2.5 లక్షలతో నీ కూతురి పెళ్లి చేయగలవా? | arvind kejriwal dares arun jaitley on currency ban | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 17 2016 2:25 PM | Last Updated on Wed, Mar 20 2024 5:03 PM

పాత నోట్లు రద్దుతో నిత్యవసర వస్తువుల కోసం జనం అల్లాడుతున్నారని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల కష్టాలపై ఢిల్లీలో గురువారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ... తినేందుకు డబ్బులు లేక సామాన్య ప్రజలు విలవిల్లాడుతున్నారని తెలిపారు. పెద్ద నోట్లు పట్టుకుని జనం రోడ్డున పడ్డారని వాపోయారు. కొత్త నోట్లుతో అవినీతి అంతమవుతుందా అని ప్రశ్నించారు. కేంద్రం మంచి చేస్తే మెచ్చుకుంటాం, సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తే సహించబోమన్నారు. పెద్ద నోట్ల రద్దులో ఎలాంటి లాజిక్‌ లేదన్నారు. డబ్బుల కోసం దేశవ్యాప్తంగా బ్యాంకుల ముందు బారులు తీరిన వారిలో 40 మంది మృతి చెందారని వెల్లడించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement