స్పెయిన్ రైలు ప్రమాదంలో 69 మంది మృతి | 69 die in spanish derailment | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 25 2013 1:36 PM | Last Updated on Fri, Mar 22 2024 11:26 AM

స్పెయిన్లో శరవేగంగా వెళ్తున్న రైలు పట్టాలు తప్పడంతో 69 మంది మరణించగా, దాదాపు 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. వాయవ్య స్పెయిన్లోని శాంటియాగో డి కాంపోస్టెలా నగరంలో ఈ ప్రమాదం జరిగింది. స్పెయిన్లో రాత్రి 9 గంటలకు.. అంటే భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో మాడ్రిడ్-ఫెరాల్ మార్గంలో ఓ స్టేషన్ వద్దకు రైలు వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. తమకు గట్టి శబ్దం వినిపించిందని, తర్వాత రైలు ముక్కలు ముక్కలుగా విడిపోయిందని స్థానికులు చెప్పారు. ఇంజన్తో పాటు మొదటి నాలుగు బోగీలు పట్టాలు తప్పగా మరో బోగీ బోల్తాపడింది. ఇంకొన్ని బోగీలు కూడా ఒక పక్కకు పడిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పూర్తిగా చీకటి పడేలోపు 15 మృతదేహాలను వెలికితీయగలిగారు. దాదాపు 200 మంది గాయపడినట్లు టివిఇ టెలివిజన్ పేర్కొంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement