హయత్నగర్ మండలం పెద్దఅంబర్పేట వద్ద గల ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.. క్షతగాత్రులను కొత్తపేటలోని ఓజోన్ ఆసుపత్రికి మరికొంతమందిని సన్రైజ్ ఆసుపత్రికి తరలించారు. అయితే బస్సు డ్రైవర్ సునీల్ (35) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Published Fri, Sep 30 2016 9:52 AM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement