దాదాపు అయిదారు నెలల పైగా శ్రమిస్తే కానీ, ఇవాళ ఒక పెద్ద హీరో సినిమా షూటింగ్ వగైరా పూర్తి కావు. అంత కష్టపడితే, ఒక సినిమాకు దక్కే పారితోషికం సింపుల్‌గా వారం పది రోజుల ఒక విదేశీ టూర్... నాలుగైదు డ్యాన్స్‌లకు వస్తే? ఎవరైనా ఎగిరి గంతేసి, ఒప్పుకుంటారు. కానీ, హీరో అల్లు అర్జున్ తన రూటే సెపరేట్ అని నిరూపించారు. డ్యాన్స్‌లు చేయడంలో వెండితెర సెన్సేషన్ అయిన ఈ యువ హీరోను ముంబయ్‌కి చెందిన ఒక ఏజెన్సీ వాళ్ళు సంప్రతించారు. అమెరికాలోని అయిదు నగరాల్లో డ్యాన్స్ షోలలో పాల్గొంటే, ఏకంగా రూ. 11 కోట్ల పారితోషికం ఇస్తామన్నారట! కానీ, మన బన్నీ ఆ ప్రతిపాదనను సున్నితంగా తోసిపుచ్చారు.