లక్ష్యం నెరవేరేనా? | ban on high denominations leads side track | Sakshi

Nov 13 2016 7:37 AM | Updated on Mar 20 2024 5:04 PM

ద్దనోట్ల రద్దు నిర్ణయం పెనుదుమారమే లేపింది. సాధారణ పౌరులు నాలుగు రోజులుగా నానాయాతనా పడుతున్నారు. ఈ కష్టాలు ఎప్పుడు గట్టెక్కుతాయో తెలియదు. తమ నేరం లేకుండానే జీవితాలలో ఇంతటి సంక్షోభం ఏర్పడటం వారికి దిగ్భ్రాంతి కలిగించింది. వివాహాది శుభకార్యాలు తలపెట్టినవారూ, ఇల్లు, పొలం అమ్మిన డబ్బును బ్యాంకులో జమకట్టకుండా బద్ధకించినవాళ్ళూ, అటు వంటి అలవాటు లేనివాళ్ళూ, క్యూలో గంటల తరబడి నిలబడలేనివాళ్ళూ, బ్యాంకు ఖాతాలు లేనివాళ్ళూ, డెబిట్‌ కార్డు తెలియనివాళ్ళూ, క్రెడిట్‌కార్డు చూడని వాళ్ళూ, వారాంతంలో కూలీలకు డబ్బు చెల్లించవలసిన ఛోటా కాంట్రాక్టర్లూ, చిన్న దుకాణాలు నడుపుకునే చిరువ్యాపారులూ పడుతున్న అవస్థలు వర్ణనా తీతం. ఇవన్నీ తాత్కాలికమైనవేననీ, నల్లధనాన్నీ, దొంగనోట్లనూ నిర్మూలించాలన్న మహత్తర లక్ష్యం నెరవేరాలంటే ప్రజలు ఈ మాత్రం త్యాగం చేయాలనీ పాలకులు అంటున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement