కాయాకష్టం చేసుకొని మురికి వాడల్లో బతికే అమాయక కూలీలను కల్తీమద్యం కాటేసింది. మత్తులో తూలడానికి తాగిన మద్యం వారి ప్రాణాలు తీసింది. ముంబయిలో కల్తీ మద్యం తాగి 25మంది ప్రాణాలు కోల్పోయారు. సుబర్బన్ మలాద్ వద్ద గల లక్ష్మీనగర్ మురికి వాడలో ఈ ఘటన చోటుచేసుకుంది.