తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పూర్తిగా కోలుకోవాలని అభిమానులు పూజలు చేస్తున్నారు. వీవీఐపీలు చెన్నై అపోలో ఆస్పత్రికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. జయలలిత క్రమంగా కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. ఇక అమ్మ ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు చెక్ పెట్టేందుకు అన్నాడీఎంకే నేతలు ఓ ఐటీ డెస్క్ ను ఏర్పాటుచేశారు. అయినా జయలలిత ఆరోగ్యంపై వదంతులు ఆగడం లేదు.