లాభాల్లో ప్రపంచ మార్కెట్లు | | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 9 2013 9:59 AM | Last Updated on Thu, Mar 21 2024 9:14 AM

ప్రపంచ స్టాక్‌ మార్కెట్లన్నీ లాభాల్లో ఉన్నాయి. గత రాత్రి అమెరికా మార్కెట్లలో డౌజోన్స్‌ 89 పాయింట్లు లాభపడి 15,224 వద్ద ముగిసింది. నాస్‌డాక్‌ 5 పాయింట్లు పెరిగి 3,484 వద్ద క్లోజయింది. యూరోప్‌ మార్కెట్లు బాగా లాభపడ్డాయి. జర్మనీ సూచీ 2 శాతం లాభపడగా, ఫ్రాన్స్‌ సూచీ 1.83 శాతం, బ్రిటన్‌ సూచీ 1.16 శాతం పెరిగాయి. ఆసియా మార్కెట్లలో జపాన్‌ ఒకటిన్నర శాతం దాకా లాభపడుతోంది. తైవాన్‌, హాంకాంగ్‌ సూచీలు ఒక శాతం దాకా లాభాల్లో ఉన్నాయి. సింగపూర్‌, దక్షిణ కొరియా సూచీలు అర శాతం దాకా లాభపడుతున్నాయి. సింగపూర్ నిఫ్టీ 40 పాయింట్ల దాకా పెరుగుతూ 5,865 వద్ద ట్రేడవుతోంది. బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం 107 డాలర్లకు సమీపంలో ఉంది. ఔన్స్‌ గోల్డ్‌ ధర ఈ ఉదయం 12 డాలర్లకు పైగా పెరుగుతూ 1250 డాలర్లకు సమీపంలో కొనసాగుతోంది. గతరాత్రి ఎంసీక్స్లో 10 గ్రాముల బంగారం ధర 46 రూపాయిలు లాభపడి 26,080 వద్ద ముగిసింది. కేజీ వెండి 40,320 వద్ద ముగిసింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement