పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. దాని ప్రభావంతో శుక్ర, శనివారాల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తర్వాత మరో మూడు రోజులు ఒక మోస్తరు వానలు పడతాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఊపందుకోవడం, అల్పపీడనంతో రాష్ట్రవ్యాప్తంగా గురువారం కూడా భారీ వర్షాలు కురిశాయి. దీంతో చెరువులు, కుంటలు నిండిపోయాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.
Published Fri, Sep 23 2016 7:03 AM | Last Updated on Thu, Mar 21 2024 9:51 AM
Advertisement
Advertisement
Advertisement