
మాపై అసత్య ఆరోపణలు
పోరుమామిళ్ల : ఈనాడు దినపత్రికలో శనివారం ప్రచురించిన కథనంపై ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి తీవ్రంగా స్పందించారు. ‘గోవింద.. ఇదీ నీ బామ్మ ర్ది భూదందా!’ శీర్షికతో ఈనాడు లో వచ్చిన కథనంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఇద్దరు బామ్మర్దులు ఉండగా.. ఒకరు శంకర్‌రెడ్డి ప్రమాదంలో మరణించారని, మరొకరు వెంకట్రామిరెడ్డి అన్నా రు. ఆయనకు భూదందాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తనకు, తన బామ్మర్ది వెంకట్రామిరెడ్డికి ఎలాంటి సంబంధం లేని వార్త వండి వైఎస్సార్‌సీపీకి, మాకు అంటగట్టడం కరెక్టు కాదన్నారు. తమ పై చేసిన ఆరోపణలు అసత్యమని తెలిపారు. ఎవరైనా అక్రమాలు, కబ్జాలకు పాల్పడినపుడు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అడ్డు చెప్పబోమన్నారు. వాస్తవాలు తెలుసుకొని వార్తలు రాయాలని, ఇలా అడ్డదిడ్డంగా వార్తలు రాసి ఈనాడు పరువు దిగజార్చుకోవద్దని ఆయన సూచించారు.
ఈనాడు కథనంపై
ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఖండన