ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రివాల్ ను గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటన హర్యానాలోని చర్కి దాద్రిలో ప్రచారం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తిపై ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు దాడి చేసినట్టు తెలిసింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మెడపై బలంగా కొట్టారని కేజ్రివాల్ తెలిపారు. ఇలాంటి దాడికి పాల్పడుతారనే విషయం తమకు ముందుగానే తెలుసని, ఈ ఘటన ద్వారా వారి వైఖరి తేటతెల్లమైందని కేజ్రివాల్ అన్నారు. అయితే దాడికి పాల్పడిన వ్యక్తిపై ఆప్ కార్యకర్తలు ప్రతిదాడి చేయడం తనను బాధించిందని కేజ్రివాల్ ట్విట్ చేశారు. ఆప్ కార్యకర్తలు కూడా హింసాత్మకంగా దాడి చేయడం తప్పని ఆయన అన్నారు. ఇక ముందు ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడవద్దని కార్యకర్తలకు కేజ్రివాల్ సూచించారు.
Published Fri, Mar 28 2014 8:41 PM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement