వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీని ఓడించే శక్తి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి ఉంది కనుకనే ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి, ఎన్.చంద్రబాబు నాయుడు ఉమ్మడిగా జగన్‌పై విషప్రచారంతో దాడి చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీకి పరస్పరం విభేదాలున్నప్పటికీ జగన్ విషయంలో మాత్రం ఒక్కటై దాడి చేస్తున్నారని విమర్శించారు.