ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు ప్రైవేట్ యూనివర్శిటీలను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖపట్నంలో రెండు, శ్రీసిటీ, చిత్తూరులో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.