: ‘‘ఈనాడు అధినేత రామోజీరావు గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు. ఈ రోజు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. బయ్యారం గనులతో నాకు సంబంధం ఉన్నట్లు ఈనాడు పేపర్‌లో రామోజీరావు రాసిన అడ్డగోలు రాతలపై స్పందించక తప్పడంలేదు. ఆ గనులకు, నాకు ఎటువంటి సంబంధం లేదని ఎన్నిసార్లు చెప్పినా రామోజీరావుకు దున్నపోతుమీద వర్షం కురిసినట్టే ఉంది. బయ్యారం గనులనేవి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే కొత్తగా పుట్టలేదు. దివంగత ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడే బయ్యారం గనులు ఉన్నాయి. అవి నాసిరకం గనులు కనుకనే చంద్రబాబు వాటిని వదిలేశాడు, అదే నాణ్యమైన గనులైతే ఈ పాటికి తన అనుచరులైన నామా నాగేశ్వరరావుకో, సుజనాచౌదరికో, సీఎం రమేష్‌కో అప్పగించేవారు. ఎందుకూ పనికిరాని భూముల్లో పరిశ్రమలు వస్తే.. అక్కడ పెట్టుబడులకు ఆహ్వానిస్తే వేలమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించవచ్చనే సదుద్దేశంతో దివంగత వైఎస్సార్ ప్రభుత్వ నిబంధనల మేరకు కేటాయింపులు జరిపారు. రక్షణ స్టీల్ కేటాయింపుపై గతంలో ఎన్నోసార్లు చర్చలు జరిగినప్పుడు.. దానికి కేటాయించిన విధి విధానాలు, ఒప్పందాలపై సంబంధిత యాజమాన్యాలు వివరణ ఇచ్చుకున్నాయి. రక్షణ స్టీల్స్‌కు, ప్రభుత్వానికి మధ్య జరిగిన కేటాయింపులు, ఒప్పందాలతో నాకేమీ సంబంధం లేదని గతంలోనే చెప్పాను. చంద్రబాబు, రామోజీరావు నీతినిజాయితీల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది’’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల దుయ్యబట్టారు. వైఎస్సార్ జనభేరిలో భాగంగా ఆమె మంగళవారం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం, దర్శి, పర్చూరు నియోజకవర్గాల్లో ప్రసంగించారు.
Published Wed, Apr 30 2014 8:17 PM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement