Train derailment
-
గోండా రైలు ప్రమాదం.. ‘పేలుడు శబ్దం విన్నా’: లోకోపైలట్
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని గోండా జిల్లాలో దిబ్రూఘఢ్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పి నలుగురు చనిపోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా, గాయపడిన 17 మందికి ప్రయాణికులకు చికిత్స అందుతోంది. అయితే ప్రమాదానికి గల కారణాలపై రైల్వే శాఖ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఈలోపు లోకోపైలట్ (డ్రైవర్) మీడియాతో చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి.‘రైలు పట్టాలు తప్పడానికి ముందు భారీ పేలుడు శబ్ధం విన్నా’అని అన్నారాయన. అయితే ఇందులో కుట్ర కోణాన్ని ఇప్పుడే నిర్ధారించలేమని రైల్వే అధికారులు అంటున్నారు. ప్రమాదంపై ఇప్పటికే ఉన్నతస్థాయి దర్యాప్తు ప్రారంభమైందని అధికారులు చెబుతున్నారు. బుధవారం రాత్రి రైలు నెంబర్ 15904 చండీగఢ్ రైల్వే స్టేషన్ నుంచి దిబ్రూఘఢ్(అసోం)కు బయల్దేరింది. గురువారం మధ్యాహ్న సమయంలో గోండా-మంకాపూర్ సెక్షన్లో మోతిఘడ్ స్టేషన్ దాటాక.. పికౌరా వద్ద ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి రూ.10 లక్షలు, తీవ్రగాయాలైన వారికి రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50,000 చొప్పున రైల్వే మంత్రిత్వ శాఖ ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. Gonda Train Derailment | Ex gratia of Rs. 10 lakhs to the family of the deceased, Rs 2.5 lakhs for grievous injury and Rs. 50,000 to the minor injured, has been announced. Apart from the CRS enquiry, a high-level enquiry has been ordered: Ministry of Railways pic.twitter.com/0mDy97pheD— ANI (@ANI) July 18, 2024 -
మధ్యప్రదేశ్ రైలు ప్రమాద హెల్ప్ లైన్ నంబర్లు
మధ్యప్రదేశ్ రైలు ప్రమాద దుర్ఘటనకు సంబంధించి పశ్చిమ మధ్య రైల్వే హెల్ప్ లైన్ నంబర్లను ప్రకటించింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 160 కిలోమీటర్ల దూరంలోని ఖిర్కియా-హర్దా స్టేషన్ల మధ్య మాచక్ నదిపై బ్రిడ్జిని దాటుతూ రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు అర్ధరాత్రి పట్టాలు తప్పి, రెండు రైళ్ల ఇంజన్లతో పాటు ఏకంగా పదికి పైగా బోగీలు నదిలోకి పడిపోయిన విషయం తెలిసిందే. హెల్ప్ లైన్ నంబర్లు: ముంబై: 02225280005 భోపాల్: 0755 4001609 హర్దా: 09752460088 బీనా: 07580 222052 ఇటార్సి: 07572 241920 కళ్యాణ్: 02512311499 థానె: 0225334840 -
అమెరికాలో భారీ పేలుడు
వాషింగ్టన్: అమెరికాలోని వర్జీనియా రాష్ల్రంలో భారీ పేలుడు సంభవించింది. ముడి చమురు తరలిస్తున్న రైలు సోమవారం పట్టాలు తప్పడంతో పశ్చిమ వర్జీనియాలో ఈ పేలుడు జరిగింది. రైలులోని 100 కార్స్(ముడి చమురుతో ఉన్న బోగీలు)లో 30 పట్టాలు తప్పినట్టు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే మంటలంటుకోవడంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో కనావా, ఫెయెటీ కౌంటీల్లో అత్యవసరస్థితి ప్రకటించారు. సంఘటనా స్థలానికి ఒక కిలోమీటరకు దూరం వరకు ఉన్న నివాసితులు ఖాళీ చేయాలని పోలీసులు కోరారు. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలు తెలియలేదు. ఈ దుర్ఘటనలో ఎవరూ గాయపడలేదని సీఎన్ఎన్ తెలిపింది. రైలులోని ముడి చమురు కనావా నదిలో కలిసింది. కనావా, ఫెయెటీ కౌంటీ వాసులకు మంచినీరు అందించే ఈ నదిలో చమురు కలవడంతో తాగునీటి కొరత ఏర్పడే అవకాశముంది. దీంతో మంచినీటిని నిల్వచేసుకోవాలని పశ్చిమ వర్జీనియా గవర్నర్ ఎర్ల్ రే తొంబ్లిన్ విజ్ఞప్తి చేశారు. -
ఘోరం..
