దాల్మియా పరిశ్రమతో నష్టపోతున్న ప్రజలకు న్యాయం చే స్తామని జిల్లా కలెక్టర్ శ్రీధర్‌చెరకూరి పేర్కొన్నారు. ప్రజాభిప్రాయం సేకరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రెండు, మూడు సార్లు ఆర్డీఓ గ్రామాల్లో పర్యటించి తనకు నివేదిక ఇచ్చారని, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు పలుమార్లు సమస్యను తన దృష్టికి తెచ్చారని అన్నారు. దుగ్గనపల్లి గ్రామ ప్రజలను తాము కోరుకున్న ప్రాంతానికి తరలించటానికి యాజమాన్యం ఒప్పుకుందని, పంట భూములకు సైతం పరిహారం ఇప్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ఒప్పుకున్న మేరకు పరిశ్రమ యాజమన్యాం నడుచుకోకపోతే లైసన్సు రద్దు చేయడానికి వెనుకాడబోమన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సాయిశ్రీ, పర్యావరణశాఖ అధికారి సుధ కురుబ, చీఫ్ ఇంజినీర్ మునిస్వామినాయుడు, దాల్మియా డైరెక్టర్ నిపున్ భార్గవ్, తదితరులు పాల్గొన్నారు.