న్యాయవాదులు మేనక గురుస్వామి, చంద్రకాంత్‌లు వాదనలు వినిపించారు. నడిరోడ్డుపై హత్య: పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలోని కల్వచర్ల వద్ద కారులో వెళ్తున్న వామనరావు, నాగమణి దంపతులను 2021 ఫిబ్రవరి 17న దుండగులు అడ్డగించి నడిరోడ్డుపైనే కత్తులతో నరికి చంపారు. మొదట ఈ కేసును స్థానిక పోలీసులు దర్యాప్తు చేశారు. దానిని సీబీఐకి అప్పగించాలని కిషన్‌రావు అదే ఏడాది సెపె్టంబర్లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. విచారణలో భాగంగా హత్యకు సంబంధించిన వీడియోలు, పత్రాలు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని గతంలో కోర్టు ఆదేశించింది. చనిపోయే ముందు వామనరావు ఇచ్చిన మరణ వాంగ్మూలం వీడియోపై అనుమానాలు వ్యక్తం కావడంతో ఎఫ్ఎస్ఎల్కి పంపించగా, అది అసలుదేనని ల్యాబ్ నివేదిక తేల్చింది. ఈ నివేదికతోపాటు అన్ని రికార్డులు పరిశీలించిన సుప్రీంకోర్టు.. కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తూ తీర్పు చెప్పింది. సీబీఐ దర్యాప్తుపై ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలియచేసింది.వామన్‌రావు కేసులో దోషులను శిక్షించాలి: మంత్రి శ్రీధర్‌బాబు సాక్షి, హైదరాబాద్: గట్టు వామన్‌రావు దంపతుల హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి శ్రీధర్ బాబు స్వాగతించారు. సుప్రీంకోర్టు తీర్పు న్యాయ వ్యవస్థపై ప్రతి ఒక్కరికీ నమ్మకం కలిగించిందని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో అసలు దోషులు, వారికి సహకరించిన అప్పటి ప్రభుత్వ పెద్దలకు శిక్ష పడితేనే వామన్‌రావు కుటుంబానికి న్యాయం జరుగుతుందన్నారు.

భౌ.. భౌ..!
వీధి కుక్కల దాడిలో బాలుడి మృతి.. పిచ్చి కుక్క కరిచి పది మందికి గాయాలు.. ఇలాంటి వార్తలు నిత్యం మనకు కనిపిస్తుంటాయి, వినిపిస్తుంటాయి. వీధి కుక్కల ముప్పు ఒక్క ప్రాంతానికో, నగరానికో పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. కుక్కకాటు సంఘటనలు మూడేళ్లలో 70 శాతం పెరిగాయంటే సమస్య తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్ సీఆర్) పరిధిలోని అన్ని కుక్కలను ఎనిమిది వారాల్లోగా షెల్టర్లకు తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో దేశవ్యాప్తంగా ఈ అంశం చర్చకు వచ్చింది. – సాక్షి, స్పెషల్ డెస్క్చాలామంది రాత్రుళ్లు వీధుల్లో నడవడానికి, బైక్‌మీద వెళ్లడానికి భయపడతారు. ఉదయం మార్నింగ్ చేసేటప్పుడు చాలామంది కర్రలు పట్టుకుంటారు. వీటన్నింటికీ కారణం.. గ్రామ సింహాలు. బైక్ మీద వేగంగా వెళ్తుంటే కుక్కలు వెంటపడి, కరిచి లేదా వారు కిందపడి ఎంతో మంది గాయపడిన సంఘటనలు ఉన్నాయి. మనదేశంలో కుక్కల ప్రతాపం చవిచూడని ఊరు ఉండదంటే అతిశయోక్తి కాదు. సుమారు 70 శాతం పెరిగాయికుక్కకాటు సంఘటనలు 2024లో దేశంలో 37 లక్షలకుపైగా నమోదయ్యాయి. మూడేళ్లలో ఈ ఘటనలు 69.6 శాతం పెరిగాయి. ఈ ఏడాది జనవరిలోనే 4.29 లక్షల కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దేశవ్యాప్తంగా రేబీస్ అనుమానిత కేసులు భారీగా తగ్గుతూ వచ్చాయి. 2022తో పోలిస్తే గత ఏడాది ఈ కేసులు 78 శాతం క్షీణించాయి. కానీ మరణాలు మాత్రం ఊహించని స్థాయిలో అధికం అయ్యాయి. రెండేళ్లలో ఎనిమిది రెట్లకుపైగా పెరిగి జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. గత ఏడాది వీధి కుక్కల దాడి కారణంగా రేబీస్‌తో భారత్‌లో 180 మంది మరణించగా.. వీరిలో అత్యధికంగా మూడింట రెండొంతులు దక్షిణాది రాష్ట్రాల నుంచే ఉండడం గమనార్హం. 11 సెకన్లకు ఒకటి..భారతదేశంలో 6 కోట్లకు పైగా వీధి కుక్కలు ఉన్నాయని అంచనా. వీటిలో చాలా తక్కువ మాత్రమే సహజ మరణాలకు గురవుతాయని నిపుణులు చెబుతున్నారు. అంటే వ్యాధులతో మరణించేవే అధికం అన్నమాట. దేశంలో ప్రతి 11 సెకన్లకు ఒకరిని కుక్క కరిచిన సంఘటనలు నమోదవుతున్నాయి. దాదాపు 5,000 ఘటనలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. కుక్కల ద్వారా ప్రజలకు 60కి పైగా వ్యాధులు వ్యాపిస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం కుక్కల దాడి వల్ల రేబీస్ సోకి గత ఏడాది 180 మంది ప్రాణాలను బలిగొంది. ఈ వీధి కుక్కలు భారతీయ రోడ్లు, పొలాల్లో రోజూ 15,000 టన్నులకు పైగా మలం, 8 మిలియన్ గ్యాలన్ల మూత్రం విడుదల చేస్తున్నాయి. ఇది ఒక ప్రధాన ఆరోగ్య, పర్యావరణ సమస్య అన్నది వైద్యుల మాట. ఇక, పెంపుడు కుక్కలు దేశంలో 3 కోట్లకుపైచిలుకు ఉంటాయని నివేదికలు చెబుతున్నాయి.» భారతదేశంలో 6 కోట్లకు పైగా వీధి కుక్కలు ఉన్నాయని అంచనా.» దేశంలో ప్రతి 11 సెకన్లకు ఒకరిని కుక్క కరిచిన సంఘటనలు నమోదవుతున్నాయి.» దాదాపు 5,000 ఘటనలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. » కుక్కల ద్వారా ప్రజలకు 60కి పైగా వ్యాధులు వ్యాపిస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా కుక్క కాటు సంఘటనలు2022 21,89,909 2023 30,52,5212024 37,15,713

పన్ను కట్టింది.. ముగ్గురిలో ఒకరే!
ఆర్జిస్తున్న ఆదాయం వివరాలను ఆదాయపు పన్ను శాఖకు సమర్పిస్తున్న వ్యక్తుల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 8.39 కోట్ల మంది ఐటీ రిటర్నులు దాఖలు చేశారు. ఈ స్థాయిలో రిటర్నులు నమోదయ్యాయంటే భారీ మొత్తంలో ప్రభుత్వానికి ప్రత్యక్ష పన్నుల ఆదాయం సమకూరిందని భావిస్తే పొరపాటే. ఎందుకంటే వీరిలో పన్నులు చెల్లించింది.. మూడింట ఒక వంతు మాత్రమే!ప్రాథమిక మినహాయింపు పరిమితిని మించి ఆదాయం ఆర్జించిన ప్రతి వ్యక్తి తప్పనిసరిగా ఇన్ కం ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్) సమర్పించాల్సి ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 8.39 కోట్లకుపైగా వ్యక్తులు తమ ఆదాయపు పన్ను వివరాలను ఐటీ శాఖకు సమర్పించారు. 2019–20లో ఈ సంఖ్య 6.47 కోట్లు. అయిదేళ్లలో ఐటీ రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య సుమారు 30 శాతం పెరిగింది.ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. వాస్తవానికి 2024–25లో ఐటీఆర్ దాఖలు చేసినవారిలో పన్నులు చెల్లించింది 33.56 శాతం.. అంటే సుమారు 2.82 కోట్ల మంది మాత్రమే. దాదాపు 5.6 కోట్ల మంది పన్ను పరిధిలో లేరు! అంటే.. వీరి ఆదాయం..పన్ను చెల్లించే స్థాయిలో లేదన్న మాట. ఇలాంటి ఐటీఆర్‌లు ఏకంగా 66.44 శాతం ఉన్నాయంటే ఆశ్చర్యం వేయకమానదు.వేతనాలు పెరిగాయ్డిడక్షన్పోను రూ.15–50 లక్షల ఆదాయం పరిధిలోకి వచ్చిన వేతన జీవుల సంఖ్య 2024–25లో 29.5 లక్షలుగా నమోదైంది. 2019–20లో ఇది 13.1 లక్షలు మాత్రమే. అంటే అయిదేళ్లలో రెండింతలకుపైగా పెరిగింది. అలాగే రూ.7.5–15 లక్షల ఇన్ కం పరిధిలోకి వచ్చిన వారి సంఖ్య 62 శాతం అధికం అయింది. రూ.7.5 లక్షలలోపు ఆదాయ విభాగంలోకి వచ్చినవారు 2.8 శాతం క్షీణించడం గమనార్హం.టాప్‌లో మహారాష్ట్రఐటీ రిటర్నుల దాఖలులో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. 2024– 25లో అక్కడ ఏకంగా కోటీ 27 లక్షలకుపైగా ఐటీఆర్ ఫైల్ చేశారు. తరువాతి స్థానాల్లో యూపీ, గుజరాత్ ఉన్నాయి. తెలంగాణలో గత ఆర్థిక సంవత్సరంలో 30,56,867 మంది ఐటీఆర్ దాఖలు చేశారు. అయిదేళ్లలో ఈ సంఖ్య 41.6 శాతం పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో అయిదేళ్లలో ఐటీఆర్ సమర్పించిన వారి సంఖ్య 23 శాతం అధికమై 25,59,092 చేరింది. ఇక పన్ను చెల్లించాల్సిన అవసరం లేని వారి సంఖ్య పరంగా మహారాష్ట్ర ముందంజలో ఉంది.మహమ్మారి తర్వాత ఎకానమీ గాడిలో పడింది. కంపెనీలు తమ ఉద్యోగులకు ఇన్సెంటివ్స్ సైతం అందించాయి. నిపుణుల వేతనాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. ప్రభుత్వ కఠిన నిబంధనలతో ఆదాయ వివరాలను పారదర్శకంగా వెల్లడించాల్సిందే. ఐటీఆర్ ఫైలింగ్స్‌లో ఇవన్నీ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. – అరుణ్ లాల్, డైరెక్టర్, ఆంబర్ కార్పొరేట్ సర్వీసెస్
ఎన్ఆర్ఐ

నిమిష ప్రియ కేసు.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కేంద్రం
యెమెన్‌లో మరణశిక్ష పడ్డ కేరళ నర్సు నిమిష ప్రియ కేసులో భారత ప్రభుత్వ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఆమెను రక్షించే ప్రయత్నాలు చేస్తున్న బృందానికి అక్కడికి వెళ్లకుండా రెడ్ సిగ్నల్ వేసింది. నిమిషను రక్షించేందుకు అనధికారిక మార్గాలైనా చూడాలని సుప్రీం కోర్టు సూచించినప్పటికీ.. విదేశాంగ శాఖ వెనకడుగు వేస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.న్యూఢిల్లీ: కేరళ నర్సు నిమిష ప్రియ కేసులో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ బృందానికి యెమెన్ వెళ్లేందుకు భారత విదేశాంగ శాఖ(MEA) అనుమతి నిరాకరించింది. ఐదుగురు ప్రతినిధులతో కూడిన ఆ బృందానికి.. భద్రతా కారణాలు, అలాగే.. యెమెన్ ప్రభుత్వంతో అంతంత మాత్రంగానే ఉన్న సంబంధాల దృష్ట్యా అనుమతించలేమని స్పష్టం చేసింది.సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ బృందం ఆమె శిక్షను తప్పించేందుకు మొదటి నుంచి ప్రయత్నిస్తోంది. ఆమె కుటుంబానికి కావాల్సిన న్యాయ సహాయం అందిస్తూ వస్తోంది. మొన్నీమధ్యే సుప్రీం కోర్టులోనూ పిటిషన్ కూడా వేసింది. ఈ నేపథ్యంలోనే ఆ బృందాన్ని యెమెన్ రాజధాని సనాకు వెళ్లేందుకు అనుమతించాలంటూ సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అయితే సుప్రీం కోర్టు ఆదేశాలున్నా అందుకు తాము అనుమతించలేమని విదేశాంగశాఖ ఆ బృందానికి లేఖ ద్వారా బదులిచ్చింది.‘‘సనాలో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. అందుకే యెమెన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని రియాద్‌కు మార్చాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడికి వెళ్లడం మరింత ప్రమాదకరం. నిమిష ప్రియ కుటుంబం, వాళ్ల తరఫున అధికార ప్రతినిధులే చర్చల్లో పాల్గొంటున్నారు. ఈ వ్యవహారంలో విదేశాంగ శాఖ తరఫున మా వంతు ప్రయత్నాలూ చేస్తున్నాం. మన పౌరుల భద్రతను మేం ప్రాధాన్యంగా పరిగణిస్తున్నాం. కాబట్టి ఎలాంటి ఆదేశాలున్నా.. మీ ప్రయాణానికి మేం అనుమతించలేం’’ అని స్పష్టం చేసింది.ఇదిలా ఉంటే.. నిమిష ప్రియ కేసులో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెబుతూ వస్తోంది. అయితే తాము చేయాల్సిందంతా చేశామని, మిగిలిన మార్గం బ్లడ్ మనీనే అని, అయితే అది ప్రైవేట్ వ్యవహారమని కేంద్రం సుప్రీం కోర్టుకు గతంలోనే చెప్పింది. ఈ తరుణంలో ఇతర మార్గాలనైనా చూడాలంటూ సుప్రీం కోర్టు కేంద్రానికి సూచించింది.