పట్టాలు తప్పిన బెంగళూరు - ఎర్నాకుళం ఇంటర్ సిటీ హొసూరుకు దగ్గరలోని కర్పూరు వద్ద ప్రమాదం 9 మంది మృతి,10 మందికి తీవ్రగాయాలు బెంగళూరు:ప్రయాణం ప్రారంభించిన దాదాపు గంటలోపే వారు ఊహించని ప్రమాదం ఎదురైంది. పట్టాలు తప్పిన రైలు అనేక మంది జీవితాలను కుదిపేసింది. బెంగళూరు సిటీ రైల్వేస్టేషన్ నుంచి ఉదయం 6.25గంటలకు బయలుదేరిన బెంగళూరు-ఎర్నాకుళం ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ కర్ణాటక-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలోని హొసూరుకు సమీపంలో కర్పూరు వద్ద పట్టాలు తప్పింది. బెంగళూరు నుంచి బయలుదేరిన గంట వ్యవధిలోనే ఉదయం 7.30గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 9మంది ప్రయాణికులు మరణించారు. ఇందులో ఒక బాలుడు,ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. 10 మందికి తీవ్రగాయాలు కాగా మరో పదిమందికి స్వల్పంగా గాయాలయ్యాయని రైల్వే అధికారులు ప్రకటించారు. మృతదేహాలకు పోస్ట్‌మార్టమ్ నిర్వహించిన అనంతరం బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, ఏడుగురికి స్పర్శ్ ఆస్పత్రిలో, ఒకరికి సంజయ్ గాంధీ ఆస్పత్రిలో మిగిలిన వారికి నారాయణ ఆస్పత్రిలో చికిత్సను అందజేస్తున్నారు. కాగా ప్రమాదంలో చిన్నపాటి గాయాలైన వారికి స్థానికంగా ప్రథమ చికిత్స అందించి వారి వారి గమ్యస్థానాలకు చేర్చినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఎలా జరిగిందంటే.... బెంగళూరు నుండి బయలుదేరిన బెంగళూరు-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మొత్తం 22 బోగీలున్నాయి. ఇందులో ఎక్కువగా కేరళాకు చెందిన ప్రయాణికులు ఉన్నారు. హొసూరుకు దగ్గర్లోని కర్పూర్ (కర్ణాటక) వద్ద పట్టాలకు అడ్డంగా పడి ఉన్న పెద్ద కొండరాయిని గమనించిన డ్రైవర్ అకస్మికంగా బ్రేక్ వేయడంతో రైలులోని డీ8 బోగి మొదట పట్టాలు తప్పింది. కళ్లుమూసి తెరిసేలోపు డీ9 బోగి... డీ8 బోగిలోకి చొచ్చుకుపోవడంతో అందులో ఉన్న ప్రయాణికుల్లో తొమ్మిది మంది విగత జీవులు కాగా, పది మంది తీవ్రంగా గాయపడ్డారు. అటు పై డీ10, డీ11లు కూడా పట్టాలు తప్పాయి. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే వెలువడిన పెద్ద శబ్దాన్ని గుర్తించిన గ్రామస్థులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా ప్రమాదం గురించిన సమాచారాన్ని తెలుసుకున్న రైల్వే, వైద్య తదితర శాఖలకు చెందిన అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. ఈ సంఘటనా స్థలాన్ని కేంద్ర మంత్రి సదానందగౌడ, రాష్ట్ర మంత్రులు రామలింగారెడ్డి, కె.జె.జార్జ్, యూటీ ఖాదర్‌లు సందర్శించారు. మృతుల్లో ఎక్కువ మంది కేరళావాసులే.... ప్రమాద బాధితుల్లో చాలా మంది కేరళాకుచెందిన వారే. వారాంతం కావడంతో బెంగళూరులోని వివిధ రంగాల్లో ఉద్యోగాల్లో ఉన్నవారు స్వస్థలానికి వెలుతూ ప్రమాదానికి గురయ్యారు. కాగా మొత్తం 9 మంది చనిపోగా వారిని అమన్(9), ఇథిరాఆంటోని(57),పుణీతావతి(61), సి.ఆర్.వేణుగోపాల్(53), వి.వి.విపిన్(23), నజీమ్‌ఖాన్(67), జార్జ్(70), అయేషాఖాన్(24), ఇర్షామునాఫ్(24), గా గుర్తించారు. సంఘటనకు సంబంధించి రైల్వే అధికారులు వివిధ ప్రాంతాల్లో హెల్ప్‌లైన్‌న్లు ఏర్పాటు చేశారు. రెండు లక్షలు పరిహారం..... రైలు ప్రమాద ఘటనలో మృతి చెందిన వారికి ప్రధాని నరేంద్రమోదీ తన సంతాపాన్ని ప్రకటించారు. ఇక రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు శుక్రవారం సాయంత్రం ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదంలో మరణించిన వారి కుంటుంబాలకు కేంద్ర సురేష్‌ప్రభు రూ.2 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. అదేవిధంగా ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చికిత్సకు రూ.50వేలు, సాధారణంగా గాయపడిన వారికి రూ.20 వేలను పరిహారం అందించనున్నామని తెలిపారు. ఇక చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ఆయన తెలిపారు. ఇక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ఘటనపై మాట్లాడుతూ.....మృతులు, క్షతగాత్రులకు సంబంధించిన పూర్తి వివరాలు తమకు అందిన అనంతరం పరిహారానికి సంబంధించిన ప్రకటన చేస్తామని శుక్రవారమిక్కడ వెల్లడించారు. హెల్ప్‌లైన్‌న్లు బెంగళూరు: 080-22371166,080-22156553,080-22156554 731666751,9448090599 త్రివేండ్రం-04712321205,2321237,0974679960 ఎర్నాకులం - 04842100317, 0813699773,04842398200 త్రిచూర్-048772424148,2430060 ఆల్వే-04842624143 -
బదియాళలో రైలు బోగీల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన
అంచనా వ్యయం రూ. 750 కోట్లు తొలివిడతలో రూ. 75 కోట్లు విడుదల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా : కేంద్ర మంత్రి ఖర్గే యాదగిరి, న్యూస్‌లైన్ : యాదగిరి సమీపంలోని బదియాళ గ్రామం వద్ద రైల్వే ఫియట్ బోగీల తయారీ పరిశ్రమకు కేంద్ర మంత్రి మల్లికార్జున ఖర్గే ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆర్థిక కార్యాకలాపా అభివృద్ధికి తోడు యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా రైలు బోగీల తయారీ యూనిట్ స్థాపనకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ,. 750 కోట్లు కాగా తొలివిడతలో రూ. 75 కోట్లు విడుదల చేశారని రెండవ విడతలో మరో రూ.75 కోట్లు, మూడవ విడతలో రూ. 300 కోట్లు విడుదల చేయనున్నట్లు వివరించారు. ఈ యూనిట్ స్థాపనతో ఈ ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. జాతీయ పథకం కావడంతో జిల్లా కేంద్రంలోనే యూనిట్ స్థాపనకు శ్రీకారం చుట్టామని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తూ 150 ఎకరాల భూమిని అందించిందని పేర్కొన్నారు. చిక్కమగళూరు - కడూరు, కోలారు - చిక్కబళ్లాపుర, రాయచూరు - గద్వాల రైల్వే మార్గాలను పూర్తి చేస్తామని చెప్పారు. వాడి - గదగ్ రైల్వే మార్గం పనులను త్వరలో చేపట్టనున్నట్లు వివరించారు. దీంతో ఉత్తర కర్ణాటక ప్రాంతంలో హై-క ప్రాంతం ఉంచి గోవాకు రైల్వే మార్గం ఏర్పడుతుందని అన్నారు. చిక్కమగళూరు - సకలేశపుర, చామరాజనగర్ - మళవళ్లి - రామ్‌నగర్ రైల్వే మార్గాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మంత్రి బాబురావు చించననూర్, ఎమ్మెల్యే ఎ.బి.మాలకరెడ్డి, రైల్వే బోర్డు చైర్మన్ అరుణేంద్రకుమార్, మెకానికల్ బోర్డు సభ్యులు అలోక్ జోహరె, సీఎండీ సతీష్ పాల్గొన్నారు. -
స్పెయిన్ రైలు ప్రమాదంలో 69 మంది మృతి