
పోలీస్ స్టేషన్ ఎదుట ట్రాన్స్‌జెండర్ల ఆందోళన
కడప అర్బన్ : సహచర ట్రాన్స్‌జెండర్‌కు మోసం చేసిన కడప నగరం అశోక్ నగర్ చెందిన యువకుడిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కడప నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద పలువురు ట్రాన్స్‌జెండర్‌లు మంగళవారం ఆందోళన నిర్వహించారు. వివరాలు ఇలా..దేవి అనే ట్రాన్స్‌జెండర్‌ను సతీష్ అనే యువకుడు ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని చెప్పాడన్నారు. అయితే దేవి ఆరోగ్యం బాగా లేదని వదిలేశాడన్నారు. దీంతో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగేంత వరకు ఆందోళన విరమించమని కూర్చున్నారు. ఈ ఆందోళనపై స్పందించిన కడప వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ బాధితురాలికి న్యాయం జరిగేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఫిర్యాదు చేసిన ట్రాన్స్‌జెండర్‌లతో పాటు యువకుడిని పిలిపించి సీఐ బి.రామకృష్ణ మాట్లాడారు. సమస్య సద్దుమణగడంతో వారు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో కడప ఒన్‌టౌన్ ఎస్‌ఐ అమర్‌నాథ్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.