12 కోట్ల ఆఫర్‌కు... బన్నీ నో! | Bunny rejected offer of 12 crore | Sakshi
Sakshi News home page

12 కోట్ల ఆఫర్‌కు... బన్నీ నో!

Published Tue, Jun 16 2015 11:27 PM | Last Updated on Sun, Jul 14 2019 3:40 PM

12 కోట్ల ఆఫర్‌కు... బన్నీ నో! - Sakshi

12 కోట్ల ఆఫర్‌కు... బన్నీ నో!

దాదాపు అయిదారు నెలల పైగా శ్రమిస్తే కానీ, ఇవాళ ఒక పెద్ద హీరో సినిమా షూటింగ్ వగైరా పూర్తి కావు. అంత కష్టపడితే, ఒక సినిమాకు దక్కే పారితోషికం సింపుల్‌గా వారం పది రోజుల ఒక విదేశీ టూర్... నాలుగైదు డ్యాన్స్‌లకు వస్తే? ఎవరైనా ఎగిరి గంతేసి, ఒప్పుకుంటారు. కానీ, హీరో అల్లు అర్జున్ తన రూటే సెపరేట్ అని నిరూపించారు. డ్యాన్స్‌లు చేయడంలో వెండితెర సెన్సేషన్ అయిన ఈ యువ హీరోను ముంబయ్‌కి చెందిన ఒక ఏజెన్సీ వాళ్ళు సంప్రతించారు. అమెరికాలోని అయిదు నగరాల్లో డ్యాన్స్ షోలలో పాల్గొంటే, ఏకంగా రూ. 12 కోట్ల పారితోషికం ఇస్తామన్నారట! కానీ, మన బన్నీ ఆ ప్రతిపాదనను సున్నితంగా తోసిపుచ్చారు. 

లైవ్ డ్యాన్స్ షోలలో పాల్గొనడం అల్లు అర్జున్‌కు అంతగా ఇష్టం లేని వ్యవహారం. నిర్వాహకులు ఎంత ఇస్తామన్నా అందుకు ఆయన వ్యతిరేకం. అందుకే, ఈ 12 కోట్ల ఆఫర్‌ను ఆయన కాదన్నట్లు బన్నీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కానీ, విచిత్రం ఏమిటంటే - ఇంత పారితోషికం ఇస్తుంటే, ఒప్పుకోక ఏం చేస్తారనుకున్నారో ఏమో ఈ డ్యాన్స్ షోలకు అల్లు అర్జున్ ఒప్పేసుకున్నారని సదరు నిర్వాహకులు ప్రచారం చేసేసుకున్నారట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement