ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రత్యేక హోదాతోనే ముడిపడి ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేదం అమలు చేస్తే ఆదాయం తగ్గిపోతుందనే వాదన సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మద్యపాన నిషేదం అమలు చేస్తున్న గుజరాత్, బిహార్ లాంటి రాష్ట్రాలు నిజమైన అభివృద్ధి చెందుతున్నాయన్న విజయ సాయిరెడ్డి... ఏపీలో అభివృద్ధి కేవలం పేపర్ల వరకే పరిమితమైందన్నారు