ఈలోపు ఆమె మరణశిక్ష వాయిదా పడింది. అయితే యెమెన్ బాధిత కుటుంబంతో బ్లడ్‌మనీ చర్చలు, శిక్షరద్దు అయ్యిందంటూ రోజుకో ప్రచారం తెరపైకి వస్తుండగా.. వాటిని కేంద్రం ఖండిస్తూ వస్తోంది. తాజాగా.. శుక్రవారం విదేశాంగ శాఖ ‘యెమెన్‌కు మిత్రదేశాల ప్రభుత్వాలతో టచ్‌లో ఉన్నాం’ అంటూ ఒక ప్రకటన విడుదల చేయడం గమనార్హం.కేరళకు చెందిన నిమిష ప్రియ నర్స్ కోర్సు పూర్తిచేసిన తర్వాత 2008లో యెమెన్ వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరింది. 2011లో కేరళకు వచ్చి థామస్ అనే వ్యక్తిని వివాహం చేసుకొంది. ఆ తర్వాత ఆమె యెమెన్‌లో ఓ క్లినిక్ తెరవాలనుకొంది. కానీ, ఆ దేశ నిబంధనల ప్రకారం స్థానిక వ్యక్తి వ్యాపార భాగస్వామ్యంతోనే అది సాధ్యమవుతుంది. దీంతో అక్కడి తలాల్ అదిబ్ మెహది అనే వ్యక్తిని నిమిష-థామస్ జంట తమ వ్యాపార భాగస్వామిగా చేసుకొని అల్‌అమన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత తమ కుమార్తెకు సంప్రదాయ వేడుక కోసం భారత్ వచ్చిన ప్రియా అది ముగియగానే తిరిగి యెమన్ వెళ్లిపోయింది. ఆమె భర్త, కుమార్తె మాత్రం కేరళలోనే ఉండిపోయారు. మెహది దీనిని అదునుగా భావించి ఆమె నుంచి డబ్బు లాక్కోవడంతోపాటు వేధించినట్లు ప్రియా కుటుంబం ఆరోపిస్తోంది. ఆమెను తన భార్యగా మెహది చెప్పుకోవడం మొదలుపెట్టి, పాస్‌పోర్ట్, ఇతర పత్రాలను లాక్కొన్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. చివరికి ఆమెను కుటుంబసభ్యులతో కూడా మాట్లాడనీయలేదు. 2016లో అతడిపై ప్రియా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. కానీ, వారు ఆమెను పట్టించుకోలేదు. దీంతో 2017లో మెహదికి మత్తుమందు ఇచ్చి అతడి వద్ద ఉన్న తన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని భావించింది. కానీ, ఆ డోస్ ఎక్కువవడంతో అతడు చనిపోయాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ వాటర్ ట్యాంక్‌లో పారేసింది. చివరికి అక్కడినుంచి సౌదీకి వెళ్లిపోతుండగా.. సరిహద్దుల్లో ఆమెను అరెస్టు చేశారు. 2020లో అక్కడి ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేశాయి. ఆమె శిక్షను రద్దు చేయించేందుకు కుటుంబం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వచ్చాయి. ఈ తరుణంలో ఈ ఏడాది జులై 16వ తేదీ మరణశిక్ష అమలు కావాల్సి ఉండగా.. సరిగ్గా దానికి ఒక్కరోజు ముందు(జులై 15వ తేదీ) మత పెద్దల జోక్యంతో మరణ శిక్ష వాయిదా పడింది. అప్పటి నుంచి తలాబ్ కుటుంబంతో బ్లడ్ మనీకి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయి. మధ్యలో కేరళ కాంతాపురం AP అబూబకర్ ముస్లియార్ శిక్ష రద్దైందని ఓ ప్రకటన చేసినప్పటికీ.. అందులో వాస్తవం లేదని కేంద్రం తర్వాత మరో ప్రకటన చేసింది. బ్లడ్‌మనీ అంటే.. హత్య లేదంటే తీవ్రమైన నేరాల్లో ఇచ్చే పరిహారం. హత్యకు గురైన కుటుంబానికి నేరస్తుడు లేదంటే అతని కుటుంబానికి దక్కే సొమ్ము ఇది. ఆ క్షమాధనం అనేది ఎంత ఉండాలి?. ఎంత స్వీకరించాలి? అనేది ఈ రెండవైపులా కుదిరే ఒప్పందాన్ని బట్టి ఉంటుంది. బాధిత కుటుంబం గనుక అంగీకరించకుంటే శిక్ష అమలు అవుతుంది. ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం. ఇందులో ప్రభుత్వాల జోక్యం ఉండదు. నిమిష కేసులో ఇదే విషయాన్ని కేంద్రం సుప్రీం కోర్టుకు గతంలో స్పష్టం చేసింది.

అమెరికా వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తూ..
లింగాలఘణపురం: అమెరికాలోని ఓక్లహోమ్ రాష్ట్రంలోని ఎడ్జుండ్ నగరంలో ఉంటున్న జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నెల్లుట్లకు చెందిన కుర్రెముల సాయికుమార్ (31) బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో అక్కడి కోర్టు 35 ఏళ్ల శిక్ష విధించింది. దీంతో మానసిక ఆందోళనకు గురై సాయికుమార్ జూలై 26న జైలులోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు గత నెల 31న అమెరికా బయల్దేరారు. సాయికుమార్ పదేళ్ల కిందట అమెరికా (America) వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తూ ఓక్లహోమ్లో ఉంటున్నాడు.2023లో అక్కడి ఎఫ్‌బీఐ సోషల్ మీడియా మేనేజింగ్ యాప్‌లో నిందితుడి అకౌంట్‌పై విచారణ జరపగా 13–15 ఏళ్ల బాలుడిగా నటిస్తూ బాలికలతో నమ్మకంగా ఉంటుండేవాడు. అతని అభ్యర్థనను తిరస్కరించిన వారిని బెదిరించడం, మానసికంగా వేధించడం, అసభ్య చిత్రాలు తీసి పంపించినట్లు ఆరోపణలు రావడంతో సాయికుమార్‌ను అరెస్ట్ చేశారు. అతను 19 మంది మైనర్లను లైంగికంగా వేధించినట్లు కోర్టులో నిరూపితమవడంతో 35 ఏళ్ల జైలు శిక్ష పడగా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. చదవండి: ధర్మస్థళ మిస్టరీ.. కీలకంగా ఆ 5 ప్రాంతాలు?

తానా: నవ్వులు కురిపించిన ‘సాహిత్యంలో హాస్యం’
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వహించిన “సాహిత్యంలో హాస్యం” నవ్వుల జల్లులు కురిపించింది. తానా సాహిత్యవిభాగం-‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట గత 5 సంవత్సరాలకు పైగా, ప్రతి నెలా ఆఖరి ఆదివారం సాహిత్య సదస్సులు నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ఆదివారం నిర్వహించిన 82వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం “సాహిత్యంలో హాస్యం” (2 వ భాగం) “ప్రముఖ రచయితల హాస్యరచనా వైభవం” చాలా ఉల్లాస భరితంగా, ఆద్యంతం నవ్వులతో నిండింది.తానా నూతన అధ్యక్షులు డా. నరేన్ కొడాలి మాట్లాడుతూ – “తానా ఎన్నో దశాబ్దాలగా తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళా వికాసాలకోసం అవిరళకృషి చేస్తోందని, తన పదవీకాలంలో తానా సంస్థ స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకునే దిశగా పయనించడం సంతోషంగాఉందని, అందరి సహకారంతో సంస్థ ఆశయాలను సాకారం చేయడానికి తాను కట్టుబడి ఉన్నానని అన్నారు. తెలుగు భాష, సాహిత్యాల పరిరక్షణ, పర్యాప్తిలో తానా పూర్వాధ్యక్షులు, తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు అయిన డా. ప్రసాద్ తోటకూర నేతృత్వంలో గత 5 సంవత్సరాలకు పైగా సాగుతున్న ఈ సాహిత్య కృషి ఎంతైనా కొనియాడదగ్గదని, ఈ నాటి కార్యక్రమంలో పాల్గొంటున్న అతిథులందరకూ స్వాగతం అంటూ సభను ప్రారంభించారు.”తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. “డా. నరేన్ కొడాలి తానా అధ్యక్ష పదవీకాలం ఫలవంతం కావాలని, తానా సంస్థను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లడానికి ఆయనకు అందరూ సహకరించాలని కోరారు. ప్రస్తుత సాహిత్య చర్చాంశం గురించి ప్రస్తావిస్తూ - తెలుగు సాహిత్యంలో కథ, కవిత, నవల, నాటకం, వ్యాసం మొదలైన అన్ని ప్రక్రియలలోనూ హాస్యం పుష్కలంగా పండిందని అన్నారు.కాళ్ళకూరి నారాయణగారి “చింతామణి”, “వరవిక్రయం” నాటకాలు, పానుగంటి లక్ష్మీనరసింహారావుగారి “సాక్షి” వ్యాసాలు, చిలకమర్తి లక్ష్మీ నరసింహారావుగారి “గణపతి” నవల, మునిమాణిక్యం నరసింహారావుగారి “కాంతం కథలు”, సురవరం ప్రతాపరెడ్డిగారి “మొగలాయి కథలు”, గురజాడ అప్పారావుగారి కలం నుండి జాలువారిన “కన్యాశుల్కం” నాటకంలోని అనేక హాస్య సన్నివేశాలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. జీవితంలో వత్తిడిని తగ్గించేందుకు హాస్యం మిక్కిలి దోహదపడుతుందని, సాహిత్యంలోని వివిధ ప్రక్రియలలో ఉన్న హాస్యాన్ని అందరూ ఆస్వాదించవచ్చును అన్నారు.”గౌరవఅతిథిగా విచ్చేసిన తెలుగువేద కవి, ప్రముఖ సినీగీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు-సాహిత్యంలో వివిధ హాస్య ఘట్టాలను వివరించి నవ్వించారు. విశిష్టఅతిథులుగా పాల్గొన్న ప్రముఖ చలనచిత్ర కథా, సంభాషణా రచయిత్రి, సినీ విమర్శకురాలు బలభద్రపాత్రుని రమణి - సుప్రసిద్ధ స్త్రీవాద రచయిత్రి, విమర్శకురాలు రంగనాయకమ్మ పండించిన హాస్యాన్ని; ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్ట్, నృత్య రూపకాల రచయిత, కథా, సంభాషణా రచయిత బ్నిం – నరసింహారావు పేరుతో ఉన్న వివిధ ప్రముఖ రచయితలు సృష్టించిన హాస్యాన్ని ‘గాండ్రింపులు మానిన హాస్యాలుగా’; ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, కార్టూనిస్టు సుధామ - ప్రముఖ హాస్యకథా రచయిత్రి, నవలా రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి రచనలలోని హాస్యాన్ని;ప్రముఖ కథా, నవలా రచయిత్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మనుమరాలు అయిన లలిత రామ్ - తెనాలి రామకృష్ణుడు, దేవులపల్లి కృష్ణశాస్త్రిల సాహిత్యంలోని హాస్యాన్ని; కర్నూలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖాధ్యక్షురాలు డా. వి. వింధ్యవాసినీ దేవి – సుప్రసిద్ధ హాస్య రచయిత మునిమాణిక్యం నరసింహారావు రచనలలోని హాస్యాన్ని; ప్రముఖ హాస్యనటుడు, రచయిత, ఉపన్యాసకుడు అయిన డా. గుండు సుదర్శన్ – ప్రముఖ హాస్య రచయిత శ్రీరమణతో తనకున్న సాంగత్యం, శ్రీరమణ సాహిత్యంలో హాస్యం; ప్రముఖ రచయిత, సినీనటుడు, దర్శకుడు కాశీ విశ్వనాధ్ – ప్రముఖ రచయితలు వేటూరి సుందర రామమూర్తి, పైడిపల్లి సత్యానంద్, కొడకండ్ల అప్పలాచార్యలు సృష్టించిన హాస్యరీతుల్ని ఇలా పాల్గొన్న అతిథులందరూ వేర్వేరు రచయితలు పండించిన హాస్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించి అందరిని కడుపుబ్బ నవ్వించారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు చిగురుమళ్ళ శ్రీనివాస్ తన వందన సమర్పణలో కార్యక్రమం యావత్తూ హాస్యరస ప్రధానంగా సాగిందని, పాల్గొన్న అతిథులకు, సహకరించిన ప్రసార మాధ్యమాలకు, తానా కార్యవర్గ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇదేం పాడుబుద్ధయ్యా.. పైలటూ!
న్యూయార్క్: విమానం ల్యాండయిన 10 నిమిషాలకే ఎన్నారై పైలట్‌ను అరెస్ట్ చేసిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. చిన్నారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత సంతతికి చెందిన పైలట్‌ను శాన్ ఫ్రాన్సిస్కో (San Francisco) అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నెల 26వ తేదీన ఉదయం 9.35 గంటల సమయంలో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ల్యాండవగా అధికారులు అందులోకి ఎక్కి పైలట్‌గా ఉన్న రుస్తొమ్ భగ్వాగర్(34)ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు.పదేళ్లలోపు చిన్నారిపై అతడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో కేసు నమోదైంది. తన తల్లితో డేటింగ్ చేసిన రుస్తొమ్ భగ్వాగర్ (Rustom Bhagwagar) తనను లైంగికంగా వేధించినట్లు ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఆరేళ్లప్పుడు మొదలైన వేధింపులు తనకు 11 ఏళ్లు వచ్చేవరకు సాగించాడని, ఈ విషయం తన తల్లికీ తెలుసునని ఆమె పేర్కొంది. ఆమె సమక్షంలోనూ ఇవి సాగాయని ఫిర్యాదు చేసిందని అధికారులు వెల్లడించారు.కెనడా విమాన ప్రమాదంలో భారతీయుడు మృతి ఒట్టావా: కెనడాలోని న్యూఫౌండ్‌ల్యాండ్ ప్రాంతంలో చిన్న విమానం కూలిన ఘటనలో భారతీయుడొకరు ప్రాణాలు కోల్పోయారు. డీర్ లేక్ సమీపంలో ఈ నెల 26న ఈ ఘటన చోటుచేసుకుంది. డీర్ లేక్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే విమానం కూలింది.చదవండి: ఆస్ట్రేలియాలో భారత సంతతి వ్యక్తిపై అమానుషంఈ ఘటనలో విమానంలో ఉన్న ఏకైక వ్యక్తి గౌతమ్ సంతోష్(27) ప్రాణాలు కోల్పోయారని టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం మంగళవారం వెల్లడించింది. ఈ ఘటనలో విమానం పైలట్ సైతం అక్కడికక్కడే చనిపోయారని పేర్కొంది. ఇందుకు కారణాలు తెలియాల్సి ఉందని తెలిపింది.
క్రైమ్

రాత్రిళ్లు నగ్నంగా వీడియో కాల్స్.. వీఆర్‌కు ఎస్ఐ రాజశేఖర్
పుట్టపర్తి టౌన్/ ముదిగుబ్బ: న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లిన గిరిజన మహిళను లైంగికంగా వేధించడంతో పాటు రాత్రి వేళల్లో నగ్నంగా వీడియోకాల్స్ మాట్లాడిన ‘పట్నం’ ఎస్ఐ రాజశేఖర్‌పై వేటు పడింది. పోలీసు స్టేషన్‌కు వచ్చే మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతాయుత స్థానంలో ఉన్న అతను అమాయక గిరిజన మహిళను వేధించడంతో వీఆర్‌కు పంపుతూ ఎస్పీ రత్న మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముదిగుబ్బ మండలం గరుగుతండాకు చెందిన ఓ గిరిజన మహిళలను లైంగికంగా వేధించిన రాజశేఖర్ గురించి ‘సాక్షి’ మంగళవారం ‘నాతో వస్తే ఓకే... లేదంటే ఇబ్బంది పడతావ్..’ శీర్షికన వార్త ప్రచురించింది. దీనిపై స్పందించిన ఎస్పీ రత్న వెంటనే అతన్ని వీఆర్‌కు పంపారు. అలాగే ఎస్ఐ రాజశేఖర్‌పై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని సంబం«ధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. విచారణ అనంతరం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్నం ఎస్ఐగా జయరాంనాయక్ ‘పట్నం’ ఎస్ఐగా కె. జయరాంనాయక్‌ను పోలీసు ఉన్నతాధికారులు నియమించారు. దీంతో మంగళవారమే ఆయన బాధ్యతలను చేపట్టారు. లైంగిక వేధింపుల నేపథ్యంలో ఇప్పటి వరకూ పట్నం ఎస్ఐగా ఉన్న రాజశేఖర్‌ను వీఆర్‌కు పంపిన ఎస్పీ రత్నం..ఆయన స్థానంలో వీఆర్‌లో ఉన్న జయరాంనాయక్‌ను నియమించారు. నాతో వస్తే ఓకే.. లేదంటే ఇబ్బందిపడతావ్..

ఆటోడ్రైవర్‌తో వివాహేతర సంబంధం.. భర్త చంపిన భార్య..!
