ఎండలు అదరగొడుతున్నాయి. పొగలు కక్కుతున్న భానుడి దెబ్బకు రోడ్లపై సెగలు పుడుతున్నాయి. గతేడాదితో పోలిస్తే సీజన్‌ ప్రారంభంలోనే ఎండలు చురుక్కుమంటున్నాయి. మార్చి మొదటి వారంలోనే వేడెక్కిన సూరీడు.. నెల దాటేసరికి నిప్పులు కక్కుతున్నాడు. వెరసి జనాలు అల్లాడుతున్నారు. | - | Sakshi
Sakshi News home page

ఎండలు అదరగొడుతున్నాయి. పొగలు కక్కుతున్న భానుడి దెబ్బకు రోడ్లపై సెగలు పుడుతున్నాయి. గతేడాదితో పోలిస్తే సీజన్‌ ప్రారంభంలోనే ఎండలు చురుక్కుమంటున్నాయి. మార్చి మొదటి వారంలోనే వేడెక్కిన సూరీడు.. నెల దాటేసరికి నిప్పులు కక్కుతున్నాడు. వెరసి జనాలు అల్లాడుతున్నారు.

Mar 31 2025 7:06 AM | Updated on Mar 31 2025 7:06 AM

పులివెందుల రూరల్‌ : పది రోజులుగా ఎండల ప్రభావం తీవ్రంగా ఉండడంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయంతో జంకుతున్నారు. ఎండ తీవ్రతకు గురై చాలా మంది అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. ఎండలో తిరగడంవల్ల జ్వరాలతోపాటు దగ్గు, జలుబు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా వేసవి కాలంలో కూడా దగ్గు, జలుబు, జ్వరాలు రావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్‌, మే నెలల్లో ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

వడదెబ్బ నివారణకు అప్రమత్తతే ముఖ్యం

ఎర్రగుంట్ల : ఎండ తీవ్రత అధికమైంది, ప్రస్తుతం జిల్లాలో 40–42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. ఎండలో ఎక్కవగా గడిపితే డీహైడ్రేషన్‌(శరీరంలో నీటి శాతం తగ్గడం) డయేరియా(విరేచనాలు) తదితర సమస్యలతో ఇబ్బంది పడే అవకాశముంది. ఈ నేపథ్యంలో వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎర్రగుంట్ల, చిలంకూరు పీహెచ్‌సీ వైద్యాధికారులు తెలియజేశారు. ప్రజలు వేసవిలో వీలైనంతగా పని చేయకుండా ఉండడం మంచిదని సూచిస్తున్నారు. ఉదయం సాయంత్రం మాత్రమే ప్రజలు పనులు చేసుకోవడం మేలు. ఎండలో ఎక్కువ సేపు పనిచేస్తే చర్మం పొడి బారడం, కళ్లు ఎరుపెక్కడం, ఒళ్లు మంటలు, నొప్పులు వస్తాయి, ఒక్కోసారి అపస్మారక స్థితిలోకి వేళ్లే అవకాశం ఉంది.

నిర్మానుష్యంగా కడప కృష్ణా సర్కిల్‌

వేడెక్కిన సూరీడు..

‘ఉక్క’రిబిక్కిరవుతున్న జనాలు

అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు

ఎండలు అదరగొడుతున్నాయి. పొగలు కక్కుతున్న భానుడి దెబ్బకు 1
1/2

ఎండలు అదరగొడుతున్నాయి. పొగలు కక్కుతున్న భానుడి దెబ్బకు

ఎండలు అదరగొడుతున్నాయి. పొగలు కక్కుతున్న భానుడి దెబ్బకు 2
2/2

ఎండలు అదరగొడుతున్నాయి. పొగలు కక్కుతున్న భానుడి దెబ్బకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement