చిత్తూరు జిల్లా నుంచి వైఎస్సార్ జిల్లా రాజంపేటకు వెళుతున్న 74 మంది ఎర్ర చందనం కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులోని వారంతా తమిళనాడుకు చెందిన వారిగా సమాచారం. వీరిని కడప జిల్లా చినమండెం పోలీసులు శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.