ఈకేవైసీ చేయించుకునేందుకు డీలర్ల వద్దకు వెళుతున్న ప్రజల్లో చాలామందికి వేలిముద్రలు పడకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. అలాంటి వారికి వీఆర్వో లాగిన్‌లో ఫేస్ రికగ్నైజేషన్ వెసలుబాటు ఉందని అధికారులు అంటున్నప్పటికీ వీఆర్వోలు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేలిముద్రలు పడకపోతే ఇలాంటి ఆప్షన్ ఉందని తెలియని చాలా మంది నిరక్షరాస్యులు ఇంటికి తిరుగుముఖం పడుతున్నారు. ఇలాంటి వారంతా వచ్చేనెల నుంచి కార్డు కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరికొంత గడువు ఇచ్చి సాంకేతిక పరమైన సమస్యలు లేకుండా చూసి అందరూ ఈకేవైసీ చేయించుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
– కె.మునెయ్య, రామరాజుపల్లె, కడప