
అగ్ని ప్రమాదాల నివారణపై పాటించాల్సిన నియమాలు
● ఇంట్లోని వస్తువులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చిన్నపిల్లల దగ్గర అగ్గిపెట్టెలు,లైటర్లు, టపాకాయలు ఇతర మండే పదార్థాలు ఏవీ అందుబాటులో ఉంచరాదు.
● కాల్చిన సిగరెట్లు, బీడీలు, అగ్గిపుల్లలు ఆర్పకుండా అజాగ్రత్తగా పారవేయరాదు.
● ఐ.ఎస్.ఐ ఎలక్ట్రికల్ వైరింగ్ పరికరాలనే ఉపయోగించాలి.
● పాడైన వైర్లను వాడకూడదు. ఓవర్‌లోడ్ వేయకూడదు. ఎలక్ట్రికల్ సాకెట్ నందు దాని కెపాసిటీకి తగిన ప్లగ్‌ను మాత్రమే వాడాలి.
● ఇంటి నుంచి ఎక్కువ రోజులు సెలవులకు బయటకు వెళ్లునపుడు ఎలక్ట్రికల్ మెయిన్ ఆఫ్ చేయడం ఉత్తమం.
● ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగితే ఆర్పటానికి ఎళ్లవేళలా నీటిని ఇంట్లో నిల్వ చేయాలి.
● గ్యాస్ లీకవుతున్నట్లు అనుమానం వస్తే రెగ్యులేటర్ వాల్వ్‌ను ఆపివేయాలి. అలాంటి సమయంలో ఎలక్ట్రికల్ స్విచ్‌లు ఆన్/ఆఫ్ చేయరాదు.
● స్కూల్స్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్‌లలో ఆర్‌సిసి లేదా కాంక్రీట్ శ్లాబులను మాత్రమే పైకప్పుగా వాడాలి.
● ఫైర్ అలారం, ఫైర్ స్మోక్ డిటెక్టర్‌లను అవసరమైన ప్రదేశాలలో ఏర్పాటు చేయాలి. సెల్లార్‌లలో ఆటోమేటిక్ స్ప్రింక్లర్‌లు ఉపయోగించాలి.
● గోడౌన్‌లలో వస్తువులను నిల్వ ఉంచేటపుడు స్టాక్‌లకు మధ్య ఖాళీస్థలం ఉంచాలి.
● గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా ఎండిన గడ్డిని మాత్రమే వాములుగా వేసి, వాటిని నివాస ప్రాంతాలకు దూరంగా ఉండేలా చూసుకోవాలి.
●కర్మాగారాల్లో పనిచేసే కార్మికులకు అగ్నిప్రదేశాలు గుర్తించేలా చేయాలి. వారికి బేసిక్ ఫైర్ ఫైటింగ్‌పై శిక్షణ ఇవ్వాలి.
● విద్యుత్ ప్రమాదాలపై నీటిని ఉపయోగించరాదు. పొడి ఇసుకను మాత్రమే వాడాలి.
● పెట్రోల్ బంక్‌లు, గ్యాస్ గోడౌన్‌లలో వాహనదారులు, బంక్‌ల యందు డీజల్‌గాని, పెట్రోల్‌గాని నింపుకొన్నపుడు వాహనం ఇంజను పూర్తిగా ఆఫ్ చేయాలి.
● వాహనదారులు ఇంధన నింపుకున్న తరువాత కొద్ది దూరం వెళ్లిన తరువాత బండి స్టార్ట్ చేయాలి.
● వాహనదారులు గాని అక్కడ పనిచేస్తున్న సిబ్బందిగానీ పెట్రోల్ బంక్ ఉన్న ప్రదేశంలో బీడీగాని, సిగరెట్‌గాని కాల్పరాదు. సెల్‌ఫోన్ ద్వారా సంభాషించరాదు. నీటివసతి అందుబాటులో ఉండాలి.