live dance show
-
ప్రభుదేవా కన్సర్ట్.. కనీస గౌరవం లేదు, వివక్ష చూపిస్తున్నారు: నటి
నటి సృష్టి డాంగే (Srusti Dange)కు చేదు అనుభవం ఎదురైంది. ప్రభుదేవా నాట్య కచేరి (Prabhu Deva’s VIBE – LIVE IN DANCE CONCERT)లో తనకు సరైన గౌరవం, ప్రాధాన్యత దక్కలేదని వాపోయింది. ఆ వివక్షను భరించలేక లైవ్ షోకు రావాలనుకున్న ఆలోచనను విరమించుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చసింది.ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో.. అయినా..ప్రభుదేవా లైవ్ షోకు నేను వస్తానని ఎదురుచూస్తున్న అందరికీ ఓ విషయం చెప్పాలి. ఆ షోకు నేను రావడం లేదని తెలియజేస్తున్నందుకు చింతిస్తున్నాను. ఈ నిర్ణయానికి, ప్రభుదేవా సర్‌కు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పటికీ, ఎప్పటికీ నేను ఆయనకు పెద్ద అభిమానినే. కాకపోతే ఆ షో నిర్వాహకులు చూపించే వివక్షను నేను భరించలేను. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ నాకు దక్కాల్సిన వాటికోసం నేను ఇప్పటికీ పోరాడాల్సి వస్తోంది. క్షమాపణలు చెప్పట్లేదు..ఇచ్చిన మాటపై నిలబడకపోవడం, అబద్ధపు హామీలివ్వడం నిజంగా విచారకరం. అందుకే కన్సర్ట్కు రాకూడదని ఫిక్సయ్యాను. నేను మీ అందరినీ క్షమించమని అడగడం లేదు. ఎందుకు షోకు హాజరవడం లేదో కారణం చెప్పాలనుకున్నాను. కుదిరితే మరోసారి మంచి వాతావరణంలో, సముచిత గౌరవం దక్కే ప్రదేశంలో మిమ్మల్ని కలుస్తాను.ఎంతో ఆశగా ఎదురుచూశా.. చివరకు!ఈ షో నిర్వాహకులకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. క్రియేటివ్ టీమ్.. ఆర్టిస్టులను గౌరవిస్తే బాగుంటుంది. ఈ ప్రాజెక్టు గురించి ఎంతో ఆశగా ఎదురుచూశాను. దురదృష్టవశాత్తూ దానికి దూరంగా ఉండక తప్పడం లేదు అని రాసుకొచ్చింది. దీనిపై ప్రభుదేవా టీమ్ స్పందించాల్సి ఉంది. ప్రభుదేవా నాట్యకచేరి ఫిబ్రవరి 22న చెన్నైలో జరగనుంది. ఇక సృష్టి డాంగే తమిళంలో పలు సినిమాలు చేసింది. తెలుగులో ఏప్రిల్ ఫూల్, ఓయ్ నిన్నే, చంద్రముఖి 2 చిత్రాల్లో మెరిసింది. View this post on Instagram A post shared by S r u s h t i i D a n g e 🦋💫 (@srushtidangeoffl) చదవండి: ఛత్రపతి శివాజీగా ఆయన బాగా సెట్ అవుతారు: పరుచూరి గోపాలకృష్ణ -
12 కోట్ల ఆఫర్‌కు... బన్నీ నో!
-
12 కోట్ల ఆఫర్‌కు... బన్నీ నో!
దాదాపు అయిదారు నెలల పైగా శ్రమిస్తే కానీ, ఇవాళ ఒక పెద్ద హీరో సినిమా షూటింగ్ వగైరా పూర్తి కావు. అంత కష్టపడితే, ఒక సినిమాకు దక్కే పారితోషికం సింపుల్‌గా వారం పది రోజుల ఒక విదేశీ టూర్... నాలుగైదు డ్యాన్స్‌లకు వస్తే? ఎవరైనా ఎగిరి గంతేసి, ఒప్పుకుంటారు. కానీ, హీరో అల్లు అర్జున్ తన రూటే సెపరేట్ అని నిరూపించారు. డ్యాన్స్‌లు చేయడంలో వెండితెర సెన్సేషన్ అయిన ఈ యువ హీరోను ముంబయ్‌కి చెందిన ఒక ఏజెన్సీ వాళ్ళు సంప్రతించారు. అమెరికాలోని అయిదు నగరాల్లో డ్యాన్స్ షోలలో పాల్గొంటే, ఏకంగా రూ. 12 కోట్ల పారితోషికం ఇస్తామన్నారట! కానీ, మన బన్నీ ఆ ప్రతిపాదనను సున్నితంగా తోసిపుచ్చారు. లైవ్ డ్యాన్స్ షోలలో పాల్గొనడం అల్లు అర్జున్‌కు అంతగా ఇష్టం లేని వ్యవహారం. నిర్వాహకులు ఎంత ఇస్తామన్నా అందుకు ఆయన వ్యతిరేకం. అందుకే, ఈ 12 కోట్ల ఆఫర్‌ను ఆయన కాదన్నట్లు బన్నీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కానీ, విచిత్రం ఏమిటంటే - ఇంత పారితోషికం ఇస్తుంటే, ఒప్పుకోక ఏం చేస్తారనుకున్నారో ఏమో ఈ డ్యాన్స్ షోలకు అల్లు అర్జున్ ఒప్పేసుకున్నారని సదరు నిర్వాహకులు ప్రచారం చేసేసుకున్నారట!