కర్ణాటక: అక్రమ సంబంధం బయట పడటంతో ప్రాణాలకు ముప్పు ఉందని భావించిన ఓ వ్యక్తి తన ప్రియురాలి భర్తను కడతేర్చాడు. ఈ ఘటన బెంగళూరు ఉత్తర తాలూకా మాచోహళ్లిలో చోటుచేసుకుంది. మాచోహళ్లిలో విజయ్‌కుమార్(35), ఆశ దంపతులు నివాసం ఉంటున్నారు. విజయ్‌కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఆశ ఆటోడ్రైవర్ ధనంజయ్(35)తో సన్నిహితంగా ఉంటోంది. ఈ విషయం తెలిసి విజయ్‌కుమార్ గొడవ పడగా పంచాయితీ పోలీసుల వద్దకు చేరింది. సర్దిచెప్పి రాజీ చేసి పంపించారు. అయినప్పటికీ ఆశ ధనంజయ్‌తో సంబంధం కొనసాగించింది. మరో వైపు ధనంజయ్‌ని చంపేస్తానని విజయ్‌కుమార్ చెప్పుకుని తిరుగుతుండేవాడు. దీంతో విజయ్‌కుమార్‌ని హత్య చేయాలని ధనంజయ స్కెచ్ వేశాడు. పథకం ప్రకారం సోమవారం రాత్రి విజయ్‌కుమార్ ఇంట్లోంచి బయటకు రాగానే తన గ్యాంగ్‌తో కలిసి మారణాయుధాలతో దాడి చేసి హత్య చేసినట్లు మాదనాయకనహళ్లి పోలీసులు నిర్ధారించారు. ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి భార్య ఆశను అదుపులోకి తీసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. ∙

ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్ సుజాత
వికారాబాద్: లంచం తీసుకుంటూ ఓ మహిళా ఉద్యోగి ఏసీబీ అధికారులకు చిక్కింది. కలెక్టరేట్లో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నవాబుపేట మండలం వట్టిమీనపల్లికి చెందిన ఓ రైతు తన రెండెకరాల అసైన్డ్ భూమికి సంబంధించి రికార్డుల్లో తన తల్లి పేరు నమోదు చేయించేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. తహసీల్దార్ కార్యాలయం నుంచి వచ్చిన ఫైల్‌ను ఈ– సెక్షన్ నుంచి కలెక్టర్ పేషీకి పంపించాల్సి ఉంది. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సుజాత ఇందుకోసం రూ.5 వేలు డిమాండ్ చేసింది. ఈ మొత్తాన్ని పదిహేను రోజుల క్రితమే రైతు నుంచి గూగుల్ పే చేయించుకుంది. అనంతరం కలెక్టర్ ప్రొసీడింగ్ ఇవ్వగా.. తిరిగి ఆ కాపీని తహసీల్దార్ ఆఫీసుకు పంపించాల్సిఉంది. రోజులు గడుస్తున్నా ఫైల్ రాకపోవడంతో బాధితుడు వెళ్లి జూనియర్ అసిస్టెంట్ సుజాతను కలిశాడు. దీనిపై స్పందించిన ఆమె ప్రొసీడింగ్ కాపీ తహశీల్దార్ కార్యాలయానికి పంపాలంటే రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. రూ.15,000 బేరం కుదిరిన అనంతరం బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు సుజాతకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఆమెను పట్టుకున్నారు. ఈ– సెక్షన్లో సోదాలు నిర్వహించి, పలు ఫైళ్లను పరిశీలించారు. ఆమెను అదుపులోకి తీసుకుని, ఈ వ్యవహారంలో మరెవరి పాత్రయినా ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. నిందితురాలిని ఏసీబీ కోర్డులో హాజరు పర్చి, రిమాండ్‌కు తరలిస్తామని వెల్లడించారు. లంచం అడిగితే 1064 కాల్ చేయండి.. అధికారులు, ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే తమను సంప్రదించాలని, ఇందుకోసం 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు చెప్పాలని ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టంచేశారు.

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. నగర యువతి దుర్మరణం
హైదరాబాద్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన విద్యారి్థని దుర్మరణం చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. సిద్దిపేటకు చెందిన శ్రీనివాస వర్మ తన కుటుంబంతో కలిసి 15 ఏళ్ల కిత్రమే నగరానికి వలస వచ్చాడు. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ బాలాజీ కాలనీలో నివాసముంటున్నాడు. ఇతనికి భార్య హేమలత, శ్రీజ వర్మ (23), శ్రీయ వర్మ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శ్రీనివాస వర్మ బౌరంపేటలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో ట్రాన్స్పోర్ట్ ఇన్చార్జిగా హేమలత ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. శ్రీజ వర్మ మాస్టర్స్ చదివేందుకు మూడేళ్ల క్రితం అమెరికాలో వెళ్లింది. చార్లెస్టన్లోని ఈస్టర్న్ ఇల్లినోయిస్ యూనివర్సిటీలో కంప్యూటర్స్‌లో మాస్టర్స్ పూర్తి చేసిన శ్రీజ వర్మ ప్రస్తుతం ఉద్యోగ అన్వేషణలో ఉంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం తన స్నేహితురాలితో కలిసి భోజనం తెచ్చుకునేందుకు తాము నివసిస్తున్న అపార్ట్మెంట్ పక్కనే ఉన్న రెస్టారెంట్‌కు వెళ్తున్నారు. వెనుక నుంచి వచి్చన ట్రక్కు శ్రీజను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. రోడ్డు ప్రమాదంలో కూతురు చనిపోయిందన్న విషాద వార్త విని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. బాలాజీ కాలనీలోని శ్రీజ ఇంటి వద్ద విషాద ఛాయలు అలముకున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి శ్రీజ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని బంధువులు కోరుతున్నారు.